
లైగర్ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన బ్యూటీ అనన్య పాండే. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మెప్పించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఇటీవల అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది. బారాత్ వేడుకల్లో రణ్‌వీర్ సింగ్, హార్దిక్ పాండ్యాలతో కలిసి చిందులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది.
అయితే ఈ పెళ్లి తర్వాత అనన్య పాండే సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాను ఫాలో అవుతోంది. హార్దిక్ పాండ్యా సైతం అనన్యను ఫాలో అవుతున్నారు. వీరిద్దరూ కలిసి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారా? అంటూ క్రేజీ పోస్టులు పెడుతున్నారు.
ఎందుకంటే ఇటీవల హార్దిక్ పాండ్యా తన భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడిపోయినట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా అనన్య పాండే సైతం తన బాయ్‌ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్‌లో బ్రేకప్ చేసుకుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment