ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ప్రారంభం | Army recruitment rally begins | Sakshi
Sakshi News home page

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ప్రారంభం

Published Sat, Sep 2 2023 4:06 AM | Last Updated on Sat, Sep 2 2023 4:02 PM

Army recruitment rally begins - Sakshi

ఖమ్మం: సైన్యంలో నియామకాలకు సంబంధించి అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 8వ తేదీ వరకు ర్యాలీ జరగనుండగా, రాష్ట్రవ్యాప్తంగా రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హాజరుకానున్నారు.

శుక్రవారం తెల్లవారుజామున పోటీలు ప్రారంభించారు. తొలి రోజు 1,225 మంది అభ్యర్థులకు 926 మంది హాజరయ్యారు. వీరిలో వైద్య పరీక్షలకు 329 మంది అర్హత సాధించారు. పోటీలను కలెక్టర్‌ వీపీ గౌతమ్, ఆర్మీ అధికారి దాస్, డీవైఎస్‌వో టి.సునీల్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షించారు. కాగా, అభ్యర్థులకు వసతి సౌ కర్యం కలి్పంచినట్లు చెబుతున్నా.. అవగాహన క ల్పించకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు రహదారుల వెంటే సేదదీరాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement