బర్త్‌ డే స్పెషల్.. ఖరీదైన కారుతో డబుల్ ఇస్మార్ట్‌ నటుడు! | Sanjay Dutt Gifts Himself To Nearly RS 4 Crore Swanky New Range Rover Car | Sakshi
Sakshi News home page

Sanjay Dutt: సంజయ్ దత్‌ బర్త్‌ డే.. లగ్జరీ కారు కొన్న నటుడు!

Published Tue, Jul 30 2024 3:16 PM | Last Updated on Tue, Jul 30 2024 3:51 PM

Sanjay Dutt Gifts Himself To Nearly RS 4 Crore Swanky New Range Rover Car

కేజీఎఫ్ సినిమాతో దక్షిణాదిలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నటుడు సంజయ్ దత్. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న డబుల్ ఇస్మార్ట్‌ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బిగ్‌ బుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.

అయితే జూలై 29న సంజయ్‌ దత్‌ 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీతారలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన బర్త్‌ డే రోజున అద్భుతమైన గిఫ్ట్‌ ఇచ్చుకున్నారు. దాదాపు రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక సినిమాల విషయానికొస్తే  బాలీవుడ్‌లో గుడ్‌ఛాడీ మూవీలో సంజయ్ దత్‌ నటిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్‌తో జతకట్టారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఆగస్టు 9న జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమాలో కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement