తక్కువ ధరలో కారు కొనాలన్నా.. కనీసం ఐదు లక్షలైనా ఉండాలి. లగ్జరీ కార్ల విషయానికి వస్తే కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం రూ. 100 పెడితే లక్షల ఖరీదైన కారు గెలుచుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అస్సాంలో ప్రతి ఏటా నిర్వహించే హౌలీ రాస్ ఫెస్టివల్ (Howly Raas Festival) ముందు నిర్వాహక కమిటీ గత సంవత్సరం మాదిరిగానే లాటరీని నిర్వహించింది. ఇందులో మొదటి బహుమతి రూ.76 లక్షల విలువైన రేంజ్ రోవర్. రెండవ బహుమతి రూ. 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్, స్కార్పియో, మూడవ బహుమతి స్కోడా కుషాక్, నెక్సాన్ ఉన్నాయి.
ఈ ఖరీదైన కార్లను సొంతం చేసుకోవాలంటే కేవలం రూ.100 పెట్టి లాటరీ టికెట్ కొంటే సరిపోతుంది. ఈ లాటరీ అనేది గత 95 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు, విజేతలకు కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాటరీ విషయం తెలిసి చాలామంది టికెట్ కొనటానికి బారులు తీరుతున్నారు.
ఇదీ చదవండి: వారానికి 60 గంటల కంటే ఎక్కువే.. పని గంటలపై ఇదిగో ప్రూఫ్..
లాటరీ టికెట్ కొనుగోలు చేసిన తరువాత విజేతలను 2023 డిసెంబర్ 10న ప్రకటించనున్నారు. లాటరీ టికెట్స్ అమ్మిన డబ్బును వివిధ కార్యక్రమాలను ఉపయోగిస్తారు. ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు రాస్ పండుగను నిర్వహిస్తారు. గతేడాది మొత్తం 3.2 లక్షల లాటరీ టికెట్స్ అమ్ముడయ్యాయి, ఈ సారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment