
బాలీవుడ్ భామ అనన్య పాండేపై టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రశంసలు కురిపించింది. ఇటీవల విడుదలైన చిత్రం సీటీఆర్‌ఎల్‌లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుందని సోషల్ మీడియా వేదికగా కొనియాడింది. తప్పక చూడాల్సిన సినిమాల్లో ఇది ఒకటి.. ప్రారంభం నుంచి చివరి దాకా అద్భుతంగా రూపొందించారు. ఇందులో అనన్య పాండే నటన నన్ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన వెంటనే నా ఫోన్ తీసుకుని చాలా యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేశా అంటూ రాసుకొచ్చింది.
కాగా.. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తాజా చిత్రం సీటీఆర్‌ఎల్. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ చిత్రంలో నటుడు విహాన్ సమత్ కూడా నటించారు. అంతకుముందు అనన్య పాండేతో కలిసి కాల్ మీ బే వెబ్ సిరీస్‌లోనూ నటించారు. అంతే కాకుండా విజయ్ దేవరకొండ సరసన లైగర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే.

కాగా.. సమంత ప్రస్తుతం ఇండియన్ వర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్ హనీ బన్నీలో కనిపించునుంది. ఆ తర్వాత పలు చిత్రాలకు ఓకే చెప్పింది. ఇటీవల సామ్ ఈషా ఫౌండేషన్‌లో అమ్మవారికి పూజలు చేస్తూ కనిపించింది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పూజలు చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment