Land Rover company
-
మొదటిసారి భారత్‌కు రానున్న యూకే కంపెనీ.. తగ్గనున్న ఈ కార్ల ధరలు
యూకే వాహన తయారీ సంస్థ 'ల్యాండ్ రోవర్' మొదటిసారి భారతదేశంలో తన కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో బ్రాండ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ల్యాండ్ రోవర్ భారతదేశంలో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్ల తయారీని ప్రారంభించనుంది. కంపెనీ యూకే వెలుపల తన వాహనాలను ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. భారతదేశం బ్రాండ్‌కు కీలకమైన మార్కెట్ కావడంతోనే సంస్థ ఈ డెసిషన్ తీసుకుంది.రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కోసం ఒక కొత్త అసెంబ్లింగ్ లైన్ మహారాష్ట్రలోని పూణేలోని టాటా మోటార్స్ తయారీ కేంద్రంలో ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్‌లో ఏటా రెండు షిఫ్టులలో 10,000 యూనిట్ల కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రేంజ్ రోవర్ రిటైల్ అమ్మకాలు 160 శాతం పెరిగాయి. అంటే భారతీయులు రేంజ్ రోవర్ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీకి భారత్ ఒక ప్రధానమైన మార్కెట్ అని రేంజ్ రోవర్ మేనేజింగ్ డైరెక్టర్ గెరాల్డిన్ ఇంఘమ్ పేర్కొన్నారు.భారతదేశంలో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు స్థానికంగా తయారైన తరువాత ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. ఇవి రెండూ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. -
Land Rover : జేమ్స్‌బాండ్ స్పెషల్ ఎడిషన్.. ప్రత్యేకతలు ఇవే !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) డిఫెండర్ వీ8 బాండ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.సెప్టెంబర్ 30న విడుదల కానున్న జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’ వేడుకల్లో భాగంగా ఈ ఎడిషన్‌కు రూపకల్పన చేసింది. కేవలం 300 యూనిట్లే డిఫెండర్ వీ8 బాండ్ 300 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది. 5.0 లీటర్ సూపర్చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 386 కిలోవాట్ పవర్, 625 ఎన్ఎం టార్క్, 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. 50.80 సెంటీమీటర్ల సాటిన్ డార్క్ గ్రే వీల్స్‌తో ఎక్స్టెండెడ్ బ్లాక్ ప్యాక్, సిగ్నేచర్ జినాన్ బ్లూ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్, డిఫెండర్ 007 రేర్ బ్యాడ్జ్ పొందుపరిచారు. డిఫెండర్ వీ8 90 వేరియంట్ 5.2 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. చదవండి: ఇండియన్ మార్కెట్లో..వరల్డ్ ఫేమస్ సూపర్ బైక్స్! -
కారు కూడా కాపీనే..
చైనా మొబైళ్ల సంగతి మనకు తెలిసిందే.. కాస్ట్లీ వాటికి కాపీలా ఉంటాయి. ఇప్పుడు వాళ్లు కారును కూడా కాపీ కొట్టేశారు. మోటారు రంగ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ ఇవోక్కు ‘హలో బ్రదర్’ను చైనాకు చెందిన చిన్నపాటి కంపెనీ ల్యాండ్ విండ్ ఈ మధ్యన దింపేసింది. గత వారం జరిగిన ఓ మోటారు షోలో ఎక్స్-7 పేరిట కొత్త వాహనాన్ని ఆవిష్కరించింది. రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే.. ఏది అసలు.. ఏది నకలు అన్నది గుర్తించడం అసాధ్యమే. మీరు చెప్పండి. రెండింటిలో ఏది ఒరిజినలో.. కష్టమే కదూ.. ఇందులో ఎర్ర రంగుది జాగ్వార్ కంపెనీది కాగా.. పచ్చ రంగులో ఉన్నది చైనా కంపెనీది. దీనికితోడు రేటు కూడా చైనా వాళ్ల స్థాయిలోనే చీప్‌గా పెట్టేశారు. జాగ్వార్ కంపెనీ ఇవోక్ను రూ.40 లక్షలకు అమ్ముతుండగా.. ల్యాండ్ విండ్ కంపెనీ ఎక్స్-7ను రూ.13.5 లక్షలకే ఇస్తామని చెబుతోంది. ఈ కాపీ కారుపై జాగ్వార్ కన్నెర్ర చేసింది. త్వరలో ల్యాండ్ విండ్ కంపెనీపై కేసు వేసేందుకు సన్నద్ధమవుతోంది.