1999లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఐసీ-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అందులో 188 మంది ప్రయాణికులతో పాటు 15 మంది సిబ్బంది సుమారు 7రోజులు పాటు బందీలుగా ఉంచారు. ఈ ఉదంతాన్ని అనుభవ్ సిన్హా ప్రేక్షకులకు చూపించనున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఎప్పటికీ మరిచిపోలేని ఘటనల్లో ఫ్లైట్ 814 హైజాక్ ఒకటి అని చెప్పవచ్చు. ఇప్పుడు 'ఐసీ814:ది కాంధార్ హైజాక్' పేరుతో వెబ్ సిరీస్ విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
1999లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఐసీ-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు అమృత్‌సర్, లాహోర్, దుబాయ్‌లలో కొద్దిసేపు ల్యాండింగ్ చేసిన ఉగ్రవాదులు ఆ తర్వాత తాలిబాన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌లో ఈ జెట్‌ను ఉంచారు. దేశాన్ని కుదిపేసిన ఈ ఘటన ఎప్పటికీ మరిచిపోలేము. అప్పుడు జరిగిన సంఘటనలను ‘ఐసీ814:ది కాంధార్ హైజాక్’ పేరుతో ఒక వెబ్ సిరీస్‌ను నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఆగష్టు 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో విజయ్ వర్మ, అరవింద్ స్వామి, దియా మీర్జా, నసీరుద్దీన్ షా తదితరులు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment