
స్టార్ కిడ్‌గా ఎంట్రీ ఇచ్చినా కొన్నిసార్లు అదృష్టం కలిసిరాదు. ఒక్క ఫ్లాప్ రాగానే అవకాశాలు చేజారిపోతుంటాయి. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనన్యకు సినిమా ఫ్లాప్ కావడంతో వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి.
ఊహించని విధంగా లైగర్ డిజాస్టర్ కావడంతో దాని ఎఫెక్ట్ అనన్య మీద గట్టిగానే పడింది. ఆమె నటనను బాగా ట్రోల్ చేసిన నెటిజన్లు అనన్య స్థానంలో వేరే వాళ్లని తీసుకొని ఉంటే బాగుండేదని కామెంట్స్ చేశారు. ఇక లైగర్ రిజల్ట్ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గాయని తెలుస్తుంది. దీంతో చేసేదేమి లేక అనన్య తన రెమ్యునరేషన్ తగ్గించేసిందట.
ఇంతకుముందు సుమారు రూ. 80 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకునే అనన్య ఇప్పుడు దాదాపు రూ. 50 లక్షల వరకు రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి అనన్య అనుకున్నట్లుగా అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment