రూ.5 కోట్లు విలువ చేసే కారు కొన్న యంగ్ హీరో | Actor Kartik Aaryan Bought New Range Rover Car Cost And Details, Photos Video Goes Viral - Sakshi
Sakshi News home page

Kartik Aaryan Buys Range Rover: యంగ్ హీరో గ్యారేజీలో ఆరో కారు.. ఇప్పటికే ఏమేం ఉన్నాయంటే?

Published Fri, Mar 15 2024 7:49 AM | Last Updated on Fri, Mar 15 2024 12:09 PM

Actor Kartik Aaryan New Range Rover Car Cost And Details - Sakshi

తెలుగు హీరోల్లో చాలామంది దగ్గర అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. కాకపోతే వాటి గురించిన సమాచారం పెద్దగా బయటకు రాదు. కొత్త కారు కొన్నా సరే వాళ్లకు తప్పితే బయటకు వ్యక్తులకు తెలిసే అవకాశాలు చాలా తక్కువ. కానీ బాలీవుడ్‌లో మాత్రం కార్ల హడావుడి మామూలుగా ఉండదు. తాజాగా అలానే యంగ్ హీరో.. ఏకంగా రూ.5 కోట్లు విలువ చేసే కారు కొన్నాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

(ఇదీ చదవండి: మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం)

బాలీవుడ్‌లో ప్రస్తుత జనరేషన్ హీరోల్లో కార్తిక్ ఆర్యన్ కాస్త డిఫరెంట్. ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. 'భూల్ భులయ్యా 2', 'సత్య ప్రేమ్ కి కథ' చిత్రాలతో గతేడాది హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం 'భూల్ భులయ్యా 3' చేస్తున్నాడు. ఇప్పటికే పలు లగ్జరీ కార్లని కొనుగోలు చేసిన కార్తిక్ ఆర్యన్.. ఇప్పుడు తన గ్యారేజీలోకి ఏకంగా ఆరో కారుని తీసుకొచ్చాడు.

యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ దగ్గర ఇప్పటికే బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్, మెక్ లారెన్ జీటీ, మినీ కూపర్ ఎస్, లాంబోర్గిని ఊరుస్ క్యాప్సల్, పోర్స్ 718 బాక్స్టర్ లాంటి అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇ‍ప్పుడు లిస్టులోకి రేంజే రోవర్ 4.4p lwb sv కారుని కొనుగోలు చేశాడు. దీని ధర దాదాపు రూ.5 కోట్ల వరకు ఉందట. కారు కొన్న విషయాన్ని ఈ హీరో పోస్ట్ చేయగా, రేటు గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు.

(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement