మారుతున్న రాజకీయాల కారణాలే ఈసారి బడ్జెట్‌ను ప్రభావితం చేసినట్టు న్నాయి. ఉపాధి లేని యువతకు పరి ష్కారం దిశగా అడుగులేసింది బడ్జెట్. విద్య, పారిశ్రామిక అవసరాలకు మధ్య పెరిగిన నైపుణ్య అంతరాన్ని తగ్గించే ప్రయత్నం కనిపిస్తోంది. జాతీయ ఆదా యంలో కీలకభూమిక పోషించే మహిళను వెన్నుతట్టి ప్రోత్సహించే కేటాయింపులు అనివార్యమయ్యాయి. ప్రైవేటు పెట్టుబడు లకు ఊతకర్ర ఇచ్చినా ఫలితాలు అంతంత మాత్రమేనని సర్కార్ గుర్తించింది. ప్రభుత్వ పెట్టుబడి వ్యయం పెంచడమే పరిష్కా రమని గుర్తించింది. సహజ వ్యవసాయ పద్ధతుల మేలుకొలుపు నకు బడ్జెట్ పెద్దపీట వేసింది. ఆశయాలు గొప్పవే. ఆశించిన పురోగతికి కేటాయింపులే గీటురాయి కావు. సరైన వ్యూహ రచన చేస్తేనే లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం. దేశ తక్షణ అవసరాలను బడ్జెట్ గమనించింది. అయితే దీన్ని కార్యాచరణలోకి తెచ్చేముందు సవాళ్ళనూ గుర్తించాలి!
స్థూల జాతీయోత్పత్తి లక్ష్యాలు తగ్గాయి. 2023–24లో జీడీపీ 8.2గా ఉంది. 2024–25లో ఇది 6.5–7.0గా ఉంటుందని అంచనా వేశారు. ద్రవ్యలోటును 5.6 శాతానికి తగ్గించేందుకే ఇలా చేసినట్టు కనిపిస్తోంది. ఇదే క్రమంలో రెవెన్యూ లోటును తగ్గించాలని భావించారు. కోవిడ్ తర్వాత ప్రైవేటు పెట్టుబడు లకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. దీనివల్ల పెద్దగా పెట్టుబడులు వచ్చిందేమీ లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పెట్టుబడి వ్యయాన్ని పెంచారు. స్థూల ఆర్థిక విధానాన్ని సుస్థిర పర్చేందుకు బడ్జెట్ ప్రయత్నించింది.
సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నది కేంద్రం లక్ష్యం. బడ్జెట్ కేటాయింపులూ ఈ విధంగానే ఉన్నాయి. అయితే, ఏక కాలంలో ఈ విధానం అమలు చేయడం సరికాదు. దీనివల్ల ఆహార ఉత్పత్తి తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెబుతు న్నాయి. ప్రస్తుత విధానాలు కొనసాగిస్తూనే మార్పు దిశగా అడుగులేయాలి. సహజ వ్యవసాయానికి ఊతమిచ్చే కొత్త వంగ డాల అభివృద్ధి అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా 10 వేల బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్స్ ప్రారంభిస్తామన్నారు. ఇది మంచి పరి ణామమే. ఇందులో శ్రమ సాంద్రత భాగస్వామ్యమవుతుంది. ఇందులో మహిళా శక్తి కీలకం. వారిని ప్రోత్సహించేలా ఉండాలి. దీనివల్ల గ్రీన్ జాబ్స్‌ను సృష్టించవచ్చు.
దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళా భాగస్వామ్యం కీలకం. పలు సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఇది నిధుల కేటాయింపుతోనే సాధ్యం కాదు. వారిని ఉపాధి వైపు నడిపించేందుకు అవ సరమైన ప్రణాళికలు అవసరం. ‘కౌశల్ యోజన’ వంటి పథకా లను కేంద్రం బడ్జెట్‌లో ప్రస్తావించింది. నైపుణ్యం పెంచుతామని చెప్పింది. నిజానికి దేశంలో మహిళలు ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? ఇందులో నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు ఎన్ని? బడ్జెట్‌లో మరో ముఖ్యాంశం కేర్‌ఎకానమీ. వృద్ధులు, పిల్లల సంరక్షణ ఇందులో భాగం. ఈ దిశగా ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. ఈ విభాగాల్లో 70 శాతం మహిళలే ఉంటారు. కాబట్టి కచ్చితమైన ప్రణాళికలు ఉండాలి. భారత్ పురోభివృద్ధిలో ఉందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. అయితే, భద్రతతో కూడిన ఉపాధి అవకాశాలుండాలని సూచిస్తోంది. ఇప్పటికీ భార త్‌లో 90 శాతం మహిళలు ఇన్ ఫార్మల్ ఉపాధిలోనే ఉన్నారు. ఈపీ ఎఫ్, సెలవులు వంటివి అందు కోవడం లేదు.
పట్టాలున్న యువతలో సరిపోయే పరిజ్ఞానం లేనందువల్ల పరిశ్రమలు వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని యువతను సంతృప్తిపర్చాల్సిన అవసరం ఏర్పడింది. ఉపాధి అవకాశాలు, విద్యకు మధ్య నైపుణ్యం అంతరంగా ఉంది. చదువుతో పాటు నైపుణ్యం పెంచితే తప్ప సమస్య పరిష్కారం కాదు. ప్రైవేటు పెట్టుబడులు పెరిగితే, పరిశ్రమలు పెరుగు తాయని ఇంత కాలం ప్రభుత్వం భావించింది.
కానీ ఎన్ని రాయితీలు ఇచ్చినా వచ్చిన పెట్టుబడులు తక్కువ. పెరిగిన ఉపాధి తక్కువే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పెట్టుబడి వ్యయం పెంచింది. ముఖ్యంగా నైపుణ్యం పెంచడంపై దృష్టి పెట్టింది. అయితే, దీనికి కేటాయించిన నిధులు తక్కువే. ఇక్కడో ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. నైపుణ్యం పెంపునకు కచ్చితమైన అధ్యయనం చేయాలి. అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడే యువతను నాణ్యమైన ఉద్యోగాల వైపు తీసుకెళ్ళడం సాధ్యం. ఏ సెక్టార్ నుంచి ఎలాంటి నైపుణ్యం కావాలనే విషయాన్ని గుర్తించాలి. దీంతో పాటు నాణ్యమైన విద్యా విధానాలను ముందుకు తేవాల్సిన అవసరం ఉంది.
– ప్రొ. ఇ. రేవతి, వ్యాసకర్త, ‘సెస్’ డైరెక్టర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment