ప్రముఖ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇండియా.. భారతీయ మార్కెట్లో 'ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 69.70 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ పొందుతుంది.
లెక్సస్ ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్ కొత్త సిల్వర్ గ్రిల్, రియర్ ల్యాంప్ క్రోమ్ గార్నిష్, ఎల్ఈడీ లైట్ లెక్సస్ లోగోతో కూడిన ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్, లోగో ల్యాంప్, రియర్ సీట్ పిల్లో వంటి ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు మీద 8 సంవత్సరాలు / 160000 కిమీ వారంటీ అందిస్తుంది. కస్టమర్లు 5 సంవత్సరాల వరకు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా పొందవచ్చు.
లెక్సస్ కొత్త కారు లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ భట్టాచార్య మాట్లాడుతూ.. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త ఎడిషన్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఇది లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుందని ఆయన అన్నారు.
2024 ప్రథమార్థంలో, జపనీస్ కార్ల తయారీ కంపెనీ లెక్సస్ భారతదేశంలో 55 శాతం ఈఎస్ కార్లను విక్రయించింది. ఇప్పుడు ఇందులో లగ్జరీ ప్లస్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది కూడా మనషి మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment