Pregnant Dipika Kakar quits acting, says 'Want to live life as housewife and mother' - Sakshi
Sakshi News home page

Dipika Kakar: పెళ్లైన ఐదేళ్లకు ప్రెగ్నెన్సీ.. నటనకు గుడ్‌ బై చెప్పిన నటి

Published Mon, May 29 2023 3:12 PM | Last Updated on Mon, May 29 2023 3:42 PM

Pregnant Dipika Kakar QUITS acting says Want to live life as housewife - Sakshi

బుల్లితెర నటి దీపికా కక్కర్‌ యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పింది. ఇక మీదట తన కుటుంబానికి, పుట్టబోయే బిడ్డకు పూర్తి సమయాన్ని కేటాయించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే నటనకు స్వస్తి పలకనున్నట్లు వెల్లడించింది.

(ఇది చదవండి: Adipurush: అదిరిపోయిన రామ్‌ సీతారామ్‌ సాంగ్‌..)

దీపికా కక్కర్‌ మాట్లాడుతూ..'ప్రస్తుతం నేను ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేస్తున్నాను. తల్లి కాబోతున్నానన్న ఫీలింగ్‌ ఎంతో బాగుంది. పెళ్లైన ఐదేళ్ల తర్వాత మేము పేరెంట్స్‌ కాబోతున్నాం. ఆ ఎగ్జయిట్‌మెంట్‌ మరో లెవల్‌లో ఉంది. చిన్నవయసులోనే నేను కెమెరా ముందు మేకప్‌ వేసుకోవడం ప్రారంభించాను. 10-15 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగాను. నా ప్రెగ్నెన్సీ జర్నీ మొదలవగానే షోయబ్‌కి చెప్పా. నాకు పని చేయడం ఇష్టం లేదని.. నటనకు స్వస్తి చెప్పి.. గృహిణిగా, తల్లిగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. 

(ఇది చదవండి: ఇంటికి పిలిచి మరీ అభిమాని ఆఖరి కోరిక తీర్చిన ప్రభాస్‌!)

కాగా... దీపికా కక్కర్‌ 2018లో సహనటుడు షోయబ్‌ ఇబ్రహీంను పెళ్లాడింది. గతేడాది చివర్లో ఆమె ప్రెగ్నెంట్‌ అయిన విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement