బుల్లితెర నటి అవనీత్ కౌర్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. రెండు కోట్ల రూపాయలు విలువ చేసే రేంజ్ రోవర్ కారును తన ఇంటికి తెచ్చుకుంది. ఈ సందర్భంగా కొత్త కారుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఇది నా కల నెరవేరిన సంవత్సరం అని ఎమోషనలైంది.
లగ్జరీ కారు కొన్న అవనీత్‌కు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 20 ఏళ్లకే రూ.2 కోట్ల ఖరీదైన కారును తనకు తాను బహుమతిగా ఇచ్చుకోవడం చాలా గొప్ప విషయం అని ప్రశంసిస్తున్నారు. కాగా పలు సీరియళ్లలో నటించిన అవనీత్ మర్దానీ, మర్దానీ 2 లోనూ మెరిసింది. ఇటీవలే ఆమె కథానాయికగానూ మారింది. కంగనా రనౌత్ నిర్మించిన టికు వెడ్స్ షెరు సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ సరసన నటించింది.
Comments
Please login to add a commentAdd a comment