హార్దిక్‌తో డేటింగ్ రూమర్స్.. ఖరీదైన కారు కొన్న బ్యూటీ! | Ananya Panday Gifts Herself Swanky New Range Rover, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

Ananya Panday: లగ్జరీ కారు కొనుగోలు చేసిన లైగర్ బ్యూటీ.. ఎన్ని కోట్లంటే!

Published Mon, Jul 22 2024 9:20 PM | Last Updated on Tue, Jul 23 2024 11:02 AM

Ananya Panday Gifts Herself Swanky New Range Rover

సినీతారలకు కార్లపై మక్కువ ఎక్కువ. మార్కెట్‌లో ఏదైనా కొత్త బ్రాండ్‌ వచ్చిందంటే గ్యారేజ్‌లోకి రావాల్సిందే. హీరోలైనా, హీరోయిన్లయినా సరే తమ రేంజ్‌కు తగిన కారును కొనేస్తుంటారు. అలా తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఆమె కొన్న రేంజ్ రోవర్ కారు విలువ దాదాపు రూ.3.38 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
కాగా.. లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఇటీవల బ్యాడ్‌ న్యూజ్‌ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. ఈ మూవీలో విక్కీ కౌశల్, త్రిప్తి డిమ్రీ జంటగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అంతే కాకుండా  కాల్ మీ బే అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. హార్దిక్‌తో డేటింగ్!

ఇటీవల అనంత్ అంబానీ బారాత్‌లో క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసి అనన్య డ్యాన్స్ చేసిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. అంతే కాకుండా ఇన్‌స్టాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలు మరింత వైరలయ్యాయి. కాగా.. తన ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్‌లో ఈ ఏడాది మార్చి బ్రేకప్ చేసుకుంది. మరోవైపు హార్దిక్ ఇటీవలే తన భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. అయితే డేటింగ్ రూమర్స్ పై అనన్య పాండే, హార్దిక్ కానీ ఎవరూ స్పందించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement