విద్యానగర్(గుంటూరు): దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారా.. దేశ రక్షణ దళంలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారా..? అలాంటి వారి కోసం గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన యువకులు ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనవచ్చు.
సర్టిఫికెట్ల పరిశీలన, దేహధారుఢ్యం, శరీర కొలతలు, పోలీస్ వెరిఫికేషన్, వైద్య, రాత పరీక్ష విధానాల ద్వారా ఎంపిక చేస్తారు. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్‌మెన్, సోల్జర్ క్లర్క్, స్టోర్‌కీపర్, టెక్నికల్ క్యాటగిరీల్లో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. 500 పోస్టుల భర్తీకి ఈ ర్యాలీ జరుగుతున్నట్లు రిక్రూటింగ్ డెరైక్టర్ కల్నల్ అఫ్సర్ జాఫ్రి తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఏఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు అనే వివరాలు ఇలా ఉన్నాయి.
పరీక్ష విధానం..
1.6 కిలోమీటర్ల పరుగుపందెం 6 నిమిషాల 20 సెకన్లలోపు పూర్తి చేయాలి. 9 అడుగుల లాంగ్‌జంప్, పుష్‌అప్స్ కనీసం 6 తీయాలి. ఒక కడ్డీపై నిలబడి బ్యాలెన్స్‌గా చేతులు చాపి నడవాలి. సోల్జర్ జనరల్ డ్యూటీలో 1.6 కిలోమీటర్ల పరుగు పందేన్ని రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో 5 నిముషాల 20 సెకన్లలోపు, రెండవ గ్రూపు 6 నిముషాలలోపు పూర్తి చేయాలి. ఫిజికల్ టెస్ట్‌లో ఎంపికైనవారు అనంతరం మెడికల్, రాతపరీక్షకు హాజరుకావాలి. రాత పరీక్షలో సమాధానాల్లో ప్రతి తప్పునకు నాలుగవ వంతు మార్కు కట్ చేస్తారు.
మీరే..దేశ రక్షకులు
Published Wed, Oct 8 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM
Advertisement
Advertisement