రాయ్‌బరేలీలో రాహుల్‌ పర్యటన | Rahul Gandhi To Visit Raebareli And Meet Family Of Soldier Killed In Siachen, See Details | Sakshi
Sakshi News home page

రాయ్‌బరేలీలో రాహుల్‌ పర్యటన

Published Wed, Jul 10 2024 3:22 AM | Last Updated on Wed, Jul 10 2024 12:27 PM

Rahul Gandhi To Visit Raebareli and Meet Family Of Soldier Killed In Siachen

వీర జవాను కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్‌ ఎంపీ

రాయ్‌బరేలీ: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ మంగళవారం సొంత నియో జక వర్గం యూపీలోని రాయ్‌బరేలీలో పర్యటించారు. మరణానంతరం కీర్తి చక్ర పురస్కారం పొందిన కెప్టెన్‌ అన్షుమన్‌ సింగ్‌ కుటుంబాన్ని పరామర్శించడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉదయం ఢిల్లీ నుంచి లక్నోలోని చౌదరి చరణ్‌ సింగ్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌ అక్కడికి 80 కిలోమీటర్ల దూరంలోని రాయ్‌బరేలీలోకి రోడ్డు మార్గంలో ప్రయాణం చేశారు.

స్థానిక అతిథిగృహంలో రాహుల్‌ గాంధీ కెప్టెన్‌ అన్షుమన్‌ సింగ్‌ తల్లి మంజు సింగ్, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మంజు సింగ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ..తమ కుటుంబానికి సాధ్యమైనంత మేర సాయం అందేలా చూస్తామని రాహుల్‌ హామీ ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం రాహుల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక నేతలతో ముచ్చటించారు. రాయ్‌బరేలీలోని ఎయిమ్స్‌ను సందర్శించారు. రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ..ఆర్మీని రెండు వర్గాలుగా విడగొట్టే అగ్నివీర్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement