
బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ సరసన మెప్పించింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
ఇదిలా ఉండగా అనన్య పాండే కజిన్ సిస్టర్ అలన్నా పాండే తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చింది. తన భర్తతో కలిసి ఉన్న వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. గతేడాది మార్చిలో ఐవోర్ మెక్‌క్రేని వివాహం చేసుకున్న ముద్దుగుమ్మ.. ఈ ఏడాది ఫిబ్రవరి 28న గర్భం దాల్చినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. ముంబయిలోని హోటల్‌లో జరిగిన వివాహానికి షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.