ఆదాయపన్ను శ్లాబ్‌లలో పెద్ద మార్పులు లేవు. నేషనల్ పెన్షన్ స్కీమును యథావిధిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు వెసులుబాటు ఉండాలని కోరుకుంటున్నారు. ఐదు లక్షల ఆదాయానికి పన్ను నుండి మినహాయింపు కావాలని కోరుకుంటున్నారు. కానీ మూడు లక్షల దగ్గరనే ఆగిపోయింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమును రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. కానీ ఎటువంటి మార్పులూ లేవు. నిత్యావసర సరుకుల ధరలు వేగంగా పెరుగుతున్న క్రమంలో అందుక నుగుణంగా ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో కూడా మార్పులు చేయాలి.
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బడ్జెట్ తర్వాత మీడియాలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ... ఈ బడ్జెట్ మధ్యతరగతి వారికి చేయూతనిస్తుందన్నారు. కానీ బడ్జెట్‌లో మధ్యతరగతికి వెసులుబాటు కల్పించే ప్రతిపాదనలేమీ కనిపించలేదు. ఈ బడ్జెట్ కూడా మాటల బడ్జెట్‌గానే కనిపించింది.
విద్యారంగానికీ, శిక్షణ –ఉపాధి రంగానికీ కలిపి లక్షా 48 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో ఇది 3 శాతమేనన్న మాట! విద్యారంగం ఒక్కదానికి మాత్రమే కేటాయింపులు చూస్తే 2.5 శాతం లోపే ఉంటాయి. బడ్జెట్ ప్రసంగంలో ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు ఒక్క మాట కూడా లేదు. దీన్ని బట్టి విద్య పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆసక్తీ లేనట్లు కనిపిస్తోంది. విద్య ప్రైవేటీకరణ యథేచ్ఛగా జరిగిపోవడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తోంది.
– అలుగుబెల్లి నర్సిరెడ్డి, వ్యాసకర్త తెలంగాణ శాసనమండలి సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment