Army recruitment
-
విశాఖతీరంలో ఆర్మీ అగ్నిపథ్ ర్యాలీ ప్రారంభం (ఫొటోలు)
-
విశాఖలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ
-
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి
బ్రజ్జావిల్లే: కాంగో ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో అపశ్రుతి చొటుచేసుకుంది. ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలోని ఓర్నానో స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను అధికారులు నిర్వహించారు. నవంబర్ 14 నుంచి ర్యాలీ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం వేలాది మంది యువత ర్యాలీకి హాజరయ్యారు. యువత గుంపులుగా రావడంతో పరిస్థితిని సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో ఒకరిపై మరొకరు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
ఖమ్మం: సైన్యంలో నియామకాలకు సంబంధించి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 8వ తేదీ వరకు ర్యాలీ జరగనుండగా, రాష్ట్రవ్యాప్తంగా రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హాజరుకానున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పోటీలు ప్రారంభించారు. తొలి రోజు 1,225 మంది అభ్యర్థులకు 926 మంది హాజరయ్యారు. వీరిలో వైద్య పరీక్షలకు 329 మంది అర్హత సాధించారు. పోటీలను కలెక్టర్ వీపీ గౌతమ్, ఆర్మీ అధికారి దాస్, డీవైఎస్వో టి.సునీల్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షించారు. కాగా, అభ్యర్థులకు వసతి సౌ కర్యం కలి్పంచినట్లు చెబుతున్నా.. అవగాహన క ల్పించకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు రహదారుల వెంటే సేదదీరాల్సి వచ్చింది. -
నేటి నుంచి ఖమ్మంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
ఖమ్మం స్పోర్ట్స్: సైన్యంలో నియామకాల కోసం అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ శుక్రవారం నుంచి ఖమ్మం జిల్లాకేంద్రంలో జరగనుంది. సర్దార్ పటేల్ స్టేడియంలో ఎనిమిది రోజులపాటు సాగే ర్యాలీలో రాష్ట్రవ్యాప్తంగా రాతపరీక్షలో అర్హత సాధించిన 7,397 మంది అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందుకోసం స్టేడియంలో చేసిన ఏర్పాట్లను కలెక్టర్ వీపీ గౌతమ్, కల్నల్ కీట్స్దాస్ గురువారం పర్యవేక్షించారు. మొదటిదశ పరీక్షలో ఉత్తీర్హులైనవారు అడ్మిట్ కార్డుతోపాటు కావాల్సిన సరి్టఫికెట్లు తీసుకుని నిర్ణీత తేదీలోనే రావాలని సూచించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఖమ్మం రైల్వేస్టేషన్, బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. -
నరసరావుపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా నరసరావుపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతీ అభ్యర్థి ఉద్యోగ అర్హత సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియ కోసం జిల్లా అధికార యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం రాత్రికే పలు జిల్లాల నుంచి నిరుద్యోగ యువత పెద్దఎత్తున స్టేడియానికి చేరుకున్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, కల్నల్ పునీత్, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం కె.వినాయకం తదితరులు పాల్గొన్నారు. -
నూతన పద్ధతిలో ఆర్మీ రిక్రూట్మెంట్
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఆర్మీలో వివిధ పోస్టులకు నియామకాలకు నూతన పద్ధతిని ప్రవేశపెట్టారు. అగ్నివీర్లో భాగంగా జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ నుంచి ఇతర ర్యాంకుల అధికారుల నియామకాలకు మార్చి నుంచి నూతన పద్ధతిని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నల్ వినయ్‌కుమార్ బుధవారం ఇక్కడ వివరించారు. ఆర్మీలో వివిధ పోస్టులకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదలైందని, మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నూతన విధానం ప్రకారం తొలిసారిగా ఆన్లైన్ ద్వారా ఆర్మీలో వివిధ పోస్టులు/ర్యాంకులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థులు రూ.250 ఫీజుతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్క్రూటినీ అనంతరం ఆన్లైన్లోనే రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను 10 నుంచి 14 రోజుల్లో అభ్యర్థి చిరునామాకు పంపిస్తామన్నారు. ఆన్లైన్ టెస్ట్ దేశంలో 176 ప్రాంతాల్లో నిర్వహిస్తామని, అభ్యర్థి ఎంచుకున్న ప్రాంతానికి వెళ్లి పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. ఇందులో అర్హత సాధించిన వారిని వైద్య పరీక్షలకు పిలుస్తామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖపట్నంలో జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు www.ojinindinarmy.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు హెల్ప్‌డెస్క్ నెంబరు 7996157222 లో సంప్రదించవచ్చన్నారు. ఈ సమావేశంలో రిక్రూట్మెంట్ మెడికల్ ఆఫీసర్ మేజర్ జీఎస్ రంద్వా తదితరులు పాల్గోన్నారు. -
Suryapet: 15 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
కంటోన్మెంట్: సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 31వ తేదీ వరకు సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్మీ పీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ స్కీమ్‌లో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్, టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ అగ్నివీర్ టెన్త్ పాస్, అగ్నివీర్ ఎయిత్ పాస్ కేటగిరీల్లో నియామకాలుంటాయని వెల్లడించారు. అగ్నివీర్ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం నిర్దేశిత ఫార్మాట్లో ఉన్న విధంగానే డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈనెల 15న సూర్యాపేట శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో జరిగే రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. (క్లిక్ చేయండి: ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావుపై వేటు) -
విశాఖలో అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ ర్యాలీ
-
ఉన్నవి అమ్ముతూ వ్యయం తగ్గింపా?
దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’ సృష్టించిన అగ్నిగుండం ఏమిటో మనకు తెలుసు. త్రివిధ దళాల్లో యువ సైనికుల్ని తాత్కాలిక సేవల కోసం ఉపయోగించుకుని మధ్యలో వదిలేసే పథకానికి కేంద్రం తెర లేపింది. తమ ప్రయోజనాల్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందని భావించినందునే అభ్యర్థులు భారీ ఆందోళనకూ, విధ్వంసకాండకూ దిగారు. అయితే ఈ పథకం తేవడానికి కారణం ఏమిటి? సైన్యంలో పెన్షన్ వ్యయం పెరగడం! దీనికి నిజంగా చేయవలసింది – ఇరుగు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపర్చుకుని రక్షణ బడ్జెట్‌ను తగ్గించుకోవడం! కానీ ప్రభుత్వం దీనికి బదులుగా లాభసాటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు అప్పజెబుతోంది; పెద్ద నోట్ల రద్దు అని చెప్పి ఎదురుడబ్బులు ఖర్చుచేసింది. ఇన్ని అస్తవ్యస్త విధానాలను అమలుచేస్తున్న ప్రభుత్వం సైన్యంలో వ్యయం పేరిట ఉద్యోగావకాశాల మీద నీళ్లు జల్లితే అభ్యర్థులకు ఆగ్రహం రాదా? భారతదేశంలో క్రమక్రమంగా ప్రభుత్వ రంగం కొడిగట్టిపోతూ వస్తోంది. 2014 ఎన్నికల తర్వాత అది మరింత వేగంగా బీజేపీ–ఆరెస్సెస్ ‘హిందూత్వ’ ఎజెండా చాటున ప్రైవేట్ ‘దుకాణం’గా స్థిరపడుతోంది. ఆ పరిణామంలో భాగంగానే – త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన సరికొత్త పథకం ‘అగ్నిపథ్’! సైనిక దళాల్లో చేరడానికి పాత రిక్రూట్మెంట్లలో అవసరమైన వివిధ దశల్ని (పరీక్షల్ని) పూర్తి చేసుకున్న అభ్యర్థులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తాత్కాలిక సేవల కోసం ఉపయోగించుకుని మధ్యలో వదిలేసే పథకా నికి కేంద్రం తెర లేపింది. రిక్రూట్మెంట్ పరీక్షలు రాసి పాసైన అభ్య ర్థులు తమను ప్రభుత్వం మోసం చేస్తోందని భావించి, దీనికి నిరస నగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకూ, విధ్వంసకాండకూ దిగారు. శాశ్వత రిక్రూట్మెంట్ పథకం ద్వారా కాకుండా తాత్కాలిక అవసరాల కోసం తమ ప్రయోజనాల్ని ప్రభుత్వం పక్కన పెట్టేసిందని అభ్యర్థులు భావించినందునే ఈ స్థాయిలో భారీ విధ్వంసకాండకు దిగారు. ఎందుకీ కొత్త ఎత్తుగడ? అభ్యర్థుల్ని ‘స్వల్ప కాలం పాటు’ ఆర్మీలో పని చేయడానికి మాత్రమే అనుమతించాలన్న నిబంధనను ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టింది? సైనిక, నావిక, విమాన సర్వీ సుల్లో పనిచేసే ఉద్యోగులకు పెరిగిపోతున్న పెన్షన్ చెల్లింపులకు కోత పెట్టడానికి ఈ కొత్త ఎత్తుగడను ప్రభుత్వం ఎత్తింది. ఇది పేరుకు ‘అగ్నిపథ్’. మరో మాటలో అగ్నిగుండం అనుకోవచ్చు. అయితే, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ రంగానికి ధారాదత్తం చేసే పథకాల్ని బీజేపీ–ఆరెస్సెస్ కూటమి పాలకులు 2014 నుంచే అమలు చేస్తున్నారు. దీని పరాకాష్ఠ – కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూన్న ప్రతిష్ఠాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సహితం ప్రభుత్వ రంగం నుంచి తప్పించడం. దాన్ని ప్రైవేట్ రంగానికి కట్టబెట్టాలని నిర్ణయిం చినప్పుడే ఇది దేశ ప్రజలందరికీ అర్థమయింది. విశాఖ కర్మాగారాన్ని పబ్లిక్ రంగంలో కాపాడుకునేందుకు విశాఖలోనూ, దేశ వ్యాప్తం గానూ ఈ రోజుకూ ప్రజలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా ‘మొండికీ, బండకూ’ ఆయుష్షు ఎక్కువన్నట్టుగా దేశ పాలనా వ్యవస్థ ప్రవర్తిస్తోంది. ఇక్కడ గుర్తించవలసింది ఏమంటే– ఇలాంటి ఆందోళ నలు తలెత్తడానికి గల కారణాలను విశ్లేషించుకొని సకాలంలో సవర ణలను చేసుకోవాలనీ, ‘కక్షలు, కార్పణ్యాల’తో పరిష్కారాలు కుదర వనీ ప్రపంచవ్యాప్తగా మొండి పాలకులకూ, ప్రభుత్వాలకూ తెలియని పాఠమా? ప్రతి సంవత్సరమూ, దేశ రక్షణ బడ్జెట్లో సగానికి పైగా ఉద్యోగుల పెన్షన్ల కిందనే పోతోందనీ, పరిశోధన, అభివృద్ధి రంగా లకు ఐదు శాతం కన్నా తక్కువే అందుతోందనీ, రెవెన్యూ ఖర్చులో 70 శాతం రక్షణ బడ్జెట్‌కే ఖర్చు అవుతోందనీ ‘నీతులు’ చెప్పడానికి అలవాటు పడ్డారు పాలకులు. కానీ ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు, దౌత్య సంబంధాలు ఇతోధికంగా పెంచుకోవడం పట్ల పాలనా వ్యవస్థ శ్రద్ధ పెట్టడం లేదు. రక్షణ విధానాల్లో మార్పు వచ్చేలా దేశ రక్షణ బడ్జెట్‌ను రూపొందించుకోవడం లేదు. ఏదో ఒక మిషతో ఉద్రిక్తతల సడలింపుపైన శ్రద్ధ వహించడం లేదు. ఇందువల్ల దేశానికీ, ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకూ కలుగుతున్న నష్టాన్ని గుర్తించడం లేదు. దీన్నే భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ‘ది ఇండియా వే’ (భారత మార్గం) అన్న తన కొత్త గ్రంథంలో కూడా స్పష్టం చేస్తున్నారు. గత మూడు దశాబ్దాల్లో దేశాల మధ్య సంబంధాలు మెరుగై ఉన్నందున, ఆ పరిస్థితిని చెక్కు చెదుర్చుకోరాదనీ... దేశాల సరి హద్దులు, సంబంధ బాంధవ్యాలు పరస్పరం విడదీయరానివనీ జై శంకర్ చెబుతున్నారు. ఈ నిర్వాకాలతో ఒరిగిందేమిటి? కానీ గత పదేళ్ల వ్యవధిలో జరుగుతున్నదేమిటి? ఏదో ఒక మిష పైన, లేదా పాలక అవసరాల పైన, దేశ సైన్యం పేరిట... ‘హిందూత్వ’ ఎజెండా పేరిట... నల్లధనాన్ని వెలికి తీయకుండానే దాని పేరిటా దేశీయ కరెన్సీతో పాలకులు చెలగాటం ఆడుకున్నారు. దీనివల్ల మాసాలు, సంవత్సరాల తరబడీ సామాన్య, మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బులు ఆడక, బ్యాంకుల వద్ద గంటల తరబడీ పడిగాపులు పడవలసి వచ్చింది. ఆ క్రమంలో సుమారు 150 మంది బ్యాంకుల వద్దనే కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి మనకు తెలుసు! అంతకుమించి, కొత్త నోట్ల సృష్టి కోసం ఎదురు 25 వేల కోట్ల రూపా యలు ప్రింటింగ్ ప్రెస్‌లకు ధారాదత్తం చేసుకోవలసి వచ్చింది. ఇన్ని అనవసర ఖర్చులు పెడుతున్న ఈ అనుభవాలన్నింటి దృష్ట్యా ‘అగ్నిపథ్’ పథకాన్ని అగ్నితో చెలగాటం అనక తప్పదు. ఇది శిక్షణ పొందిన యువకుల రిక్రూట్మెంట్ విధానాన్నేగాక, యువ సైనికుల స్వభావాన్ని కూడా మౌలికంగానే దెబ్బ తీస్తుంది. అంతే గాదు, నిజానికి ఇదే బీజేపీ ప్రభుత్వం ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’ అన్న పథకాన్నే అమలు జరుపుతామని హామీ ఇచ్చి పరిపాలనకు వచ్చింది. తీరా ఆచరణలో ‘ర్యాంకూ లేదూ, పెన్షనూ లేదు’ పొమ్మనే నిర్ణయా నికి రావడం ప్రస్తుత గందరగోళానికి దారితీసింది. ఇది ఆర్మీ ఉద్యో గార్థులకూ మింగుడుపడని అంశం కాదా? ఆర్మీ ఉద్యోగార్థుల రిక్రూట్ మెంట్ గరిష్ఠ వయఃపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచినట్టు పాల కులు చేతులు కాలిన తరువాత ప్రకటించబోవడం మరొక విడ్డూరం! దేశ భద్రతకు ప్రమాదం అంతేగాదు, సైన్యంలోకి రాష్ట్రాల వారీగా జనాభా ప్రాతిపదికపై రిక్రూట్ చేయడం 1966 నుంచీ అమలులో ఉంది. అలాగే, మన పార్ల మెంట్‌ను కూడా రానురానూ 500 మంది సభ్యుల్లో ఎక్కువగా పురు షులతోనే నింపడం ఎక్కువైంది. ఒకనాడు– 1952లో భారత రిపబ్లిక్ తొలి పార్లమెంట్ సమావేశంలోనే హేమాహేమీలైన 22 మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. విశేషమేమంటే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న వేళ, అమృత మహోత్సవాలు నిర్వహించు కుంటున్న దశలో కూడా నాయక స్థానాల్లో ఉన్న మహిళలను అధ్య క్షులనో లేదా పార్టీ నాయకురాళ్లనో చెబుతూ ఉంటారేగానీ, గౌరవ పార్లమెంట్ సభ్యురాళ్లని మనం పిలుచుకోలేకపోతున్నాం. ఈ రోజుల్లో కేంద్రంలో పాలక రాజకీయ పక్ష సైద్ధాంతిక దృక్పథం కారణంగా దేశంలో ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థలో అస్తవ్యస్త స్థితి దాపురించింది. ఫెడరల్ వ్యవస్థ ఉనికికి అత్యధిక పార్లమెంట్ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ పాలకులు గండి కొడుతున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ అస్తవ్యస్త విధానం కూడా ఈ కోవ లోనిదే. తాజాగా కేంద్ర పాలకులు వ్యయాన్ని మిగిల్చే పేరిట తీసుకున్న నిర్ణయం మూలంగా వృత్తి గౌరవాన్నీ, సమాజ సుస్థిరతనూ, తద్వారా దేశ భద్రతనూ ప్రమాదంలోకి నెట్టినట్టే అవుతుందని సుప్రసిద్ధ పరిశోధనా సంస్థ ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ కేంద్రం సీనియర్ పరిశోధకులు సుశాంత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘హిందూత్వ’ రాజకీయాల్లో భాగంగా మత మైనారిటీల ఆస్తుల్ని కూలగొట్టే దుర్మార్గపు చర్యల్ని సుప్రీంకోర్టు నిశితంగా విమర్శించ వలసి వచ్చింది. అలాగే, కేంద్ర అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్మీలో విశిష్ట పాత్ర నిర్వహిస్తూన్న సిక్కు, డోగ్రా, మద్రాసు రెజిమెంట్ వగైరా ఫెడరల్ యూనిట్లను తక్కువ చేసినట్టు అవుతోందని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఖండించవలసి వచ్చింది! ఏది ఏమైనా, ప్రతిష్ఠ కోసం పెద్దనాయుడు చస్తే ఈడ్వలేక ఇంటిల్ల పాదీ చచ్చారన్నట్టుగా పాలకుల ప్రవర్తన ఉండకూడదు సుమా! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లలకు ఏ పాపం తెలియదు..!
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానని వ్యతిరేకిస్తూ భారీ ఆందోళన చేపట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంస సృష్టించిన కేసులో 46 మంది చంచల్గూడా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. వీరిని కలిసేందుకు తల్లి, దండ్రులు జైలు వద్దకు వచ్చారు. సోమవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న నిందితుల తల్లిదండ్రులు.. తమ పిల్లలతో ములాఖత్‌లో కలవడానికి వచ్చారు. నిందితులుగా జైలులో ఉన్న తమ పిల్లలకు ఏమౌతుందోననే ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియదని జైలు సిబ్బంది వద్ద కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువత తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ నిర్వహించిన ఆందోళనలు విధ్వంసాన్ని సృష్టించాయి. నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భీతావహంగా మారింది. ఈ హింసాత్మక నిరసనల్లో రూ. ఏడు కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. -
అగ్నిపథ్ అల్లర్లు: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్
అగ్నిపథ్.. పేరుకు తగ్గట్టే దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనల జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ యువకుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. నిరసనలు మరో రూపం దాల్చి హింసాత్మక రంగు పులుముకున్నాయి. గత నాలుగు రోజుల క్రితం రాజుకన్న అగ్గి ఇప్పటి వరకు చల్లారడం లేదు. 700 వందల కోట్ల ఆస్తి హాంఫట్ నిరసనకారుల ఆందోళనలో ఇప్పటి వరకు 60 రైళ్లకు నిప్పంటించారు. బిహార్‌లో 11 ఇంజిన్లను తగలబెట్టారు. గత నాలుగు రోజుల అల్లర్లలో ఇప్పటి వరకు ఆందోళనకారులు సుమారు 700 వందల కోట్ల రూపాయల ఆస్తిని అగ్నికి ఆహుతి చేశారు. అంతే కాకుండా రైల్వే స్టేషన్లలో స్టాళ్లను తగులబెట్టడంతోపాటు రైల్వేకు చెందిన ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. ఆస్తి నష్టం కేవలం అధికారులు అంచనా వేసినవి మాత్రమే.. అధికారికంగా ఇంకా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి. సంబంధిత వార్త: సికింద్రాబాద్ కాల్పుల ఘటన: నిరసనకారుల శరీరాల్లో 8 పెల్లెట్లు 718 మంది అరెస్ట్ దేశవ్యాప్తంగా గడిచిన మూడు రోజుల్లో మొత్తం 138 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, 718 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ, వీడియో ఫుటేజీల ద్వారా హింసకు పాల్పడుతున్న మరికొంత మందిని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బిహార్ నిరసనలు విధ్వంసానికి దారి తీశాయి. నిరసనకారులు రైల్వే స్టేషన్లు లక్ష్యంగా దాడి జరుగుతోంది. బిహార్‌లో హింసాకాండకు సంబంధించి ఇప్పటి వరకు 25 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. మొత్తం 250 మందిని అరెస్టు చేశారు. అగ్నిపథ్ నిరసనలు ఒక్క బిహార్ రాష్ట్రంలోనే 15 జిల్లాలకు విస్తరించాయి. రైల్వే అధికారుల ప్రకారం.. ఒక జనరల్ బోగిని నిర్మాణానికి రూ. 80 లక్షలు ఖర్చు అవుతుంది., అదే స్లీపర్ కోచ్‌కు 1.25 కోట్లు, ఏసీ కోచ్ రూ. 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక ఒక రైలు ఇంజిన్‌ను తయారు చేసేందుకు ప్రభుత్వం అక్షరాల రూ. 20 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. మొత్తంగా చూసుకుంటే 12 బోగీల రైలును ఏర్పాటుకు చేసేందుకు రూ. 40 కోట్లు, 24 కోచ్‌ల ట్రైన్ నిర్మించేందుకు రూ. 70 కోట్లకుపైనే ఖర్చు చేస్తోంది. ఆస్తి నష్టం వాటిల్లిన రాష్ట్రాల్లో బిహార్‌లో ఎక్కువగా ఉంది. ఇది కూడ చదవండి: Agnipath Scheme: అనుమానాలు, వివరణలు 60 కోట్ల మంది టికెట్లు రద్దు ఇప్పటి వరకు సుమారు రూ. 700 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తూర్పు-మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. ఈ అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఆస్తి నష్టంపై పూర్తి నివేదికను రైల్వే రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీనికి తోడు అధికారిక సమాచారం మేరకు 60 కోట్ల మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. ట్రాక్‌లు దెబ్బతిని రైళ్ల రద్దు ఫలితంగా రైల్వేకు భారీ ఆర్థిక దెబ్బ తగిలింది. అయినప్పటికీ వీటన్నిటిపై రైల్వే శాఖ అధికారిక అంచనాను విడుదల చేసే పరిస్థితిలో లేనట్లు కనిపిస్తోంది. చదవండి: ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు! -
Secunderabad Railway Station: సాఫీగా రైలు కూత!
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన విధ్వంసం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా తేరుకుంది. శుక్రవారం రాత్రే రైళ్ల రాకపోకలను పునరుద్ధరించిన అధికారులు.. శనివారం చాలా వరకు రైళ్ల రాకపోకలను యథాతథంగా కొనసాగించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు, లింక్ రైళ్లు నడవకపోవడం వంటి ఇబ్బందులో కొన్ని రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం ప్రయాణికుల రద్దీ సాధారణంగానే కనిపించింది. మరోవైపు ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణ దృష్ట్యా ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఆర్ఏఎఫ్ బలగాలు, పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్ రెండు వైపులా సాయుధ సిబ్బందితో కాపలా ఏర్పాటు చేసి, అందరినీ పూర్తిగా తనిఖీ చేశాకే ప్లాట్‌ఫామ్‌లపైకి అనుమతిస్తున్నారు. మరికొద్ది రోజులు ఇబ్బందులు శుక్రవారం నాటి ఘటనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయిన విషయం తెలిసిందే. సాధారణంగా రైళ్ల నిర్వహణ జతలుగా ఉంటుంది. ఒకవైపు నుంచి మరోవైపు రైలు వెళితేనే మళ్లీ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సర్వీసులు కొనసాగుతాయి. ఒక దగ్గరే నిలిచిపోతే అంతరాయం ఏర్పడుతుంది. శుక్రవారం ఇలా రైళ్లు ఆగిపోవడంతో.. శనివారం కూడా పలు రైళ్లను నడపలేకపోయారు. ఇక విశాఖపట్నం మీదుగా ఉత్తరాదికి వెళ్లే మార్గంలో ఏర్పడ్డ ఆటంకాలతో మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. ఈ కారణాలతో వచ్చే మూడు నాలుగు రోజులపాటు కూడా పలు రైళ్లకు ఆటంకం కొనసాగనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శనివారం రాత్రి ప్రకటన వెలువరించింది. శనివారం 18 సాధారణ రైళ్లు, సిటీలో నడిచే 40 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయగా.. ఆదివారం ఐదు రైళ్లను.. సోమ, మంగళవారాల్లో ఒక్కో రైలు రద్దయినట్టు ప్రకటించింది. రాకపోకలకు ఆటంకాలతో ఏర్పడ్డ రద్దీ నేపథ్యంలో 19న రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. పార్శిళ్లకు నష్ట పరిహారం ఆందోళనకారుల విధ్వంసంలో నష్టపోయిన పార్శిళ్లకు రైల్వే నుంచి నష్టపరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. అయితే పార్శిల్‌ను బుకింగ్ చేసుకునే సమయంలో పేర్కొన్న విలువ మేరకు నష్ట పరిహారం ఇస్తామని వెల్లడించారు. వేగంగా మరమ్మతులు.. ఆందోళనకారుల చేతిలో ధ్వంసమైన పరికరాలు, మౌలిక వసతులకు రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. ట్యూబ్‌లైట్లు, సీసీ కెమెరాలు, ఫ్యాన్లు కొత్తవి బిగిస్తున్నారు. పగిలిన సిమెంటు బెంచీలకు మరమ్మతులు చేయిస్తున్నారు. విధ్వంసంలో దెబ్బతిన్న దుకాణాలను నిర్వాహకులు పునరుద్ధరించుకున్నారు. రద్దయిన, షెడ్యూల్ మారిన రైళ్లు ఇవీ.. ► భువనేశ్వర్–సికింద్రాబాద్, త్రివేండ్రం సెంట్రల్–సికింద్రాబాద్, దర్బంగా–సికింద్రాబాద్, షాలీమార్–సికింద్రాబాద్ తదితర రైళ్లను అధికారులు రద్దు చేశారు. ► ఆదివారం సికింద్రాబాద్–షాలిమార్ (ఉదయం 4.20), కాచిగూడ–నర్సాపూర్ (రాత్రి 11 గంటలకు) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. సికింద్రాబాద్–దానాపూ ర్, సికింద్రాబాద్–రాజ్‌కోట్, సికింద్రాబాద్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లను సమయా లను రీషెడ్యూల్ చేసి నడుపుతున్నారు. నేడూ ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో శుక్రవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం కూడా పలు మార్గాల్లో ఎంఎంటీఎస్‌లను రద్దు చేశారు. ఆదివారం కూడా ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి తదితర రూట్లలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: మధ్యలో ఉన్న రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగిపోయిందనే ఆవేదన.. ‘అగ్నిపథ్’తో ఉద్యోగ అవకాశం పోతుందేమోనన్న ఆందోళన.. నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆర్మీ అభ్యర్థులను ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు రెచ్చగొట్టారు. గట్టిగా నిరసన తెలిపితే ప్రభుత్వం దిగొస్తుందంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులతో ఉసి గొల్పారు. ఆ మాటలు నమ్మిన ఆర్మీ అభ్యర్థులు ఆవేశంతో ఆందోళనకు దిగారు. కానీ ఎవరూ పట్టిం చుకోవడం లేదన్న భావనతో వారిలో కొందరు విధ్వంసం మొదలుపెట్టారు. మరికొందరూ వారిని అనుసరించారు. చివరికి బోగీలకు నిప్పుపెట్టడం, రైళ్లను ధ్వంసం చేయడం వంటి చర్యలకూ దిగారు.. శుక్రవారం నాటి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనపై పోలీసుల దర్యాప్తులో ఇలాంటి కీలక అంశాలెన్నో బయటపడుతున్నాయి. ఏపీలోని నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని నడుపుతున్న ఆవుల సుబ్బారావు ఈ వ్యవహారంలో సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ఏపీ పోలీసులు శుక్రవారం రాత్రే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి రైల్వే, హైదరాబాద్ సిటీ పోలీసులు.. మొత్తంగా 150 మందికిపైగా అదుపులోకి తీసుకున్నా, రైల్వేస్టేషన్లో ఎవరెవరు విధ్వంసం సృష్టించారో నిర్ధారించి అరెస్టులు చేస్తున్నారు. అందులో శనివారం 52 మందిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపర్చారు. వైద్య పరీక్షల కోసం నిందితులను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తున్న పోలీసులు ఫీజుల కోసం ప్రైవేట్ అకాడమీలు కుట్రతో, పక్కా పథకం ప్రకారం జరిగిన రైల్వేస్టేషన్ విధ్వంసం వెనుక.. సాయి డిఫెన్స్ అకాడమీ సహా తొమ్మిది ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల పాత్ర ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వీటిలో కొన్ని అభ్యర్థులు ఎంపికయ్యా ఫీజుల చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఎంపిక పరీక్షల్లో ఒక్కోదశ దాటే కొద్దీ అభ్యర్థులు నిర్ణీత మొత్తం ఫీజు చెల్లిస్తుంటారు. ఈ నెల 14న రాజ్‌నాథ్‌సింగ్ ‘అగ్నిపథ్’ ప్రకటన చేయడంతో రిక్రూట్మెంట్లు నిలిచిపోతాయని.. తమకు రావాల్సిన ఫీజులు, భవిష్యత్తులో చేరే అభ్యర్థుల సంఖ్యపై ప్రభావం ఉంటుందని అకాడమీలు భావించాయి. ఈ క్రమంలో నిర్వాహకులు అప్పటికే తమవద్ద శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులతో సృష్టించిన వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వీడియోలు పోస్టు చేశారు. ఈ నెల 17న నిరసన తెలపడానికి సికింద్రాబాద్ రైల్వే జంక్షన్‌కు రావాలని సందేశాలు పెట్టారు. ఇలా పాత గ్రూపులు, కొత్తగా క్రియేట్ చేసిన వాటితో కలిపి మొత్తం 12 గ్రూపుల్లో ఈ సమాచారం సర్క్యులేట్ అయింది. సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావుతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు, ఏపీకి చెందిన అభ్యర్థులు గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కొందరు లాడ్జిల్లో, మరికొందరు హైదరాబాద్‌లోని డిఫెన్స్ అకాడమీల్లో బస చేశారు. వారికి ప్రైవేటు అకాడమీల నిర్వాహకులే భోజనం, ఇతర వసతులు ఏర్పాటు చేశారు. 17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రావాలంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చిన తర్వాతే పెట్రోల్ తెచ్చి.. శుక్రవారం ఉదయం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్మీ అభ్యర్థులు కృష్ణ, గోదావరి, గౌతమి, ఇతర రైళ్లలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. వారు తమ ప్రతి కదలికనూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసుకున్నారు. ఈ క్రమంలో హకీంపేట ఆర్మీ సోల్జర్స్ సహా నాలుగు గ్రూపులను గుర్తించిన పోలీసులు.. వాటిలోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. వాటిలో ఉన్న వాయిస్ మెసేజీల ప్రకారం.. ఆర్మీ అభ్యర్థులు తొలుత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నిరసన తెలపాలని మాత్రమే భావించారు. కానీ ఈ నిరసన ఆశించిన స్థాయిలో అందరి దృష్టీ ఆకర్షించలేదని, బలగాలు వచ్చి తమను తరిమేసే లోపు అందరి దృష్టి ఆకర్షించేలా విధ్వంసానికి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు నిరసన మొదలయ్యాకే వెళ్లి పెట్రోల్ తెచ్చి.. బోగీలకు నిప్పంటించారని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు స్టేషన్లోకి పోలీసు బలగాలు ప్రవేశించడంతో.. బయట రేతిఫైల్ బస్టాప్ వద్ద బస్సులకూ నిప్పుపెట్టాలని అభ్యర్థులు ప్రయత్నించినట్టు గుర్తించారు. ► హకీంపేట్ వాట్సాప్ గ్రూప్‌లోని వాయిస్ మెసేజీలలో.. ‘‘ఎంతసేపు ఒర్రుతార్రా ఒర్రోర్రి నోర్లు నోస్తయ్. అందుకే గమ్మునపోయి పెట్రోల్ తీసుకువచ్చి తగలబెట్టేసినం అనుకో.. బయటికి పోతాది న్యూస్. అంతేగని ఎంతసేపు ఒర్రినా, ఎంతసేపు బ్యానర్లు చూపించినా ఏమీ అవ్వదు. రెండు గంటలు, ఒక గంటల స్క్వాడ్ వస్తది. అందరినీ వెల్లగొడ్తది. అందుకే పోయి పెట్రోల్ తీసుకొస్తే రెండు నిమిషాల్లో తగలబెట్టొచ్చు’ అంటూ ఒక వాయిస్ మెసేజీ.. ► ‘‘అరే పెట్రోల్ పంప్‌కు పోతున్నా పెట్రోల్ తీస్కరానీకి, ఎవరైనా వస్తే పెట్రోల్ తీస్కరానికి రండి’’ అంటూ మరో వాయిస్ మెసేజీ ఉన్నాయి. ► ఇక మరో వాట్సాప్ గ్రూపులో.. ‘‘బెటాలియన్ ఆగయా.. సబ్ లోగ్ రేతిఫైలి కనే ఆజావ్.. బస్ జలాదేంగే..’’ అంటూ ఇంకో వాయిస్ మెసేజీని పోలీసులు గుర్తించారు. ఈ మూడు సందేశాలను పోస్టు చేసినది ఒకే వ్యక్తి కావడంతో.. అతడే విధ్వంసానికి సూత్రధారి అని అనుమానిస్తున్నారు. అడ్మిన్ల ఫోన్ నంబర్లు.. టవర్ లొకేషన్లతో.. రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, వాట్సాప్ గ్రూపులు, సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 12 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్టు నిందితుల ద్వారా తెలుసుకున్న అధికారులు.. అందులో నాలుగింటిని గుర్తించారు. వీటిలో అడ్మిన్లు, సభ్యుల ఫోన్ నంబర్లు సేకరించి.. వారి సెల్ టవర్ లోకేషన్లను పరిశీలిస్తున్నారు. తద్వారా విధ్వంసం సమయంలో రైల్వేస్టేషన్లో ఉన్నవారిని గుర్తిస్తున్నారు. కేసు తీవ్రమైనది కావడంతో అనుమానితులను పూర్తిగా పరిశీలించి, ప్రశ్నించాకే అరెస్టు చేస్తున్నారు. పోలీసులు శుక్రవారం రైల్వే స్టేషన్ వద్ద సుమారు 150 మందిని అదుపులోకి తీసుకుని వివిధ ఠాణాలకు తరలించారు. పరిశీలన అనంతరం 52 మందిని నిందితులుగా గుర్తించి శనివారం అరెస్టు చేశారు. వారికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో కీలకమని భావిస్తున్న మరో ఏడుగురిని ప్రశ్నిస్తుండగా.. మిగతా వారిని విడిచిపెట్టారు. మొత్తంగా ఈ కేసులో నిందితులుగా 200 మందిని గుర్తించారు. వారి కోసం సికింద్రాబాద్ జీఆర్పీతోపాటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, నార్త్‌జోన్ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దర్యాప్తును హైదరాబాద్ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీసీపీ చక్రవర్తి గుమ్మి పర్యవేక్షిస్తున్నారు. పట్టుకున్నాక తెలిసింది పోలీసని.. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం మొదలయ్యాక మీడియాకు ఓ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారని, రావాలని ఆ ఫోన్ చేసిన వ్యక్తి కోరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కూడా అభ్యర్థేనని, కీలక వ్యక్తి కావడంతోనే మీడియాను పిలిచి ఉంటాడని భావించారు. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే అప్రమత్తమై తప్పించుకోవచ్చని భావించి.. సాంకేతిక ఆధారాలు, ముమ్మర గాలింపుతో ఆయనను గుర్తించి పట్టుకున్నారు. కానీ ఆయన జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ అని తెలిసింది. రైల్వేస్టేషన్లో ఆందోళనకు దిగిన అభ్యర్థులను వెళ్లిపోవాలని కోరగా.. మీడియా వస్తే తప్ప వెళ్లబోమని భీష్మించారని, దాంతో మీడియా వస్తే త్వరగా నిరసన ముగుస్తుందనే ఫోన్ చేశానని ఆయన వివరించారు. దీంతో ఆయన్ను అధికారులు విడిచిపెట్టారు. కీలక నిందితుడు.. ఏపీ పోలీసుల అదుపులో.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో అభ్యర్థులను ప్రేరేపించిన నిందితుడు, సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును ఏపీ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆవుల సుబ్బారావు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని రావిపాడు పంచాయతీ పరిధిలో డిఫెన్స్ అకాడమీని నడుపుతున్నారు. గురువారం అర్ధరాత్రి సికింద్రాబాద్ వెళ్లిన సుబ్బారావు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నరసరావుపేటకు చేరుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడి పాతూరులోని సాయి రెసిడెన్సీ లాడ్జిలో శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు చెందిన డిఫెన్స్ అకాడమీ కార్యాలయంలో తనిఖీలు చేసి.. రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావును ఆదివారం తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశమున్నట్టు తెలిసింది. అయితే సుబ్బారావు గుంటూరు, విశాఖపట్నంలలోనూ ఆర్మీ అభ్యర్థుల నిరసనలకు ప్రేరేపిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టినట్టు గుర్తించారు. దీనితో అక్కడే కేసులు నమోదు చేసి, అరెస్టు చేయవచ్చే వాదన వినిపిస్తోంది. సుబ్బారావు అప్పగింతపై శనివారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. -
‘అగ్ని’లో నిగ్గుతేలిన నిజాలు
‘అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని’... ఇది ‘సిరి వెన్నెల’ రాసిన గేయంలో ఒక పంక్తి. అగ్గి తోటి కడిగితే అది పునీతమవుతుందని మన విశ్వాసం. నిఖార్సయిన నిజాన్ని గురించి చెప్పడానికి నిప్పును ఉపమానంగా తెచ్చుకోవడం మన అలవాటు. అగ్నిపరీక్షలో పాసైతే పవిత్రత అనే సర్టిఫికెట్ ఆటో మేటిక్‌గా లభిస్తుంది. ఇది మన సాంస్కృతిక భావజాలంలో ఊడలు దిగిన విశ్వాసం. సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ కూడా సమాజ వాస్తవికతలపై ఒక అగ్నిపరీక్షగా పనిచేసింది. ఈ విధానానికి వ్యతిరేకంగా చెలరేగిన దావానలం యథార్థాల ముసుగుల్ని దహించి, నగ్నంగా నిలబెట్టింది. ఈ దేశంలోని లక్షలాదిమంది యువకులు సైన్యంలో చేరడానికి చకోర పక్షుల్లా నిరీక్షిస్తున్నారనేది ఒక వాస్తవం. ఎదురు చూపులు ఉపాధి కోసమా? దేశభక్తి ప్రపూరితమా అన్నది ఇక్కడ అప్రస్తుతం. నిరుద్యోగం పెనుభూతమై పీడిస్తున్న దేశంలో ఉపాధి ఆరాటమే తొలి కారణం కావచ్చు. దానికి దేశభక్తి కూడా జతకూడి ఉండవచ్చు. కారణమేదైనా సుమారు లక్షా డెబ్బయ్ ఐదు వేలమంది యువకులు ఏడాది కిందనే ఫిజికల్ టెస్టులూ, మెడికల్ టెస్టులూ గట్టెక్కి ఉన్నారు. నెలల తరబడి శిక్షణ తీసుకుని గురిపెట్టి విడిచిన బాణాల్లా పరుగులు తీసి పరీక్షలు పాసయ్యారు. ఇంకొక్క పరీక్ష. రాత పరీక్ష. అది పూర్తయితే ఇక సైన్యంలో చేరడమే! ఆలివ్ గ్రీన్ యూనిఫామ్‌లో తమను తాము ఎన్నిసార్లు ఊహించుకున్నారో! కరాన మర తుపాకీ... శిరాన ఉక్కుటోపీతో సరిహద్దుల్లో పహారా కాస్తున్నట్టు ఎన్ని కలలు కన్నారో! దూరంగా, సొంత ఊరిలో ఉన్న తల్లి దండ్రులకు నెలనెలా జీతం డబ్బులు పంపి అండగా నిలబడ బోతున్నామని ఎంత సంబరపడ్డారో! జస్ట్... ఒక్క పరీక్ష!! అధికారులు చెబుతున్నట్టు కరోనా కారణంగానే అది వాయిదా పడుతూ వస్తున్నదని సర్దిచెప్పుకున్నారు. నేడో రేపో ఆ పరీక్ష పూర్తవబోతున్నదని ఎదురుచూస్తున్నారు. సైనిక బలగాల నియామకానికి పాత పద్ధతిని రద్దుచేస్తూ సరికొత్తగా ‘అగ్నిపథ్’ అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు్ట ప్రకటన వెలువడగానే హతాశులయ్యారు. ఎదురుచూస్తున్న కొలువు ఎగిరిపోయింది. నోటి దగ్గర ముద్ద నేల రాలింది. ‘కొత్తగా వచ్చే కొలువులు నాలుగేళ్లు మాత్రమే’ అని చెప్పడంతో వారి కలలన్నీ కరిగి పోయాయి. ఒక్కసారిగా లక్షా డెబ్బైఐదు వేల గుండెలు పగిలిన శబ్దానికి త్రీగోర్జెస్ డ్యామ్ బద్దలైనంత విధ్వంసం దేశమంతటా ప్రవహించింది. ఈ విధ్వంసంలో కొన్ని ప్రతిపక్షాల పాత్ర ఉన్న దని కేంద్రం ఆరోపిస్తున్నది. ప్రజల్లో అసంతృప్తి ఉన్న ప్పుడు ప్రతిపక్షం ఆజ్యం పోయడం సహజమే! ప్రభుత్వం చెబుతున్నట్టు సైనిక బలాల నియామకాల హేతుబద్ధీకరణ చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశమే. ఇందుకు పైకి చెబుతున్న కారణాలు ఎన్ని వున్నా ప్రధానమైన అంతర్గత కారణం పెన్షన్ భారం. రక్షణ రంగంలో ఇప్పటికే 32 లక్షలమంది పెన్షనర్లు ఉన్నారు. రక్షణ శాఖ మొత్తం వార్షిక బడ్జెట్లో పెన్షన్ల వాటా 26 శాతానికి చేరుకున్నది. ఏటా యాభై వేలమంది పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఈ శాతం ఏటా పెరుగుతూనే ఉంటుంది. అమెరికా రక్షణ బడ్జెట్లో పెన్షన్ల వాటా 10 శాతమే. యూ.కే.లో అది 14 శాతం. సైనిక బలగాలకోసం ఖర్చుచేసే పెన్షన్‌ను భారంగా భావించే దేశంలో ఒక్కసారి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నికైన వారికి జీవితాంతం ఇచ్చే పెన్షన్‌ను ఎలా సమర్ధించగలుగు తారు? ఈ ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అందుకే ప్రభుత్వం ఇతర కారణాలను చెబుతున్నది. ‘అగ్నిపథ్’ కింద నియమించేవారిలో నాలుగో వంతు మందిని 15 ఏళ్ల సర్వీస్ వరకు కొనసాగిస్తామనీ, మిగిలిన వారికి స్వయంఉపాధికి దోహదపడే ఆర్థిక సహకారాన్ని అందజేస్తామనీ చెబుతున్నది. ఈ పద్ధతి ప్రపంచంలోని చాలా దేశాల్లో అమల్లో ఉన్నదని ఉదాహరణలిస్తున్నది. ఏదైనా ఒక రంగంలో సమూల మార్పు లకు సిద్ధపడినప్పుడు అందుకు సంబంధిత ప్రజానీకాన్ని ముందుగానే సిద్ధం చేయడం అవసరమని ఈ వివాదం మరో సారి చాటి చెప్పింది. వ్యవసాయ చట్టాల సందర్భంలోనూ, ఇప్పుడు రక్షణ శాఖ నియామకాల హేతుబద్ధీకరణలోనూ ప్రభుత్వం తొందరపాటుగానే వ్యవహరించింది. ఈ పథకంలోని గుణదోషాల అంశాన్ని పక్కనపెట్టి పరిశీ లిస్తే... మన విద్యావ్యవస్థలోని లోపాలనూ, నిరుద్యోగ సమస్య తీవ్రతనూ ఈ సందర్భం ఎత్తిచూపింది. విద్యావ్యవస్థలోని నాణ్యతా ప్రమాణాల క్షీణత, నైపుణ్య లేమి యువతరానికి శాపంగా పరిణమిస్తున్న వైనానికి అద్దం పట్టింది. దేశంలో ఏటా 24 లక్షలమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తు న్నారు. వారిలో 10 లక్షల మందికే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో చదువుకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగిలిన వారిలో సగం మంది అతికష్టం మీద చదువుతో సంబంధం లేని దిగువశ్రేణి ఉద్యో గాల్లో సర్దుకోగలుగుతున్నారు. సుమారు ఆరేడు లక్షలమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రతియేటా రోడ్డు మీద మిగిలి పోతున్నారు. నాన్–ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యు యేషన్ పూర్తిచేసిన వారిలో ఇంగ్లిష్ నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్ ఉన్న కొంతమంది మాత్రమే మెరుగైన ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. మిగిలిన వారంతా తమ సోదర ఇంజనీరింగ్ సేన లతో కలిసి ఒక రిజర్వు నిరుద్యోగ ఫోర్స్‌గా ఉండిపోతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా ఉండి జీడీపీ వృద్ధిరేటును నమోదు చేస్తున్న పరిస్థితుల్లో ఏదో ఒక ఉపాధి వీరికి లభిస్తున్నది. లేదంటే అన్యాయమైన పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. నైపుణ్యాల క్షీణతతోపాటు విద్యారంగాన్ని వేధిస్తున్న మరో సమస్య... డ్రాపవుట్లు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సౌకర్యాల లేమి, ఆర్థిక పరిస్థితుల వలన ప్రైవేట్ చదువు కొనలేని పరిస్థితి. ప్రోత్సాహం లేకపోవడం ఈ డ్రాపవుట్లకు కారణంగా కని పిస్తున్నది. ఫలితంగా ఉన్నత విద్యాప్రస్థానంలో టెన్త్, ఇంటర్ మజిలీల దగ్గరే చాలామంది మిగిలిపోతున్నారు. వీళ్లంతా నిరుద్యోగ రిజర్వు ఫోర్సే! దినసరి కూలీపై దొరికే లేబర్ పనులే వీరికి దిక్కు. వీళ్ల క్వాలిఫికేషన్‌కు తగిన ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు వచ్చినప్పుడు మెరుగైన జీతం, జీవితం కోసం పోటీపడుతున్నారు. సైనికోద్యోగాలు కూడా అందులో ఒక భాగం. ఆర్థిక వృద్ధి నమోదవుతున్న ప్రాంతాల్లో డిగ్రీ, పీజీ నిరుద్యోగ పెద్దన్నల మాదిరిగానే టెన్త్, ఇంటర్ నిరుద్యోగ సేన కూడా ఏదో ఒక పనిలో కుదురుకుంటున్నది. ఆర్థిక వృద్ధి మందగమన స్థితిలో ఉన్న ప్రాంతాల్లో ఉపాధి లభించక నిస్పృహతో నిరుద్యోగ సేన రోడ్డెక్కుతున్నది. ఈ దేశాన్ని రానున్న కాలంలో నవజీవన బృందావనంగా తీర్చిదిద్దగల యువతరం రూపొందడానికి 4 కీలక అంశాలపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ‘అగ్నిపథ్’ సందర్భం గుర్తు చేసింది. 1. ఆర్థిక వ్యవస్థను వృద్ధి గమనంలో నిలపడం, 2. రిజర్వు నిరుద్యోగసేనల సమస్య పరిష్కారం, 3. విద్యా రంగంలో ప్రమాణాలు, నైపుణ్యాల పెంపుదల, 4. డ్రాపవుట్లు లేకుండా చేయడం. ఈ అంశాల ప్రాధాన్యాన్ని తొలిదశలోనే గుర్తించి అందుకు తగిన ప్రణాళికలను రచించిన ఒకే ఒక్క రాజకీయ నేత ఏపీ సీఎం జగన్. ఇది వైఎస్సార్సీపీ చెప్పుకుం టున్న ఘనత కాదు. ఏపీ ప్రభుత్వం చాటింపు చేసుకుంటున్న విషయం కూడా కాదు. స్వతంత్ర ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల గణాంకాలు ఘంటాపథంగా చెబుతున్న అక్షర సత్యాలు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ ఐఈ) నివేదిక ప్రకారం జాతీయ నిరుద్యోగితా రేటు 7.8 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో అది 4.4. శాతం మాత్రమే! ఎల్లో మీడియా నిత్యం బ్యాండు మేళం మోగిస్తూ స్వర్ణయుగంగా కీర్తించే చంద్ర బాబు హయాం చివరిరోజు నాటికి నిరుద్యోగితా రేటు 5.2 శాతం. ఆ తర్వాత కోవిడ్ కారణంగా దేశమంతటా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. రెండేళ్లపాటు వరసగా కోవిడ్ మహమ్మారి పీడించింది. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగితా రేటు పెరగడం సహజం. అలా అన్ని రాష్ట్రాల్లో పెరిగింది కూడా! కానీ ఏపీలో తగ్గింది. దీని వెనుక ఏ మాయా, మంత్రం లేవు. అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. చిత్తశుద్ధి, దూరదృష్టి, తపన మాత్రమే ఉన్నాయి. ఎక్కువమంది ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ, చిన్న పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈ) రంగాలను గుర్తించి వాటిని డైనమిక్‌గా నిలబెట్టడానికి పడిన శ్రమ ఉన్నది. చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగం ఏపీలో 11 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది. అందులో 20 శాతం మందిని కోవిడ్ కాలం లోనే ఈ రంగం ఇముడ్చుకోగలిగింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఎమ్ఎస్ఎమ్ఈలను గతిశీలకంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహకాలు అర్థం చేసుకోవడానికి! 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం జీఎస్డీపీ 18.47 శాతం వృద్ధి (ప్రస్తుత ధరల ప్రకారం)ని నమోదు చేసింది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగం కూడా 14.50 శాతం వృద్ధిని సాధించింది. రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే సెంటర్ల వలన, రైతు భరోసా వలన, సకాలంలో ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఫలితంగా, ఉత్పత్తుల ధరలు తగ్గకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నం దువలన ఈ విజయం సాధ్యమైంది. జగన్ ప్రభుత్వం రిజర్వ్ నిరుద్యోగ సేనల సమస్యను పరిష్కరించిన తీరు నభూతో నభవిష్యతి. పరిపాలనా వికేంద్రీకరణలో విప్లవాత్మక కార్యక్రమా నికి శ్రీకారం చుడుతూ, అందులో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించగలిగింది. లక్షా 34 వేలమందికి ఒకేసారి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను కల్పించింది. వలంటీర్ వ్యవస్థ ద్వారా మరో 2 లక్షల 60 వేల మంది గౌరవభృతితో సేవా పథంలోకి అడుగు పెట్టగలిగారు. విద్యారంగ సమూలక్షాళనకు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి – ఉన్నత ప్రమాణాల కోసం భారీ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ‘నాడు–నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చింది. గేమ్ ఛేంజర్‌గా ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా ఆధునిక బోధనా పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఎడ్టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం చేసుకొని లెర్నింగ్ యాప్ ద్వారా శిక్షణ అందించే ఏర్పాట్లు చేసింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను సంస్కరించింది. రెండు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలతో పాటు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాబోయే విద్యార్థి తరాలు ప్రపంచస్థాయిలో పోటీ పడే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఏ స్థాయిలోనూ డ్రాపవుట్లు ఉండకుండా అందరూ ఉచి తంగా, నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు అనేక పథకాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యాదీవెన, వసతి దీవెన... ఇలా పలు పథకాలతో విద్యా రంగంలో డ్రాపవుట్ లేకుండా చూసే ప్రయత్నాన్ని చేస్తున్నది. ఇవన్నీ అక్షరాలా అమలు జరుగుతున్న కార్యక్రమాలు. కానీ చంద్రబాబూ, మీడియా మొఘల్ శ్రీమాన్ రామోజీరావు నేతృ త్వంలో వాలతుల్యులు, తోకమాత్రులతో కూడిన యెల్లో మీడియా ఈ కార్యక్రమాలను రివర్స్ గేర్‌లో చూపెడుతున్నారు. ఇది రివర్స్ పాలన నమ్మండని చెబుతున్నారు. మన విద్యార్థు లను పోటీ ప్రపంచంలో నిలబెట్టడానికి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించింది ఈ ముఠా. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట, ఇంగ్లిష్ మీడి యంలో చదివిస్తే మీ పిల్లలు మొద్దబ్బాయిలుగా తయారవు తారని రోడ్డు పక్కనున్న పల్లె జనానికి చంద్రబాబు సుద్దులు చెప్పబోయారు. వారు జై జగన్ అని బదులు చెప్పేసరికి పలాయనం చిత్తగించారు. ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా తెలుగు ఉద్యమాన్ని రెచ్చగొట్టడానికి యెల్లో మీడియా శాయ శక్తులా ప్రయత్నించి తల్లిదండ్రుల వ్యతిరేకతతో తోక ముడి చింది. ఇప్పుడు బైజూస్ మీద విషపు దాడి ప్రారంభించారు. ఏటా 24 వేల ఖర్చు చేయాల్సిన ఈ బోధన ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా లభించనుంది. విద్యాబోధనను ఆధునికం చేసే అదనపు ఉపకరణం. సమగ్ర అవగాహనకు దోహదపడే ఆయుధం. పేదల చేతికి ఆయుధం దొరకకూడదు. వారు సాధి కారత సాధించకూడదు. ఇదీ చంద్రబాబు, యెల్లో మీడియా జాయింట్‌గా అమలు చేస్తున్న కార్యక్రమం. చంద్రబాబు లాంటి విజనరీ ప్రపంచాన లేడని పాత డప్పునే ఇప్పుడు మళ్లీ∙వాయిస్తున్నారు. ఈ ప్రచారం హోరులో నిజంగా తాను విజనరీ అనే భ్రమలోకి బాబు జారిపోయి చాలా కాలమైంది. అదే ఆత్మవిశ్వాసంతో నిన్న విజయనగరంలో మాట్లాడారు. ‘‘నేనే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లూ’’ అని ప్రశ్నించారు. ఇటువంటి మాటలు సామాన్య ప్రజలు ఎవరు మాట్లాడినా జనం అనుమానిస్తారు. ‘ఎవరికైనా చూపెట్టండర్రా’ అని సలహా ఇస్తారు. ఇలా మాట్లాడటం ఆయనకు కొత్త కాదు. ఒకసారి తాను తుపాన్లను అడ్డుకున్నానని చెప్పారు. విజయవాడలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తగ్గించాలని ఆదేశించారు. రెయిన్ గన్స్‌తో ఒక ట్యాంకర్ నీళ్లను చిలకరించి కరువును జయించానని ప్రకటించారు. ఎవరు అడి గినా అడక్కపోయినా మధ్యమధ్య ‘నేను మెంటల్లీ ఫిట్’ అని ప్రకటిస్తుంటారు. ఆయన మాటలన్నీ గొప్ప విజన్‌తో కూడిన వని యెల్లో మీడియా ఊదరగొడుతున్నది. ఆయనొస్తే అభివృద్ధి పరుగులు పెట్టుకుంటూ వస్తుం దని దండోరా వేస్తున్నది. జగన్ హయాంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులపై మసిపూసే ప్రయత్నం చేస్తున్నది. నిజాలపై ముసుగు కప్పుతున్నది. కానీ నిజం నిప్పు లాంటిది. నిప్పునూ దాచలేరు! నిజాన్నీ దాచలేరు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సికింద్రాబాద్ విధ్వంసం.. సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసంపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. వివిధ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా కేసు స్వీకరించింది. ఘటనలో ఒకరి మృతి, 13 మందికి తీవ్ర గాయాలు రైల్వే ఆస్తి నష్టంపై జూలై 20లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్పీఎఫ్, జీఆర్పీ డీజీలను మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. కాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులులు చేపట్టిన నిరసనలు అల్లకల్లోల్లాన్ని సృష్టించాయి. ఈ అల్లర్లలో వరంగల్‌కు చెందిన రాకేష్ అనే ఆర్మీ ఉగ్యోగ అభ్యర్థి కూడా మరణించాడు. చదవండి: సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. 52 మంది అరెస్ట్ -
సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. 52 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లరకు సంబంధించి ఇప్పటివరకు 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉండి పారిపోయిన మరికొందరి కోసం టాస్క్‌ఫోర్స్, నార్త్‌జోన్, రైల్వే, పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో 200 మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కుట్రకోణంలో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. అరెస్టయిన నిందితులను మరికాసేపట్లో రిమాండ్‌కు తరలించనున్నారు. ఈ మేరకు నిందితులను రైల్వే కోర్టులో పోలీసులు హాజరు పరచనున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువత తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ నిర్వహించిన ఆందోళనలు విధ్వంసాన్ని సృష్టించాయి. నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భీతావహంగా మారింది. ఈ హింసాత్మక నిరసనల్లో రూ. ఏడు కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్రం దిద్దుబాటు చర్య -
అక్క స్ఫూర్తి, అన్న ఆశయం కోసం..
ఖానాపురం: అక్క బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్.. అన్న కూడా ఆర్మీలో చేరేందుకు చాలా ప్రయత్నించి విఫలమయ్యాడు.. ఆ అక్కను స్ఫూర్తిగా తీసుకుని, అన్న ఆశయాన్ని తాను నెరవేర్చాలనుకుని శిక్షణ పొందాడు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పరుగు పందెం, దేహ దారుఢ్య పరీక్షల్లో విజయం సాధించాడు. రాత పరీక్ష పూర్తయితే ఆర్మీలో చేరడమే ఆలస్యమని అనుకున్నాడు. కానీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆర్పీఎఫ్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్‌పేట గ్రామానికి చెందిన దామెర రాకేశ్ (21) కథ ఇది. దబ్బీర్‌పేటకు చెందిన దామెర కుమారస్వామి–పూలమ్మలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల్లో రాకేశ్ చిన్నవాడు. బీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు. రాకేశ్ సోదరి రాణి, సోదరుడు రాంరాజ్ సైన్యంలో చేరేందుకు చాలాకాలం ప్రయత్నించారు. 2016 లో రాణి బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్‌గా ఎం పికై పశ్చిమబెంగాల్లో పనిచేస్తున్నారు. అక్కను స్ఫూర్తిగా తీసుకుని, అన్న ఆశయాన్ని నెరవేర్చాలని నిర్ణయించుకున్న రాకేశ్.. రెండేళ్ల క్రితం బాపట్లలో ఆర్మీ ఉద్యోగ శిక్షణ పొందాడు. 2021లో హకీంపేటలో జరిగిన రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని రాత పరీక్షకు అర్హత సాధించాడు. హకీంపేటలో అర్హత సాధించినవారు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్‌లో.. ఆందోళన కార్యక్రమం గు రించి తెలిసి స్నేహితులతో కలిసి సికింద్రాబాద్‌కు వచ్చా డు. రైల్వేస్టేషన్లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. నేడు దబ్బీర్‌పేటలో అంత్యక్రియలు! రాకేశ్ మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. ప్రత్యేక అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని తమకు చూపకుండానే మార్చురీకి తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగగా.. శనివారం ఉదయం అప్పగిస్తామని పోలీసులు సర్దిచెప్పారు. రాకేశ్ మృతదేహానికి శనివారం దబ్బీర్‌పేటలో అంత్యక్రియలు జరుగుతాయని పోలీసువర్గాలు తెలిపాయి. మోదీ నా కొడుకును చంపాడు నా కొడుకు పట్టుదలతో చదువుకుంటున్నాడు. ఉద్యోగం సాధిస్తాడనే నమ్మకం ఉండేది. కానీ నా బిడ్డను కేంద్రం పొట్టన పెట్టుకుంది. నరేంద్ర మోదీ నా కొడుకును చంపాడు. ఉద్యోగం రాకున్నా కష్టపడి సాదుకునేవాడిని. నా కొడుకును కనుమరుగు చేశారు. మాకు న్యాయం కావాలి. అంతవరకు మృతదేహానికి అంత్యక్రియలు చేయబోం.. – దామెర కుమారస్వామి, రాకేశ్ తండ్రి ప్రాణం పోయినా పోరాటం ఆగదు ఛాతీలో పిల్లెట్ గాయంతో యువకుడి వీడియో వైరల్ గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): ‘‘2021లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో రన్నింగ్, ఫిజికల్, మెడికల్ టెస్ట్‌ల్లో పాసయ్యాను. రెండేళ్లవుతున్నా రాతపరీక్ష నిర్వహించలేదు. ఇప్పుడు అగ్నిపథ్ అంటున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ధర్నా చేస్టుంటే కాల్చారు. ప్రాణం పోయినా మా పోరాటం ఆగదు. ఒకవేళ నేను చనిపోతే పోలీసులు, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కారణం..’’.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కాల్పుల్లో గాయపడిన లక్కం వినయ్ (20) బాధ ఇది. పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన వినయ్‌కు ఛాతీపై కుడి భాగంలో పిల్లెట్ తగిలి తీవ్ర గాయమైంది. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అంబులెన్స్ సిబ్బంది వినయ్‌తో మాట్లాడుతూ వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వినయ్‌కు చిన్నపాటి శస్త్రచికిత్స చేశామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. -
Agnipath scheme : అగ్గి పథం
త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తెచ్చిన ‘అగ్నిపథ్’ పథకం రాష్ట్రంలోనూ అగ్గి పుట్టించింది. ఆర్మీలో చేరేందుకు సిద్ధమవుతున్నవారు, పాత రిక్రూట్మెంట్లలో వివిధ దశలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కలకలం రేపారు. మొదట రైల్‌రోకో నిరసనగా మొదలుపెట్టినా ఆర్పీఎఫ్ పోలీసుల లాఠీచార్జితో రెచ్చిపోయి రైల్వేస్టేషన్లో తీవ్ర విధ్వంసం సృష్టించారు. రైలు ఇంజిన్లు, ఏసీ బోగీల అద్దాలు పగలగొట్టారు. కొన్ని బోగీలకు నిప్పుపెట్టారు. రైల్వే పార్సిళ్లను బయటపడేసి నిప్పుపెట్టారు. దీంతో భయాందోళనకు లోనైన ప్రయాణికులు లగేజీని వదిలేసి పరుగులు పెట్టారు. భద్రతా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం, ఆందోళన శ్రుతి మించుతుండటంతో రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఒకరు మృతి చెందగా మరో 13 మంది గాయపడ్డారు. అయినా సాయంత్రం దాకా ఆందోళన కొనసాగింది. రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు.. చర్చలు జరుపుదామంటూ ఆందోళనకారులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ విధ్వంసంలో రూ. 7 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. సాక్షి, హైదరాబాద్/సికింద్రాబాద్: హైదరాబాద్‌లోని హకీంపేట ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్ పరిధిలో 2021 మార్చి 31న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించారు. మొత్తం 6,900 మంది హాజరవగా.. ఫిజికల్, మెడికల్ పరీక్షలు దాటి 3 వేల మంది వరకు రాతపరీక్షకు ఎంపికయ్యారు. కరోనా కారణంగా ఆ ఏడాది మే 1న జరగాల్సిన రాతపరీక్ష వాయిదా పడింది. ఎప్పుడు పెడతారా అని అభ్యర్థులు ఎదురుచూస్తున్న తరుణంలో.. కేంద్రం అగ్నిపథ్ పేరిట ‘టూర్ ఆఫ్ డ్యూటీ (టీఓడీ)’అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. ఆర్మీ రిక్రూట్మెంట్కు గరిష్ట వయోపరిమితి 23 ఏళ్లు కాగా.. అగ్నిపథ్‌కు 21 ఏళ్లు మాత్రమే. ఓవైపు రిక్రూట్మెంట్ ప్రక్రియను ఆపేయడం, మరోవైపు వయోపరిమితి తగ్గి అర్హత కోల్పోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగాలని నిర్ణయించుకున్నారు. రిక్రూట్మెంట్ ర్యాలీ సమయంలో కలిసినప్పుడు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూపుల్లో దీనిపై ప్రచారం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ వద్ద నిరసన చేపడదామని నిర్ణయించుకున్నారు. మీడియాకు ఫోన్లు చేసి మరీ.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగులు, ఆర్మీ ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు రాష్ట్రంలోని దూర ప్రాంతాలవారు గురువారం రాత్రే సికింద్రాబాద్ చేరుకుని.. రైల్వేస్టేషన్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో బస చేశారు. సమీప ప్రాంతాల వాళ్లు శుక్రవారం తెల్లవారుజామునే వివిధ రైళ్లలో సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. ఆందోళన మొదలుపెట్టడానికి ముందు కొందరు మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిరసన చేపడుతున్నట్టు సమాచారమిచ్చారు. మొదట ఉదయం 9.30 గంటల సమయంలో దాదాపు 100 మంది అభ్యర్థులు.. రేతిఫైల్ బస్‌స్టేషన్ వైపు నుంచి రైలుపట్టాలపైకి చేరుకున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షలను వెంటనే నిర్వహించాలని, అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. మౌలాలి వైపు వెళ్లే రైళ్లకు అడ్డంగా నిలబడి ఆపేశారు. మిగతా ఆందోళనకారులు లోపలికి ప్రవేశించడానికి సమయం కోసం వేచి చూశారు. ఇదంతా కొద్ది నిమిషాల్లోనే జరగడంతో రైల్వే అధికారులు, జీఆర్పీ (గవర్నమెంట్ రైల్వే పోలీస్), ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) పోలీసులు అవాక్కయ్యారు. వైర్లెస్ సెట్లలో దీనిపై సమాచారం ఇవ్వడంతో అన్నిద్వారాల వద్ద ఉన్న పోలీసులు ఆందోళన జరిగే ప్రాంతానికి పరుగులు పెట్టారు. ఇదే సమయంలో బయట వేచి ఉన్న ఆందోళనకారులంతా స్టేషన్లోకి చొచ్చుకువచ్చారు. ప్లాట్‌ఫాంలపై ఆగిఉన్న రైళ్ల అద్దాలు పగలగొడుతూ ప్రయాణికులు వెళ్లిపోవాలని హెచ్చరించారు. పోలీసుల లాఠీచార్జితో.. ఈలోగా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు లాఠీచార్జికి దిగడంతో ఆందోళనకారులు అదుపు తప్పారు. వరుసగా ఒక్కో ప్లాట్‌ఫాంలో రైల్వే పరికరాలు, ఫర్నీచర్, దుకాణాలను ధ్వంసం చేస్తూ పట్టాలపై పడేస్తూ వెళ్లారు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన రెండు పార్శిల్ సర్వీస్ బోగీలకు, మరో రైలు బోగీకి నిప్పుపెట్టారు. 3 రైళ్ల ఇంజన్లు, ఏసీ బోగీల అద్దాలు పగలగొట్టారు. ప్లాట్‌ఫామ్‌లపై రైళ్ల రాక కోసం ఎదురుచూస్తున్నవారు, రైళ్లలో ఉన్న, కిందికి దిగిన ప్రయాణికులు భయంతో బయటికి పరుగులు పెట్టారు. చాలా మంది లగేజీని కూడా వదిలేసి పరుగెత్తారు. డీజిల్ ట్యాంక్‌వైపు వెళ్తుండటంతో.. ఆందోళనకారులు అప్పటికే ఆరో నంబర్ ప్లాట్‌ఫామ్ దాటేశారు. పదో నంబర్ ఫ్లాట్‌ఫామ్ పక్కన భారీ డీజిల్ ట్యాంక్, కంట్రోల్ రూం ఉండటంతో.. వాటికి నిప్పుపెట్టినా, ధ్వంసం చేసినా పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆర్పీఎఫ్ పోలీసులు ఆందోళనకు గురయ్యారు. సరిపడా సిబ్బంది లేకపోవడం, ఆందోళనకారులు చొచ్చుకువస్తుండటంతో కాల్పులకు దిగారు. దీనితో రాకేశ్ అనే యువకుడు మృతిచెందగా.. మరో 13 మందికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం, క్షతగాత్రులకు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అడ్డుకునే ‘శక్తి’లేకనే.. కాల్పుల వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మొత్తం 10 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. శుక్రవారం విధుల్లో కేవలం 80 మంది రైల్వే పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నారు. వీరిలో 50 మంది ఆర్పీఎఫ్, 15 మంది జీఆర్పీ వాళ్లు కాగా.. మిగతా 15 మంది హోంగార్డులు. నిజానికి రోజూ కేవలం 50 మందే విధుల్లో ఉంటారని.. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండటంతో రెండు రోజులుగా మరికొందరిని మోహరించారని సమాచారం. ఉన్నది కొందరే కావడం, ఆందోళనల సమయంలో ఎలా వ్యవహరించాలనే అనుభవం లేకపోవడంతో.. రైల్వేస్టేషన్లో విధ్వంసం, కాల్పుల వరకు వెళ్లినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే రైలు పట్టాలు, ప్లాట్‌ఫామ్‌లపై నిరసనకు దిగిన ఆందోళనకారులపై విచక్షణా రహితంగా లాఠీచార్జి చేశారని.. ఇది వారు మరింత రెచ్చిపోయేందుకు కారణమైందని అంటున్నాయి. సాధారణంగా ఆందోళనల సమయంలో మొదట మైకుల్లో హెచ్చరించాలని, అప్పటికీ పరిస్థితులు మారకుంటే మొదట టియర్ గ్యాస్ ప్రయోగం, ఆపై లాఠీచార్జి చేయాలని పేర్కొంటున్నాయి. మరీ హింసాత్మక ఆందోళనతో తీవ్ర నష్టం వస్తున్నట్టు ఆధారాలు ఉన్నప్పుడే కాల్పుల వరకు వెళ్లాలని.. ఈ అంశాలను రైల్వే పోలీసులు పట్టించుకోలేదని అంటున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో అభ్యర్థుల నిరసన భారీ విధ్వంసం జరగకూడదనే.. సికింద్రాబాద్ (హైదరాబాద్): రైల్వేస్టేషన్లో భారీ పేలుడు వంటి విధ్వంసమేదీ జరగకుండా నిలువరించేందుకే.. తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని రైల్వే పోలీసులు పేర్కొంటున్నారు. ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు, అదుపు చేసేందుకు చాలాసేపు ప్రయత్నించామని అంటున్నారు. తీవ్ర భయాందోళనకు గురయ్యాం బిహార్‌లోని పట్నా సమీపంలో ఉన్న మా ఊరికి వెళ్లేందుకు ఉదయం 9.30 గంటలకు సికింద్రాబాద్‌కు వచ్చాను. కొద్ది నిమిషాల్లోనే వందల మంది రైల్వేస్టేషన్‌లోకి చొరబడ్డారు. పోలీసులు, ఆందోళనకారుల ఉరుకులు, పరుగులతో తీవ్రంగా భయమేసింది. కాసేపటికే బోగీలకు నిప్పు పెట్టడం, పట్టాలపై బైకులు వేసి అంటించడం కనిపించింది. దీనితో స్టేషన్ నుంచి బయటికి పరుగెత్తాం. –నితేష్, బిహార్, ప్రత్యక్ష సాక్షి హైదరాబాద్ పోలీసులు వచ్చాకే అదుపులోకి.. పోలీసు కాల్పుల అనంతరం కూడా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. ప్లాట్‌ఫామ్‌ల పైనుంచి వెళ్లిపోయి రైలు పట్టాలపైకి చేరుకుని రాళ్లు రువ్వుతూ నిరసన కొనసాగించారు. వాస్తవానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో భద్రత బాధ్యత ఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలే చూసుకుంటాయి. అయితే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు.. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్లతోపాటు ఉత్తర మండల డీసీపీ చందనా దీప్తి, అదనపు డీసీపీ జి.వెంకటేశ్వర్లు తదితరులు మధ్యాహ్నానికి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించి.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడానికి వ్యూహం రూపొందించారు. సాయంత్రం 4 గంటల సమయంలో చర్చలు జరుపుదామని నిరసనకారులకు ప్రతిపాదించారు. కొందరు తమతో వస్తే ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్ (ఏఆర్ఓ) వద్దకు తీసుకువెళ్తామని చెప్పారు. కానీ ఆందోళనకారులు దీనికి సమ్మతించలేదు. అధికారులే తమ వద్దకు వచ్చి చర్చించాలని పట్టుబట్టారు. ఇలాగే మరో గంట సమయం గడిచింది. ఈలోగా రైల్వేస్టేషన్ వద్ద ఉన్న సిటీ పోలీసు బలగాలు, టాస్క్‌ఫోర్స్ అధికారులు, ఇతర ప్రత్యేక బలగాలతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్)ను రంగంలోకి దింపారు. రైల్వేస్టేషన్‌ను చుట్టుముట్టారు. ► సాయంత్రం 5 గంటల సమయంలో 20 మందిని చర్చలకు తీసుకెళ్తామని ప్రతిపాదించారు. మధు, బాల్సింగ్ల నేతృత్వంలోని బృందం చర్చలకు వస్తుందని నిరసన కారులు చెప్పారు. ఇలా సుమారు 20 మందిని స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లి వివిధ ఠాణాలకు తరలించారు. ► ఆరు గంటల సమయంలో బలగాలన్నీ ఒక్కసారిగా ఆందోళనకారులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నాయి. పారిపోతున్న వారిని, ప్లాట్‌ఫామ్స్ వైపు వెళ్తున్న వారిని పోలీసులు వెంబడించి పట్టుకుని స్టేషన్లకు తరలించారు. కాసేపట్లోనే రైల్వే స్టేషన్ అధికారుల అధీనంలోకి వచ్చింది. రాకేశ్ మృతిపై పోస్టుమార్టంలో స్పష్టత! సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో మృతి చెందిన దామెర రాకేశ్‌కు ఛాతీ భాగంలో రక్తపు గాయమైందని వైద్యులు తెలిపారు. అయితే రాకేశ్ మరణానికి కారణం రాయి తగలడమా, తూటా కారణమా అన్న దానిపై పోస్టుమార్టం నివేదికలో స్పష్టత వస్తుందని వెల్లడించారు. 9 గంటలు.. కలకలం.. శుక్రవారం ఉదయం 9.30 గంటలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో (మౌలాలి వైపు) రేతిఫైల్ బస్‌స్టేషన్ వెనుక ఉన్న రైల్వేట్రాక్‌పైకి ఒక్కసారిగా 100 మంది ఆందోళనకారులు వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష యథాతథంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 9.40 గంటలు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు లాఠీచార్జి చేశారు. అదే సమయంలో ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌లోని అన్ని ప్రవేశ ద్వారాల నుంచి ఒక్కసారిగా వందల మంది ఆందోళనకారులు రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకు వచ్చి విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు. 10:15 దాదాపు 25 నిమిషాల్లోనే.. ఒకటి నుంచి 6వ నంబర్ ప్లాట్‌ఫామ్ వరకు ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న యంత్రాలు, దుకాణాలను ధ్వంసం చేశారు. గూడ్స్ రైళ్లలో పంపేందుకు ఉంచిన పార్శిల్ కార్యాలయానికి చెందిన ప్యాకేజీలు, ద్విచక్ర వాహనాలను పట్టాలపై వేసి నిప్పుపెట్టారు. రైలు బోగీలకూ నిప్పంటించారు. 10:30 ఆందోళనకారులు 6వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో ప్రత్యేక పోలీసు బృందాలు రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించాయి. వారిని అదుపు చేయడం కోసం కాల్పులు జరిపారు. పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. 11:00 పోలీసు బృందాలు రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఆందోళనకారులను బయటకు తరిమాయి. దీనితో వారంతా మౌలాలి వైపున్న రైల్వేట్రాక్‌పైకి చేరుకుని.. పోలీసులపై రాళ్లు రువ్వుతూ ఆందోళన కొనసాగించారు. మధ్యాహ్నం 12.00 గంటలు హైదరాబాద్ అదనపు సీపీ శ్రీనివాస్, జాయింట్ సీపీ రంగనాథ్,డీసీపీ చందనాదీప్తి, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు రైల్వేస్టేషన్‌కు చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. 2.00 గంటలు ఆందోళనకారులతో పోలీసు అధికారులు చర్చలు ప్రారంభించారు. ఆందోళనకారుల నుంచి ఇద్దరు ప్రతినిధులు వస్తే ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్ కార్యాలయానికి తీసుకెళ్లి చర్చిద్దామని సూచించారు. కానీ ఆందోళనకారులు ముందుకు రాలేదు. ఆర్మీ అధికారి వచ్చి రాత పరీక్ష తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలీసుల చర్చల ప్రయత్నాలను కొనసాగించారు. అదే సమయంలో రైల్వేస్టేషన్ చుట్టూ భారీ సంఖ్యలో బలగాలను సిద్ధం చేశారు. 6.15 గంటలు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా పలు విభాగాలకు చెందిన వందల మంది పోలీసులు అన్నివైపుల నుంచి రైల్వేస్టేషన్‌లోకి చొచ్చుకువచ్చారు. ఆందోళనకారులను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. 7.00 గంటలు రైల్వే అధికారులు, సిబ్బంది స్టేషన్లో పరిస్థితిని చక్కదిద్దే ఏర్పాట్లు మొదలుపెట్టారు. పట్టాలపై వేసిన వాహనాలు, ఇతర సామగ్రిని తొలగించడం వంటి చర్యలు చేపట్టారు. రాత్రి 08.30 గంటలు రైల్వేస్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభంఅయ్యాయి. -
అవసరమైతే ఆర్మీ రిక్రూట్మెంట్ని ప్రవేశ పెడతాం!
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు చాల రసవత్తరంగా సాగుతున్నాయి. శాసనసభకు తొలిసారి పోటీచేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ సీఎం పై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఆర్మీలో రిక్రూట్మెంట్ ప్రవేశపెట్టి ఖాళీ స్థానాలను భర్తీ చేసి ఉద్యోగావకాశాలను కల్పిస్తానని ఆగ్రా ప్రచార ర్యాలీలో అన్నారు. అంతేకాదు గతనెల 30న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషలో మీడియాలో... "సమాజ్‌వాద్ పార్టీ(తుపాకీ పార్టీ) నాయకులు కైరానా, ముజఫర్‌నగర్‌లలో తమ వేడి తగ్గలేదంటూ బెదిరిస్తున్నారు. మార్చి పది తర్వాత ఆ వేడి తగ్గిపోతుందిలే అంటూ వ్యగ్యంగా ట్వీట్ చేశారు." దీంతో అఖీలేశ్ యాదవ్ ఆయన వ్యాఖ్యల పై గత వారంరోజులుగా నిప్పులు చెరుగుతున్నారు. అయినా సీఎం తమ పార్టీ వేడిని తగ్గించినా తాము అధికారంలోకి వస్తే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లోని ఖాళీ స్థానాలను తొలగిస్తామంటూ గట్టి కౌంటరిచ్చారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌సీఎం యోగికి హింసతోనే సాన్నిహిత్యం ఉంది తప్ప శాంతితో కాదు అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఈసారి గోరఖ్‌పూర్ ఓటర్లు అతన్ని ఉత్తరాఖండ్‌కు తిరిగి పంపుతారని అన్నారు. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షమైన లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరి మాట్లాడుతూ.."యోగి ఆదిత్యనాథ్ అసౌకర్య ప్రశ్నలను నివారించడానికి అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగిస్తాడు. అయినా యోగి నిరుద్యోగ యువత వేడిని ఎలా తగ్గిస్తారో పేర్కొనాలి" అని అన్నారు. (చదవండి: యోగితో యూపీలో అభివృద్ధి!) -
నేటి నుంచి మెగా ఆర్మీ రిక్రూట్మెంట్
గుంటూరు వెస్ట్: మెగా ఆర్మీ రిక్రూట్మెంట్కు గుంటూరులోని బీఆర్ స్టేడియం సిద్ధమైంది. గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు జరగనున్న ఈవెంట్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి 34 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రోజూ 2,500 నుంచి 3,000 మంది వరకు అభ్యర్థులు అర్హత పోటీల్లో పాల్గొంటారు. కఠినమైన శారీరక, రాత పరీక్షలను దాటితేగానీ ఉద్యోగం సంపాదించే వీలుండదు. ఆర్మీ అధికారులు అభ్యర్థులకు ముందుగానే తేదీల వారీగా అడ్మిట్ కార్డులు ఆన్లైన్ ద్వారా జారీ చేశారు. ఇప్పటికే చాలా మంది గుంటూరుకు చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తో ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే వివిధ స్థాయిలకు సంబంధించిన 150 మంది ఆర్మీ అధికారులు స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్టెప్ సీఈవో డాక్టర్ శ్రీనివాసరావు లైజనింగ్ అధికారిగా ఉన్నారు. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. అభ్యర్థులు మాస్క్‌తోపాటు శానిటైజర్ తెచ్చుకోవాలని సూచించారు. పోలీసుల పటిష్ట ఏర్పాట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. సుమారు 250 మంది సాయుధులైన పోలీసులతో పాటు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఆర్మీ అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ల నేతృత్వంతో రోడ్లు భవనాల శాఖ, జీఎంసీ, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్, విద్యుత్ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 500 ఫ్లడ్లైట్స్, బారికేడ్లు, సీసీ కెమెరాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. వర్షం వల్ల ఇబ్బంది కలిగితే పొన్నూరు రోడ్డులో అదనపు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ క్రమశిక్షణతో మెలగాలి ఆర్మీ అధికారులతో కలిసి మన జిల్లా అధికారులు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో మెలగాలి. దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం ఈ ఉద్యోగాల ద్వారా యువతకు లభిస్తుంది. ప్రతిభ ఆధారంగా ఆర్మీ ఆధ్వర్యంలో ఎంపిక ఉంటుంది. ఈ విషయం అభ్యర్థులు గుర్తించాలి. వర్షాలు పడినా ఇబ్బంది లేకుండా అదనపు ఏర్పాట్లు చేశాం. – వివేక్‌యాదవ్, కలెక్టర్ -
Army Recruitment Rally: ఆగస్ట్ 16 నుంచి విశాఖలో..
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆగస్ట్ 16 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా నిబంధనలు పాటిస్తూ ర్యాలీ నిర్వహిస్తామని..ప్రతి ఒక్క అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కేంద్రపాలిత ప్రాంతం యానాంకు చెందిన యువత మాత్రమే రిక్రూట్మెంట్కు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్ట్ 3లోగా www.joinindianarmy.nic.inలో దరఖాస్తు చేసుకోవాలని, ఆగస్ట్ 9 నుంచి అడ్మిట్ కార్డ్స్ అందుబాటులోకి వస్తాయని వివరించారు. దళారులకు డబ్బులు చెల్లించి మోసపోవద్దని సూచించారు. భర్తీ చేసే పోస్టులివే: సోల్జర్–జనరల్ డ్యూటీ, సోల్జర్–టెక్నికల్/ ఏవియేషన్, సోల్జర్–టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్–క్లర్క్/స్టోర్ కీపర్, సోల్జర్ ట్రేడ్మన్. అర్హత: పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి, 10వ తరగతి, సంబంధిత సబ్జెక్టులతో 10+2/ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి. వయసు: అభ్యర్థుల వయసు సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులకు 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లు ఉండాలి. మిగతా పోస్టులకు 17 ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఉమ్మడి ప్రవేశ పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. -
వామ్మో.. కొంపముంచిన సేవా కార్యక్రమం..
సాక్షి, లంగర్‌హౌస్: లంగర్‌హౌస్‌లో ఓ సంఘం వారు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు శాపంగా మారాయి. నిర్వాహకులతో పాటు అక్కడికి వచ్చిన వారు కరోనా బారినపడ్డారు. గత కొన్ని రోజుల క్రితం గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు. కాగా లంగర్‌హౌస్‌కు చెందిన ఓ సంఘం వారు వీరికి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశారు. ఇందులో వందలాది మంది అభ్యర్థులు భోజనాలు చేశారు. కాగా వారం తరువాత సేవా కార్యక్రమాలు నిర్వహించిన పలువురి సుస్తి చేసింది. కాగా వీరిలో చాలా మంది గుట్టు చప్పుడు కాకుండా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. వీరిలో చాలా మంది వైద్యుల సలహాలతో మందులు తీసుకుని హోం క్వారంటైన్లో ఉండిపోయారు. కాగా ఈ సంఘటనలో పదుల సంఖ్యలో వైరస్ బారినపడ్డారని తెలిసింది. -
ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులపై సీబీ‘ఐ’
సాక్షి, విశాఖపట్నం: ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డులో వివిధ స్థాయిలో అధికారులను నియమించే సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ)లోని నియామకాల్లో కొంతమంది అధికారులు అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసులో ఆర్మీ ఉన్నతస్థాయి అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు ఉండటంతో సీబీఐ రంగంలోకి దిగి విచారించింది. దేశవ్యాప్తంగా విశాఖతో పాటు 30 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అవినీతి, అక్రమాల్లో 15 మంది ఆర్మీ ఉన్నతస్థాయి అధికారులతో పాటు లెఫ్ట్‌నెంట్ కల్నల్ మేజర్ నాయిబ్ సుబేదార్, సీపోయ్‌లు, మరో ఆరుగురు ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉన్నట్లు గుర్తించింది. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. -
శారీరక కొలతలు సరిపోకపోవడంతో...
కుభీర్(ముథోల్): మండల కేంద్రమైన కుభీర్‌కు చెందిన జిట్ట ప్రవీణ్ (24) ఆర్మీ ఉద్యోగం రాదనే బెంగతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కుభీర్‌కు చెందిన జిట్ట శంకర్–అనిత దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రవీణ్ డిగ్రీ మధ్యలో చదువు ఆపేసి ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ఆర్మీ ఉద్యోగం కోసం అతని స్నేహితులు దరఖాస్తు చేసుకోగా.. అందుక్కావాల్సిన అర్హతల కోసం కరీంనగర్లో ఆర్మీ ఎంపికకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్‌కు ప్రవీణ్ ఫోన్ చేశాడు. వారు చెప్పిన శారీరక కొలతలు తనకు సరిపోకపోవడంతో మనస్తాపం చెందాడు. ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తమ వ్యవసాయ చేన్లోని చింత చెట్టుకు ఉరి వేసుకున్నాడు. తిరిగి రాకపోవడంతో తమ్ముడు ప్రశాంత్ తొమ్మిది గంటలకు చేన్లోకి వెళ్లగా చెట్టుకు వేలాడుతూ కన్పించాడు. ప్రవీణ్ మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. (చదవండి: అతిథుల్లా వచ్చి.. అద్దె పిల్లలతో చోరీలు) ఆర్మీ ఉచిత శిక్షణకు స్పందన బెల్లంపల్లి: బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పట్ట ణంలోని ఏఎంసీ మైదానంలో ఆదివారం నిర్వహించిన ఆర్మీ ఉచిత శిక్షణకు స్పందన లభించింది. ఏసీపీ ఎం.ఏ రహెమాన్‌తో కలిసి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు అభ్యర్థుల రిజిస్ట్రేషన్, విద్యార్హత ధృవపత్రాలను పరిశీలించారు. 215 మంది హాజరు.. మార్చి 5 నుంచి 24 వరకు సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో పాల్గొనే యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఏసీపీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసులు ఉచిత శిక్షణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా యువకులకు ముందస్తుగా ఆదివారం శారీరక పరీక్షలు నిర్వహించారు. 215 మంది ర్యాలీలో పాల్గొనగా రాత పరీక్షకు 83 మంది అర్హత సాధించినట్లు ప్రకటించారు. ఎంపికైన యువకులకు ఈనెల 24న బెల్లంపల్లి కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబర్చిన మొదటి 50 మందికి క్యాంపులో శిక్షణ ఇవ్వనున్నట్లు ఏసీపీ రహేమాన్ తెలిపారు. కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ కె.జగదీష్, ఎస్సైలు సమ్మయ్య, భాస్కర్‌రావు, రమాకాంత్, బెల్లంపల్లి పీఈటీ అసోసియేషన్ నాయకులు, పీఈటీలు ఇమ్మానియెల్, బండి రవి, మిట్టపల్లి రమేశ్, ఎస్కే రాజ్‌మహ్మద్, అమర్, సత్యనారాయణ, చక్రపాణి, చాంద్‌పాష, ఖాదర్, తదితరులు పాల్గొన్నారు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే,ఏసీపీ -
ఆర్మీ రిక్రూట్మెంట్’ షురూ
మల్కాజిగిరి: టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్ బుధవారం మల్కాజిగిరి మౌలాలిలోని రైల్వే ఇంజినీర్ రెజిమెంట్ (రైల్వే టెరియర్ హెడ్ క్వార్టర్స్)లో ప్రారంభమైంది. నవంబర్ 14 వరకు రిక్రూట్మెంట్ కొనసాగనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు హాజరు కానున్నారు. సోల్జర్ జనరల్ క్యాటగిరీ, ట్రేడ్‌మెన్‌కు సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్థులు వారికి కేటాయించిన రోజుల్లో హాజరు కావాల్సి ఉంటుంది. రోజుకు సుమారు 6,500 మంది పాల్గొనాల్సి ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్ధానిక పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అభ్యర్థులకు తాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్స్ వసతి కల్పిస్తున్నారు. పుట్‌పాత్‌పైనే భోజనం.. కానీ.. అధికారులు మొక్కుబడిగానే ఏర్పాట్లు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు మహారాష్ట్రకు చెందిన అభ్యర్థులు హాజరయ్యారు. అత్యవసర పరిస్థితిలో అభ్యర్థులకు వైద్య సేవలు అవసరమైతే తరలించడానికి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. గతంలో ఇలాంటి రిక్రూట్మెంట్ జరిగినప్పుడు విద్యుత్ షాక్‌తో ఓ అభ్యర్థి మృతి చెందడంతో అధికారులు ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరు కానుండటంతో వారికి వసతి కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు. అభ్యర్థులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌లపైనే నిద్రించడంతో పాటు ఆహారాన్ని కూడా అక్కడే తీసుకుంటున్నారు. పరీక్షలకు హాజరయ్యే రోజు అభ్యర్థులకు టోకెన్లు ముందుగా జారీ చేసి లోనికి అనుమతిస్తున్నామని తెలిపారు. సుమారు 16 రోజులపాటు కొనసాగనున్న రిక్రూట్మెంట్లో నవంబర్ 6వ తేదీ ట్రేడ్‌మెన్ విభాగంలో అన్ని రాష్ట్రాలకు చెందిని అభ్యర్థులు హాజరవుతారు. -
ఆర్మీ ర్యాలీలో ‘సింగరేణి’ ప్రతిభ
సింగరేణి(కొత్తగూడెం)/గోదావరిఖని: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో సింగరేణి సేవా సమితి ద్వారా శిక్షణ పొందిన యువత అధిక సంఖ్యలో అర్హత సాధిస్తోంది. సింగరేణి సంస్థవ్యాప్తంగా 450 మంది నిరుద్యోగులను ఎంపిక చేసి శ్రీరాంపూర్, కొత్తగూడెం, రామగుండం–2 ఏరియాల రీజినల్ క్యాంపుల్లో శిక్షణనిచ్చింది. వీరిలో 240 మంది అభ్యర్థులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. కరీంనగర్లో ఈ నెల 7న ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 17వ తేదీ వరకు జరగ నుంది. సింగరేణి ద్వారా శిక్షణ పొందిన యువకులు.. ఈ నెల 13వ తేదీ వరకు శరీర ధారుడ్య పరీక్షకు187 మంది హాజరు కాగా 107 మంది అర్హత సాధించారు. శ్రీరాంపూర్ రీజియన్ నుంచి 66 మంది హాజరుకాగా 43 మంది, ఆర్జీ–2 రీజియన్ నుంచి 65 మంది హాజరుకాగా 38 మంది, కొత్తగూడెం రీజియన్ నుంచి 56 మంది హాజరుకాగా 26 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మెడికల్ పరీక్షకు ఎంపికయ్యారు. మిగిలిన ఐదు రోజుల్లో మరో 50 మంది సింగరేణి అభ్యర్థులు ర్యాలీకి హాజరుకానున్నారు. దశలవారీగా నిర్వహిస్తున్న పరీక్షల్లో ఇప్పటికే సింగరేణి ప్రాంత యువత 30 మంది ఎంపికయ్యారని కోఆర్డినేషన్ జీఎం ఆంటోనిరాజా వెల్లడించారు. ఆర్మీ ర్యాలీలో ఎంపికైన అభ్యరులకు నవంబర్ 24వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ‘సింగరేణి’అభ్యర్థులకు ఆర్జీ–2 ఏరియాలోని యైటింక్లయిన్‌కాలనీలో ఈ నెల 20వ తేదీ నుంచి రెసిడెన్షియల్ తరహాలో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్తిస్తామని అధికారులు తెలిపారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్: ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ప్రతిభ
-
దేశ సేవకు సింగరేణి యువత
వరంగల్ స్పోర్ట్స్: భరతమాత సేవకు మేము సైతం అంటున్నారు సింగరేణి యువత.. సరిహద్దుల్లో పహారా కాసే అవకాశం కోసం పరితపిస్తున్నారు. సైనికుడిగా మారాలన్న ఆశయంతో పట్టుదలతో కఠోర సాధన చేసి.. వారం రోజులుగా హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కొనసాగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 150 మంది యువకులు ఆర్మీలోని వివిధ కేటగిరీల్లోని ఉద్యోగం కోసం పోటీ పడగా 93 మంది ఇప్పటి వరకు ఎంపికయ్యారు. రెండు నెలలుగా శిక్షణ... యువత ఆకాంక్షను నెరవేర్చేందుకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో రెండు నెలలుగా మెరుగైన శిక్షణ అందించింది. అంతేకాదు ర్యాలీలో పాల్గొంటున్న యువతకు హన్మకొండలో ఉచిత భోజన, ఇతర వసతులను ఏర్పాటు చేసింది. సింగరేణి సీఎండీ శ్రీధర్, భూపాలపల్లి జనరల్ మేనేజర్ గురువయ్య ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన శిక్షణను పూర్తి స్థాయిలో యువకులు సద్వినియోగం చేసుకున్నారు. సింగరేణి పరిధిలోని భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, రామగుండంలోని మూడు ఏరియాలు, బెల్లంపల్లి, మందమర్రి మొత్తం పది ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ కల్పన కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సింగరేణి సేవా సమితి పేరుతో సంస్థను స్థాపించారు. 2000 సంవత్సరంలో ఏర్పాటైన ఈ సంస్థ ద్వారా సింగరేణి కార్మికుల పిల్లలు, ఆ పరిధిలోని నిరుద్యోగ యువతకు శిక్షణ అందిస్తున్నారు. సింగరేణిలోని ఆయా ప్రాంతాల్లో విధుల్లో స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు యువతకు ఫిజికల్‌గా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 18 సంవత్సరాలలో శిక్షణ పొందిన వారిలో 1000 మంది వరకు ఆర్మీలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు చేస్తుండడం విశేషం. యువతకు శిక్షణ ఇచ్చేందుకు సింగరేణి కోఆర్డినేషన్ విభాగం ఏర్పాటు చేశారు. ఈ విభాగం ద్వారా ప్రతి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి నిధులను సైతం విడుదల చేస్తున్నారు. ఈసారి దాదాపు రెండు నెలల పాటు 150 మంది అభ్యర్థులు శిక్షణ ఇచ్చారు. హన్మకొండలోని జేఎన్ఎస్లో ఈనెల 22 నుంచి నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఇప్పటి వరకు 104 మంది అభ్యర్థులు వివిధ కేటగిరీల్లో పాల్గొన్నారు. అందులో 67 మంది దేహదారుఢ్య పరీక్షలో నెగ్గి మెడికల్ టెస్ట్‌కు క్వాలీఫై కాగా, 26 మంది మెడికల్ పరీక్షల్లో సైతం అర్హత సాధించి రాత పరీక్ష సిద్ధమవుతున్నారు. ఇక మరో 9 మంది మెడికల్ టెస్ట్‌లో అర్హతను కోల్పోయారు. ట్రేడ్‌మెన్‌కు ఎంపికయ్యాను జవాన్ ఉద్యోగం చేయాలన్న నా ఆశయం నేటి నెరవేరింది. నెల రోజులకు నాకు శిక్షణ అందించిన సింగరేణి సేవా సమితికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఊరిలో కొందరు ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిని చూసినప్పటి నుంచి నేనూ ఆర్మీలో చేరాలనుకున్నాను. ఏడాదిగా ప్రతి రోజు వ్యాయామం చేస్తున్నాను. అనుకున్న ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. జీఎం పంపిన చెక్కును కలెక్టర్ అమ్రపాలికి అందజేస్తున్న నోడల్ ఆఫీసర్ సాధన్ -
నిరుద్యోగులకు శుభవార్త ఆర్మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
హన్మకొండ అర్బన్ : మే 20 నుంచి 31వరకు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ పవన్ పూరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జేసీ దయానంద్‌తో కలిసి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం ర్యాలీ ఏర్పాట్లు సమీక్షించారు. ఆర్మీలో ఖాళీగా ఉన్న వెయ్యి పోస్టుల భర్తీ కోసం తెలంగాణలోని 31 జిల్లాల యువతకు ఆరు కేటగిరీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. 11రోజులపాటు జరిగే ర్యాలీలో పాల్గొనే అర్హతలు ఉన్నవారు ఈ నెల 6 నుంచి మే 5 వరకు www. joinindianarmy.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణత కనీస విద్యార్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి మే 10 లోగా బార్కోడ్, నియమ నిబధనలు తెలియ చేయడం జరగుతుందని వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రాము, డీఆర్ఓ డేవిడ్, ఉపాది అధికారి మల్లయ్య, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి శివలింగయ్య, ఆర్‌డబ్ల్యూస్ ఎస్ఈ రాంచందర్, ఆర్డీఓ వెంకారెడ్డి సమాచార శాఖ డీడీ జగన్ పాల్గొన్నారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్లో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. తొలిరోజు పూర్వ ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగం ర్యాలీకి సుమారు 5 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో సుమారు వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ఎత్తు సరిగా లేకపోవటంతో తిప్పి పంపించారు. దీంతో 4,075 మంది అభ్యర్థులు రన్‌కు అర్హత సాధించారు. రన్లో కేవలం 419 మంది మాత్రమే అర్హత సాధించారు. రన్నింగ్, శారీరక సామర్థ్య పరీక్షలతోపాటు ఫిజికల్ పరీక్షలను సీసీ కెమెరాలలో బంధించారు. బుధవారం కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగంలో ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి 5,961 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకొన్నారు. కాగా, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నియామకాలు పకడ్బందీగా జరిగాయి. చైన్నె ఆర్మీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ వి.ఎస్.సాంఖ్సాన్ కనుసన్నల్లో నియామక ప్రక్రియ సాగింది ఆయనతోపాటు ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నల్ పవన్ పూరి, కరీంనగర్ పోలీస్ కమీషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి హెలిప్యాడ్ ప్రాంగణంలో ఉండి పర్యవేక్షించారు. -
చైనా ఆర్మీకి అదే పెద్ద తలనొప్పి
షాంఘై: చైనా సైన్యం ఇప్పుడు తెగ ఆందోళన చెందుతోంది. కొత్తగా ఆర్మీలో చేరేందుకు వస్తున్న వారిలో ఎక్కువ శాతం తిరస్కరణకు గురికావటం అందుకు కారణం. తద్వారా కమ్యూనిస్ట్ దేశానికి బలమైన సైన్యాన్ని సమకూర్చుకోవాలన్న దేశాధ్యక్షుడు జింగ్ పింగ్ కోరికకు గండిపడుతోంది. అయితే అందుకు కారణాలు లేకపోలేదు. అతి స్వయం సంతృప్తి మూలంగా శారీర పరీక్షల్లో విఫలమవుతుండటంతో నియామక ప్రక్రియ మొదటి రౌండ్లోనే అభ్యర్థులు వెనుదిరుగుతున్నారని తాజాగా పీఎల్ఏ డెయిలీ అనే ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. వీటితోపాటు డ్రాగన్ కంట్రీ ఆర్మీలో కొత్త చేరికలు లేకపోవటానికి మరో పది కారణాలు కూడా ఉన్నాయంటూ తెలిపింది. అతిబరువు కారణంగా 20 శాతం మంది, రాత్రిళ్లు ఫోన్లలో గడపటం, ఇంటర్నెట్ ఎక్కువగా వాడకం, స్వయం సంతృప్తి చేష్టల మూలంగా 8 శాతం, ఫిట్ నెస్ లేకపోవటం, వీడియో గేమ్‌లు ఎక్కువగా ఆడటం, ఒంటిపై టాటాలు, అతిగా మద్యం సేవించి లివర్ పాడయిపోవటం వంటి కారణాలు వారి చేరికలకు ఆటంకాలుగా మారుతున్నాయని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం చైనాది. ఇందులో చేరాలంటే చాలా కఠిన నిబంధనలు ఉంటాయి. చాలా ధృఢంగా ఉండాలి. ఏ ఒక్క పరీక్షలో పాస్ కాకపోయినా వాళ్లకు అవకాశం దక్కదు అంటూ రక్షణ మంత్రి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆధునిక జీవన శైలే ఇప్పటి యువత అనారోగ్యులుగా, సోమరులుగా మారుస్తుందని సైన్యం కూడా ఈ మధ్య విమర్శలు చేస్తూ వస్తోంది. ఇక ఆ మధ్య కింగ్ ఆఫ్ గ్లోరీ అనే వీడియో గేమ్ మూలంగా అత్యవసర సమయాల్లోనూ సైనికులు గతి తప్పిన ఘటనలు వెలుగులోకి తెస్తూ ఇదే పత్రిక కథనం వెలువరించింది కూడా. -
కొలువే లక్ష్యంగా..
రెండోరోజు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి 2771 హాజరు.. మెడికల్ టెస్ట్‌కు 567 మంది ఎంపిక బోట్‌క్లబ్(కాకినాడ) : స్థానిక జిల్లా క్రీడా మైదానంలో గురువారం కూడా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కొనసాగింది. ఆరు జిల్లాల నుంచి 2771 మంది పాల్గొనగా.. కేవలం 567 మంది మాత్రమే మెడికల్ టెస్ట్‌కు ఎంపికయ్యారు. పరుగుపందెంలోని చాలా మంది అభ్యర్థులు డీలాపడ్డారు. పరుగు పందెంలో సత్తా చాటిన అభ్యర్థులకు జిగ్‌జాగ్, లాంగ్‌జంప్, పులప్స్, షాట్‌పుట్ పరీక్షలు నిర్వహించారు. వీటిలో విజయం సాధించిన అభ్యర్థులకు ఎత్తు, బరువు పరీక్షలు నిర్వహించారు. శిక్షణ లేకుండా రావడంతో అవస్థలు కొందరు అభ్యర్థులు ఎటువంటి శిక్షణ తీసుకోకుండా నేరుగా ర్యాలీ పాల్గొని అవస్థలు పడ్డారు. క్రీడా మైదానంలో 1600 మీటర్లు పరుగుపందెంలో పరుగెత్త లేక మధ్యలో కుప్పకూలారు. 1600 మీటర్ల పరుగును ఆరునిమిషాల్లో పూర్తి చేసిన వారికి బోనస్ పాయింట్స్ ఇస్తున్నారు. దీంతో కొందరు అభ్యర్థులు వేగంగా పరుగుపెట్టి ఇబ్బందులు పడ్డారు. గమ్యం చేరకుండానే డీలాపడ్డారు. ఆరునిమిషాల్లోపు గమ్యం చేరిన వారికి ఆర్మీ అధికారులు సిరాతో చెస్ట్‌పై మార్కు వేస్తున్నారు. వర్షంతో అవస్థలు వివిధ జిల్లాల నుంచి శుక్రవారం జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన అభ్యర్థులు గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో అవస్థలు పడ్డారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు స్థానిక శ్రీరామ్‌నగర్ మున్సిపల్ స్కూల్ సదుపాయాలు కల్పించినా, క్రీడా మైదానం సమీపంలోనే అభ్యర్థులు సేదతీరుతున్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు తెల్లవారుజామున హాజరుకావాల్సి రావడంతో స్కూల్‌కు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఎన్ఎఫ్సీఎల్æరోడ్డులోని పలు జిల్లా కార్యాలయాలు, క్రీడామైదానం బయట ఉన్న దుకాణ సముదాయం వద్ద, పుట్‌పాత్‌లపైన నిద్రిస్తున్నారు. -
హన్మకొండలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
హన్మకొండ : వరంగల్ లోని హన్మకొండలో బుధవారం ఉదయం ఆర్మీ పోస్టుల నియామకాల ర్యాలీ ప్రారంభమైంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరుగుతున్న ర్యాలీని జిల్లా కలెక్టర్ కరుణ హాజరై ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఏడు విభాగాల్లో 1,000 పోస్టులకు గాను 29,500 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 4 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8గంటల వరకు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ముగిసిన ఆర్మీ పరుగు
7 రోజుల్లో 26,689 మంది హాజరు కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా బుధవారం నాటికి దేహదారుఢ్య పరీక్షలు ముగిశాయి. ఈ నెల 4న సింగరేణి సంస్థ, రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో కొత్తగూడెంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. సోల్జర్ ట్రేడ్స్‌మన్, సోల్జర్ క్లర్క్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మన్, రిలీజియన్ టీచర్, డీఎస్సీ విభాగాల్లో ఎంపిక ప్రక్రియలు కొనసాగాయి. అన్ని విభాగాలకు తెలంగాణలోని 10 జిల్లాల నుంచి మొత్తం 36,051 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారంపాటు ఒక్కో విభాగానికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగింది. చివరిరోజైన బుధవారం సోల్జర్ ట్రేడ్స్‌మన్, రిలీజియన్ టీచర్, డీఎస్సీ విభాగాలకు 1,976 మంది దరఖాస్తు చేసుకోగా 1,220 మంది హాజరయ్యారు. వీరిలో పరుగుపందెంలో 343 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం వారంరోజుల్లో 36,051 మంది అభ్యర్థులకుగాను 26,689 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 22,519 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఎంపిక కాగా, 4,154 మంది అభ్యర్థులు పరుగుపందెంలో ఎంపికయ్యారు. ఇప్పటివరకు దేహధారుడ్య పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 14వ తేదీ వరకు కొత్తగూడెం పట్టణంలో మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మెడికల్ అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 28వ తేదీన సికింద్రాబాద్‌లో రాత పరీక్ష నిర్వహించి ఆర్మీకి ఎంపిక చేస్తారు. -
ఆర్మీ ర్యాలీకి ఐదు వేల మంది
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ శనివారం మూడో రోజుకు చేరింది. రాష్ట్రంలోని పది జిల్లాలస్థాయి రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి సుమారు 5వేల మందికిపైగా యువకులు తరలివచ్చారు. సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగంలో 6,258 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. పదో తరగతి విద్యార్హతతో దరఖాస్తులు కోరడంతో.. అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వేలాది సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పది జిల్లాలను మూడు రోజులు విభజించి ఎంపికలు చేపట్టారు. శనివారం మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థుల్లో పలువురు ముందు రోజే వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లలోనే రాత్రంతా నిరీక్షించారు. వేకువజామున 3 గంటలకు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైంది. అనంతరం అభ్యర్థులను గ్రూపుల వారీగా దేహదారుఢ్య పరీక్షల నిమిత్తం పంపించారు. ఎంపికైన వారికి బ్యాలెన్సింగ్ బీమ్, ఫుల్ అప్స్, లాంగ్ జంప్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. అన్నింట్లో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి ఆదివారం మెడికల్ పరీక్షలు చేపట్టనున్నారు. నేడు సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగంలో ఎంపికలు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగంలో ఆదివారం 4 జిల్లాల అభ్యర్థులకు ఎంపికలు చేపట్టనున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన 5,776 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు సంబంధించి సోమవారం నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు గుంటూరు రేంజ్ కల్నల్ దురవ్ చౌదరి తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ర్యాలీకి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి 1,600 ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్టు తెలిపారు. రిక్రూట్మెంట్ ర్యాలీలో 30 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన, దేహ దారుఢ్యం, వైద్య పరీక్షలు నిర్ణయించిన తేదీల్లోనే జరుగుతాయన్నారు. వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్‌లో రాత పరీక్ష ఉంటుందని తెలిపారు. -
పరుగు..ఇలా మెరుగు
విశాఖపట్నం : పరుగు తీసేందుకు ఒక పద్ధతి ఉంటుంది. స్పీడ్ రేస్ ఈవెంట్‌కు మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్‌కు తేడా గమనించాలి. వంద మీటర్ల పరుగును ఎనరోబిక్గా (శ్వాసను సయితం నియంత్రించి) పూర్తి చేస్తే కిలోమీటర్ల మేర పరుగు పెట్టెప్పుడు ఎయిరోబిక్గా క్రమపద్దతిలో గాలి పీల్చుకుంటూ పరుగు తీయాల్సి ఉంటుంది. జాగ్రత్తలు పాటిస్తూనే నిర్ణీత సమయంలో దేహదారుఢ్య పరీక్షలో పరుగును పూర్తి చేస్తేనే ఫిట్నె స్తో కూడుకున్న ఉద్యోగాల్లో ప్రాథమిక స్థితిని అధిగమించి ఫలితాన్ని పొందగలుగుతారు. లేకుంటే పరుగులో ప్రమాదమూ పొంచి ఉంటుంది. పరుగు పరీక్షకు ముందు ఇలా సమాయత్తమైతే విజయం మీదే.... ఇలా పరుగు వద్దు: ఖాళి కడుపుతోనో.. లేదా పూర్తిగా నిండిన కడుపుతో పరుగు పెట్టరాదు. పరుగు ప్రారంభించే రెండు నుంచి నాలుగు గంటల ముందే ఎక్కువ మోతాదులో నీటిని తీసుకోవాలి. అంతే గాని పరుగు ప్రారంభానికి ముందో లేదా పరుగెడుతున్నప్పుడో నీ టిని తీసుకోకూడదు. అత్యవరమైతే సిప్ చేయవచ్చు. గమ్యంపై అవగాహన ఆర్మీ, పోలీస్ లాంటి ఉద్యోగాల కోసం యువకులు పరుగుపై పూర్తి అవగాహన లేకుండానే సిద్ధమవుతుంటారు. లాప్ నుంచి మరో లాప్ పూర్తిచేసేప్పుడే రెంటి మధ్య కాల వ్యత్యాసాన్ని గమనించుకోవాలి. అందుకు తగిన విధంగా శరీరాన్ని సమాయత్తం చేసుకోవాలి. అందుకు ఫిట్నెస్ దోహదపడుతుంది. ఒక కిలోమీటర్ పరుగుకు సాధారణ స్టేడియాల్లో రెండున్నర లాప్లు పరుగెట్టాల్సి ఉంటుంది. తొలి లాప్లోనే వేగంగా పరుగెట్టిస్తే ఎండ్యూరెన్స్ తగ్గిపోయి చివరి లాప్ కష్టమైపోతుంది. నోటితో కాదు: పరుగులో శిక్షణ లేని అథ్లెట్లు నోటితో గాలి లోపలికి తీసుకుంటారు. కేవలం ముక్కుతోనే తీసుకోవాలి. కొందరికి శ్వాసనాళాల్లో సమస్య ఉంటే వారికి తెలీకుండానే నోటితో పీల్చేస్తారు. అది శరీరదారుఢ్య పరీక్షలప్పుడు ప్రమాదానికి దారి తీస్తుంది. పరుగు ప్రారంభించడానికి ముందే ముక్కుతో ధీర్ఘంగా గాలి తీసుకోవడం, అదే ఒత్తిడితో బయటికి వదలడంలో సాధన చేసి పరుగుకు సిద్ధమవ్వాలి. శ్వాసపై దృష్టిపెడుతూనే అందుకు అనువుగా కాళ్లలో వేగం పెరగాలి. అప్పుడే నిర్ణీత సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చు. వార్మప్ చేయాలి: పరుగు ప్రారంభించడానికి కొద్ది సేపటి ముందే శరీరాన్ని అందుకు అనువుగా వార్మప్ ఎక్సర్‌సైజ్‌లతో మార్చుకోవాలి. అలా చేయకుండా ఒక్కసారిగా పరుగుకు సమాయత్తం కావడం సరికాదు. నిద్రపోవాలి : పరుగు పరీక్షకు ముందురోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలి. దాంతో ఒత్తిడి బాగా తగ్గిపోతుంది. ఆ ప్పుడు తీసుకునే ఆహారం పరుగు సమయంలో ప్రభావం చూపిస్తుంది. కనుక తగిన మోతాదులోనే తీసుకోవాలి. డీహైడ్రేషన్ : పరుగు పెట్టెటప్పుడు శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. కార్బొహైడ్రేట్స్‌ను శరీరం వినియోగించుకుంటుంది. డిస్టెన్స్ రన్స్‌లో నీటిని తీసుకోవడంలో శ్రద్ధ వహించాలి. మానవుని శరీరంలో 82 శాతం నీటిమయమే. పరుగెత్తేప్పుడు చెమట పట్టడం ద్వారా తగ్గుతుంది. అందుకే కుడిచేత్తో నీటిని సిప్ చే స్తూ పరిగెట్టడం ద్వారా ఈ సమస్య అధిగమించవచ్చు. శరీరాన్ని చల్లబరుచుకోవాలి : దేహా దారుఢ్య పరీక్షలను ఎండ తీవ్రత రాకుండగానే ముగించాలి. ఎండలు మండిపోతున్నా యువకులు పరుగు పెట్టా ల్సి వస్తుంది. ఇలాంటప్పుడు పరుగు పెడుతూనే నీటిని శరీరంలోకి తీసుకోకుండా శరీరాన్ని చల్లబరిచేందుకే వినియోగించాలి. అంటే నీటిని తలపై వేసుకోవడం ద్వారా టెంపరేచర్‌ను సరిచేసుకోవచ్చు. తడి కాప్ పెట్టుకోవడం ద్వారా కొంత ఉపశమనం వస్తుంది. పరుగు పూర్తయిన తర్వాత : పరుగు పూర్తయ్యాక శరీరాన్ని కూల్ చేసుకోవాలి. మనం ఎంత మేర నీటి శాతాన్ని కోల్పోయామో అంత మోతాదును తీసుకోవాలి. ఎక్కువ దూరం పరుగులో 500మిల్లీలీటర్ల నీటిని వెంటనే తీసుకోవాలి. ఆరుగంటల్లోపే యూ రిన్కి పోవాలి. లేకుంటే కిడ్నీ సమస్య తలెత్తుతుంది. కండరాల బ్రేక్ డౌన్ వల్లే.. శరీరాన్ని అతిగా కష్టపెట్టటం వల్ల శరీరంలో కండరాలకు గాయం ఏర్పడుతుంది. దీని వల్ల మజిల్ ప్రొటీన్ అనేది విడుదలవుతుంది. దీంతో రక్తం చిక్కబడి పోతుంది. దీంతో రక్తంలో హైడ్రోజన్ స్థాయి పడిపోతుంది. 7.35 నుంచి 7.45 ఉండాల్సిన హైడ్రోజన్ స్థాయి 7.01కి నీలబాబు విషయంలో అదే జరిగింది. దీని వల్ల రక్తం శుద్ధి చేయటంలో కిడ్నీలకు కష్టతరంగా మారిపోతుంది. రక్తాన్ని వడకట్టలేక పోతాయి. మూత్రం బంధింపబడుతుంది. ఈ స్థితిని ఎసిలోసిస్ అంటారు. రోగి క్రమంగా షాక్‌లోకి వెళ్లిపోతాడు. ఈ పరిస్థితిని కార్డియోకరప్ట్ వస్తుంది. నగరంలో ఎండలు పెరిగిపోవటం, గాలిలో తేమ ఎక్కువుగా ఉండటం కూడా ఒక కారణం. -ఎం.మధుసూదనబాబు, కేజీహెచ్ సూపరింటెండెంట్ -
సైనికుడై వస్తాడనుకుంటే..
ఆర్మీ రిక్రూట్ మెంట్లో అపశ్రుతి పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచిన యువకుడు అనంతరం అస్వస్థతతో అపస్మారకస్థితికి చేరుకున్న వైనం విశాఖపట్నం కేర్‌లో చికిత్స పొందుతూ మృతి తూడిలో విషాదఛాయలు దేశసేవలో తరించాలనుకున్నాడు... భరతమాత ముద్దుబిడ్డగా ఎదగాలనుకున్నాడు... ఆర్మీజవానుగా మారి... శత్రు సైన్యాన్ని తుదముట్టించాలనుకున్నాడు... చిన్ననాటి కలలను సాకారం చేసుకోవాలనుకున్నాడు... విధి ఆ యువకుడిని చిన్నచూపు చూసింది... పట్టుదలతో పరుగులో మొదటిస్థానంలో నిలిచినా.. బతుకు పరుగులో విగతుడయ్యాడు... పాపం! కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. తూడి(వీరఘట్టం):ఆర్మీ జవాన్‌గా దేశసేవ చేయాలన్నది ఆ యువకుడి ఆశ. అదే సంకల్పంతో ఇప్పటికి రెండు సార్లు యత్నించి విఫలమయ్యాడు. మూడోసారి ఎంపికలకు కుటుంబ సభ్యులు వద్దనా పట్టుదలగా వెళ్లాడు. పరుగులో విజేతగా నిలిచాడు. కానీ విధివశాత్తూ అస్వస్థతకు లోనై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఇదీ తూడి గ్రామానికి చెందిన నీలబాబు(21) విషాద గాథ. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం రెండు రోజుల క్రితం తూడి గ్రామానికి చెందిన పొన్నాడ నీలబాబు తన మిత్రులతో కలిసి వెళ్ళాడు. బుధవారం నిర్వహించిన పరుగు పందెంలో అందరికంటే వేగంగా దూసుకువచ్చి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు లోనై అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆర్మీ సిబ్బంది కేజీహెచ్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తూ కేర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలబాబు ఊపిరితిత్తులు పూర్తిగా పాడవడంతో ఈ పరిస్థితి వచ్చిందని కేర్ వైద్యులు ధ్రువీకరించారు. కన్నీరుమున్నీరైన కన్నవారు తమ ఏకైక కుమారుడు ఆర్మీ జవాన్‌గా వస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రులకు తనయుడు విగతజీవుడయ్యాడనే వార్త తెలియగానే హతాసులయ్యారు. కన్నతల్లి గంగమ్మ, పెంచిన తల్లి గౌరీశ్వరి, తండ్రి పెద్ద గౌరినాయుడు ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. తరువాత తేరుకుని కొడుకును చూసేందుకు విశాఖపట్నం తరలి వెళ్ళారు. నీలబాబుకు డిగ్రీ చదువుతున్న చెల్లెలు సంధ్యారాణి ఉన్నారు. నీలబాబు మరణవార్త గ్రామమంతా పాకడంతో వారంతా నిర్ఘాంతపోయారు. మొత్తమ్మీద తూడి గ్రామమంతా విషాదఛాయలు అలముకున్నాయి. -
విరిగిన లాఠీ
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో గందరగోళం వేలాదిగా తరలి వచ్చిన యువత తొక్కిసలాటలో చిరిగిపోయిన సర్టిఫికెట్లు విరుచుకుపడిన పోలీసులు.. లాఠీచార్జి పలువురికి గాయాలు సమాచారంలో విఫలమైన అధికారులు పోలీస్ అవతారమెత్తిన డిఆర్డిఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ దేశభక్తితో కొందరు.. పొట్ట పోషించుకునేందుకు మరికొందరు.. యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆర్మీలో చేరి ఉపాధి పొందాలని తాపత్ర యపడ్డారు. వీరిలో చాలా మంది శుక్రవారం పోలీసుల లాఠీచార్జ్లొనూ తరవాత తొక్కిసలాటలోనూ తీవ్రంగా గాయపడ్డారు. విశాఖలో తొలిరోజే ఆర్మీ ర్యాలీ గందరగోళమైంది. విశాఖపట్నం: కొలువు కోసం వెళ్లిన నిరుద్యోగిపై లాఠీ విరిగింది..అధికారుల సమాచారలోపం వారికి నరకాన్ని చూపించింది. నియంత్రణ పేరుతో పోలీసులు చితకబాదడంతో కదల్లేని పరిస్థితి ఎదురైంది. బతుకు జీవుడా అంటూ తీవ్ర గాయాలతో ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. శుక్రవారం ఆర్మీర్యాలీకి వెళ్లిన నిరుద్యోగులకు ఎదురైన చేదు అనుభవమిది. ఆర్మీలో పలు ఉద్యోగాల కోసం ఈ నెల 13వ తేదీ వరకూ రిక్రూట్మెంట్ ర్యాలీ శుక్రవారం నుంచి నగరంలో ప్రారంభమైంది. తొలిరోజు వెలంపేటలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో విశాఖ, అనకాపల్లి డివిజన్ల అభ్యర్ధులకు టోకెన్లు జారీ చేశారు. దీనికి దాదాపు ఏడు వేల మందికి పైగా అభ్యర్ధులు హాజరయ్యారు. దరఖాస్తుల్లో సూచించిన తేదీలకు తర్వాత ప్రకటించిన తేదీలకు ఒక రోజు వ్యత్యాసం ఉండటంతో ఇతర డివిజన్ల నుంచి కూడా అభ్యర్ధులు వచ్చేశారు. నిజానికి ఇంత మంది అభ్యర్ధులు వస్తారనే అంచనా ముందుగానే అధికారులకు ఉన్నప్పటికీ ఆ మేరకు ఏర్పాట్లు చేయలేకపోయారు. తాగునీరు కూడా అభ్యర్ధులకు అందించలేదు. ముందురోజు రాత్రి నుంచే స్టేడియం వద్దకు చేరుకున్న అభ్యర్ధులను విడతల వారీగా టోకెన్లు తీసుకునేందుకు అనుమతించారు. దీని కోసం బారికేడ్లు నిర్మించారు. అక్కడక్కా టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ముందు వచ్చిన వారికి ముందు టోకెన్లు ఇస్తామని అధికారులు చేసిన ప్రకటన అభ్యర్ధులకు చిక్కులు తెచ్చిపెట్టింది. టోకెన్ తీసుకోవాలనే ఆరాటంలో బారికేడ్లుపై నుంచి దూకడం, కింది నుంచి దూరి వెళ్లడం వంటివి చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది. టెంట్లు, బారికేడ్లు కూలిపోయాయి. దీంతో తర్వాత నుంచి ఎండల్లోనే కూర్చున్నారు. పక్కనే పళ్ల మార్కెట్, స్టేడియంను ఆనుకుని డ్రైయిన్ ఉండటంతో ఆ డ్రైయిన్‌లోని ఈగలు అభ్యర్ధులపై దాడిచేశాయి. అవి తేనెటీగలేమోనని బెదిరిపోయిన అభ్యర్ధులు పరుగులు తీయడంతో మరోసారి తొక్కిసలాట జరిగింది. పలుమార్లు లాఠీచార్జ్: టోకెన్ల కోసం ముందుకు దూసుకువస్తున్న అభ్యర్ధులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. డిఆర్డిఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ సైతం పోలీసులు ఉపయోగించే లాఠీ పట్టుకుని యువకులను చావబాదారు. పలుమార్లు జరిగిన లాఠీ చార్జ్‌లో అనేక మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికి తలలు పగిలాయి. కొందరికి కాళ్లు విరిగాయి. ఈ గందరగోళంలో అభ్యర్ధుల పర్సులు, సెల్ఫోన్లు, బ్యాగులు పోయాయి. వెంట తెచ్చుకున్న సర్టిఫికెట్లు చిరిగిపోయాయి. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఎక్కించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలకు అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాధమిక చికిత్స చేశారు. ఖర్చులకు డబ్బుల్లేవ్ రెండో తారీకునే టోకెన్లు ఇచ్చేస్తామని ముందు చెప్పారు. తర్వాత తేదీలు మార్చారంట. ఆ విషయం మాకెలా తెలుస్తుంది.క్లర్క్ పోస్టు పరీక్షకు రెండు రోజుల క్రితమే వైజాగ్ వచ్చేశాం. ఇక్కడ ఉండటానికి ఏమీ లేదు.ఫుట్‌పాత్‌లపై పడుకుంటున్నాం. తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. -ఎ.రాజు, శ్రీకాకుళం నిబంధనలు మార్చేశారు ఈ సారి ఆర్మీ సెలక్షన్లలో పాత నిబంధనలు మార్చేశారు. గతంలో ఒకరు ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఒకదాంట్లో ఫెయిల్ అయితే మరోదానికి ప్రయత్నించేవాళ్లం. ఇప్పుడు ఒకరు ఒక పోస్టుకే పరీక్షకు హాజరవ్వాలని, ఒక టోకెన్ మాత్రమే ఇస్తున్నారు. దీనివల్ల చాలా మందికి ఉద్యోగాలు రావు. -కె.ఆదిత్య, పరవాడ అంతా గందరగోళం టోకెన్ల జారీ, పరీక్షల తేదీల్లో స్పష్టత లేదు. దీంతో తేదీలు ఖచ్చితంగా తెలుసుకోవాలని వచ్చాం. ఇక్కడ సమాచారం చెప్పేవాళ్లు కూడా లేరు. వచ్చిన తోటి అభ్యర్ధులను అడిగి వివరాలు తెలుసుకున్నాం.మళ్లీ వెనక్కు వెళ్లి రాలేం. ఇక్కడే ఎక్కడో కాలం గడపాలి. -జె.సుధీర్, శ్రీకాకుళం ఎప్పుడో వచ్చాం టోకెన్లు ఇస్తామంటే 2వ తేదీన వచ్చాం. కానీ ఇవ్వలేదు. మళ్లీ ఈ రోజు వచ్చాం. ట్రేడ్‌మెన్ ఉద్యోగం కోసం పరీక్షకు హాజరవుతున్నాం. ఉదయం నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం. మాలో చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి. -ఎం.అప్పలరామశ్రీను, విశాఖ -
ఆర్మీ రిక్రూట్మెంట్లో తొక్కిసలాట!
-
నేటితో ముగియనున్న ఆర్మీ ర్యాలీ
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహిస్తున్న తెలంగాణ స్థాయి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ మంగళవారంతో ముగియనుంది. సోమవారంతో అన్ని విభాగాల అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఎంపికైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు 15 వరకు జరగనున్నాయి. ఆర్మీ ర్యాలీలో భాగంగా సోమవారం హవల్దార్ విద్య/మత ఉపాధ్యాయుడు (జూనియర్ కమిషన్ అధికారి) విభాగాలకు అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించారు. ఆయా విభాగాల అభ్యర్థులకు మంగళవారం శారీరక ధారుడ్య పరీక్షలు నిర్వహించనున్నారు. సోల్జర్ ట్రేడ్స్‌మెన్ అభ్యర్థులకు సోమవారం శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించారు.308 మంది అభ్యర్థులు వైద్య పరీక్షలకు ఎంపికయ్యారు. అన్ని విభాగాల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కావడంతో ఆర్మీ ర్యాలీకి పది జిల్లాల నుంచి తరలి వచ్చిన అభ్యర్థులు వెనుదిరుగుతున్నారు. 11వ తేదీన సోల్జర్ ట్రేడ్స్‌మెన్ విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు ట్రేడ్స్‌మెన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించనున్నారు. అన్ని విభాగాల అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి రాత పరీక్షకు ఎంపిక చేయనున్నారు. -
కొత్త గూడెం ఆర్మీ ర్యాలీకి భారీ స్పందన
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం యువసంద్రంగా మారింది. తెలంగాణ స్థాయి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ బుధవారం ప్రారంభమైంది. 9 రోజులపాటు సాగే ఈ ర్యాలీ ని పార్లమెంటరీ సెక్రటరీ సీఎంఓ జలగం వెంకటరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న యువతకు ఇదొక మంచి అవకా శమన్నారు. తొలిరోజు సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ విభాగాల్లో అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. మొదటి రోజున సుమారు 4 వేల మంది కి పైగా యువకులు రాగా. వారిలో ఎత్తు, ఛా తీ, సర్టిఫికెట్ల పరిశీలనలో 3,368 మంది అర్హత సాధించారు. వీరిలో సోల్జర్ టెక్నికల్ విభాగం లో 2,684 మంది, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ విభాగంలో 678 మంది ఉన్నారు. అభ్యర్థుల ఎత్తు కొలిచి వివిధ బ్లాక్‌ల్లోకి పంపించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వారికి గురువారం శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆర్మీ ర్యాలీకి హాజరైన అభ్యర్థులకు జలగం వెం కటరావు ఆధ్వర్యంలో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. -
అనూహ్య స్పందన
విద్యానగర్(గుంటూరు): వారంరోజులుగా గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ఎంపికలు మంగళవారం ముగిశాయి. ఇప్పటివరకు మొత్తం 22 వేల మంది హాజరయ్యారు. చివరిరోజు మంగళవారం గుంటూరు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన అభ్యర్థులు సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ పోస్టుల ఎంపికలకు ప్రక్రియలో పాల్గొన్నారు. సోమవారం సర్టిఫికెట్ల పరిశీలనలో ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం పరుగు, ఫిజికల్ టె స్ట్లు నిర్వహించారు. పరుగుపందెంలో 2,538 మంది అభ్యర్థులు పాల్గొనగా వారిలో 145 మంది నిర్ణీత దూరాన్ని సరైన సమయంలో చేరుకున్నారు. వారికి లాంగ్‌జంప్, పుల్అప్స్ పోటీలు నిర్వహించారు. తర్వాత వీరికి మెడికల్ పరీక్షలు జరుగుతాయి. వారంరోజులుగా జరుగుతున్న ఫిజికల్ టె స్ట్ల్లో ఎంపికైన 806 మంది అభ్యర్థులకు మంగళవారం మెడికల్ టె స్ట్లు నిర్వహించారు. అన్నివిధాలుగా ఆరోగ్యంగా ఉన్న 404 మందిని రాత పరీక్షలకు ఎంపిక చేశారు. చిన్నపాటి ఆరోగ్యరుగ్మతలున్న దాదాపు 68 మందిని చికిత్సల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ మెడికల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మంగళవారం చివరిరోజు నిర్వహించిన ట్రేడ్‌మెన్ పోస్టులకు తుది పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 1,500 మంది అభ్యర్థులు పాల్గొనగా వారిలో 224 మంది మెడికల్ పరీక్షలకు ఎంపికయ్యారు. ట్రేడ్‌మెన్ పోస్టులకు పారిశుధ్య కార్మికులకు ఊడ్చే పరీక్షలు, దోబీలకు దుస్తులు ఉతకటం, ఇస్త్రీ చేయటం, బార్బర్లకు కటింగ్, తదితర పోటీలు నిర్వహించారు. అనతరం విజేతలుగా నిలిచిన వారిని మెడికల్ టెస్టులకు ఎంపిక చేశారు. మెడికల్ టెస్టులకు ఎంపికైన అభ్యర్థులు బుధవారం నగరంలోని శ్యామలానగర్‌లోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయంలో ఉదయం 6గంటలకు ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయానికి రావాలని రిక్రూటింగ్ డెరైక్టర్ కల్నల్ ఆఫ్సర్ అబ్బాస్ జాప్రి తెలిపారు. పోటీలు ముగియడంతో బీఆర్ స్టేడియంలో టెంట్లను తొలగించారు. -
మీరే..దేశ రక్షకులు
విద్యానగర్(గుంటూరు): దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారా.. దేశ రక్షణ దళంలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారా..? అలాంటి వారి కోసం గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన యువకులు ఈ రిక్రూట్మెంట్లో పాల్గొనవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన, దేహధారుఢ్యం, శరీర కొలతలు, పోలీస్ వెరిఫికేషన్, వైద్య, రాత పరీక్ష విధానాల ద్వారా ఎంపిక చేస్తారు. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్‌మెన్, సోల్జర్ క్లర్క్, స్టోర్‌కీపర్, టెక్నికల్ క్యాటగిరీల్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 500 పోస్టుల భర్తీకి ఈ ర్యాలీ జరుగుతున్నట్లు రిక్రూటింగ్ డెరైక్టర్ కల్నల్ అఫ్సర్ జాఫ్రి తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఏఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు అనే వివరాలు ఇలా ఉన్నాయి. పరీక్ష విధానం.. 1.6 కిలోమీటర్ల పరుగుపందెం 6 నిమిషాల 20 సెకన్లలోపు పూర్తి చేయాలి. 9 అడుగుల లాంగ్‌జంప్, పుష్అప్స్ కనీసం 6 తీయాలి. ఒక కడ్డీపై నిలబడి బ్యాలెన్స్‌గా చేతులు చాపి నడవాలి. సోల్జర్ జనరల్ డ్యూటీలో 1.6 కిలోమీటర్ల పరుగు పందేన్ని రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో 5 నిముషాల 20 సెకన్లలోపు, రెండవ గ్రూపు 6 నిముషాలలోపు పూర్తి చేయాలి. ఫిజికల్ టెస్ట్‌లో ఎంపికైనవారు అనంతరం మెడికల్, రాతపరీక్షకు హాజరుకావాలి. రాత పరీక్షలో సమాధానాల్లో ప్రతి తప్పునకు నాలుగవ వంతు మార్కు కట్ చేస్తారు. -
ఉద్యోగాలు
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లా అభ్యర్థుల కోసం అక్టోబర్ 9 నుంచి 20 వరకు ఇండియన్ ఆర్మీ గుంటూరులో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది. సోల్జర్ (టెక్నికల్/ ఏవియేషన్) అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ లేదా మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. సోల్జర్ (నర్సింగ్ అసిస్టెంట్) అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ లేదా బీఎస్సీ (బోటనీ/ జువాలజీ/ బయోసెన్సైస్) ఉండాలి. సోల్జర్ (జనరల్ డ్యూటీ) అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. సోల్జర్ (ట్రేడ్స్‌మెన్) అర్హతలు: ఎనిమిది లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సోల్జర్ క్లర్క్/ స్టోర్ కీపర్ అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. శారీరక ప్రమాణాలు: 162 నుంచి 166 సెం.మీ. ఉండాలి. ఛాతి 77 నుంచి 82 సెం.మీ. ఉండాలి. ఎంపిక: ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా. ర్యాలీ వేదిక: బ్రహ్మానంద రెడ్డి స్టేడియం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్:www.joinindianarmy.nic.in http://www.ap.nic.in/ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్ (ఫైనాన్స్): 1 అర్హతలు: సీఏతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. అకౌంటెంట్: 19 అర్హతలు: మొదటి శ్రేణితో బీకాం లేదా రెండో శ్రేణితో ఎంకాం ఉత్తీర్ణులై ఉండాలి. మూడేళ్ల అనుభవంతో పాటు ట్యాలీ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్: 143 అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 29 వెబ్సైట్: http://nielitchd.in -
సైనికోద్యోగం కోసం సమరం..!
- దేహ దారుఢ్య పరీక్షల్లో చాలామంది అనర్హత - ‘పరుగు’లో 1948 మందికి 501 మందే క్వాలిఫై ప్రసాదంలా భోజనమా..? రిక్రూట్మెంటులో భోజన విక్రయదారులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 20 తీసుకొని ప్రసాదంలా భోజనం పెడితే యువకులకు ఏం సరిపోతుందన్నారు. ముందుగా మాకు చూపినదానికంటే ఇప్పుడు తక్కువగా పెడుతున్నారని, వెంటనే పరిమాణాన్ని పెంచి అర టి పండుతోపాటు పచ్చడి కూడా అందజేయాలన్నారు.. రెండోరోజూ కొనసాగిన ఆర్మీ రిక్రూట్మెంట్ శామీర్‌పేట్ రూరల్: వుండల పరిధిలోని హకీంపేట్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. సోల్జర్ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం శనివారం 1948 వుంది యుువకులకు శారీరక దారుఢ్య పరీక్షలు రన్నింగ్, లాంగ్‌జంప్, హైజంప్, ఛాతి కొలత తదితర పరీక్షలు నిర్వహించారు. అయితే రన్నింగ్‌కు సంబంధించి 1948 మంది విద్యార్థులు అర్హత పరీక్షలో పాల్గొనగా కేవలం 501 మంది మాత్రమే క్వాలిఫై కావడం గమనార్హం. రన్నింగ్‌లో ఒకరు సృహతప్పిపడిపోగా, వురో యువకుడికి ఫిట్స్ వచ్చాయి. వారివురికి అక్కడే ఉన్న వైద్య సిబ్బంది చికిత్స అందించారు. రిక్రూట్‌మెంట్‌ను ఆర్మీ అధికారులు సజ్జన్, రోహిల్లా, రఘు, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, ఎంపీడీఓ శోభారాణి, ఎంఈఓ వరలక్ష్మి, వూదాపూర్ డీసీపీ క్రాంతిరాణ టాటా, బాలానగర్ ఏసీపీ ఎన్.నర్సింహారెడ్డిలతోపాటు 6 వుంది సీఐలు, 27 వుంది ఎస్ఐలు తదితరులు పర్యవేక్షించారు. నేడు సోల్జర్ జనరల్ డ్యూటీ ఎంపిక సోల్జర్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు ఆదివారం ఎంపిక లుంటాయని ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు డైరక్టర్ యోగేశ్వుుదాలియుర్ తెలిపారు.ఖమ్మం,నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, వుహబూబ్‌నగర్ జిల్లాల యుువకులు హాజరుకావాలన్నారు. సోవువారం ఆదిలాబాద్, వరంగల్, మెదక్, హైదారాబాద్, నిజావూబాద్ జిల్లాలు యువకులకుంటుందన్నారు. భారీగా యువకుల రాక అభినందనీయం: జేసీ ఆర్మీలో చేరేందుకు ధైర్యంగా ముందుకువచ్చిన యువకులు, వారిని ఇక్కడకు పంపించిన తల్లిదండ్రులు అభినం దనీ యులని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి అన్నారు. రన్నిం గ్లో అర్హత సాధించని వారు నిరాశకు గురికావద్దని, మరో ఆరు నెలల్లో మళ్లీ రిక్రూట్మెంటులో పాల్గొనవచ్చన్నారు. 3, 4 తేదిలలో సోల్జర్ ఎంపిక జరుగుతుందన్నారు. -
12 నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్
కలెక్టరేట్: వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు స్పెషల్ పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి డివిజనల్, మండల స్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ పారి శుద్ధ్య డ్రైవ్ కింద జిల్లా, డివిజనల్, మం డల గ్రామస్థాయిలోని మురికి కాల్వలను శుభ్రపర్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మురికి కాల్వలకు ఇరువైపులా ఉండే పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు మంచినీటి పైప్లైన్ల లీకేజీలు, ఇతర మరమ్మతు పనులను శ్రమదానం ద్వారా చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న దృ ష్ట్యా బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్చడం, బడి బయట పిల్లలను కేజీ బీవీలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నా రు. విత్తన కొరత రాకుండా చూడాలి జిల్లాలో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత రాకుండా వ్యవసాయాధికారులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించి సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. సోయాబీన్ విత్తనాలు అవసరమయ్యే గ్రామాలకు నేరుగా వెళ్లి పంపిణీ చేయాలని గ్రామస్థాయిలో గ్రామైఖ్య సంఘాల ద్వారా విత్తనాలు, ఎరువుల పంపిణీకి అవపరమైన వారికి లెసైన్స్‌లు మంజూరు చేయాలన్నారు. డిమాండ్ ఉన్న విత్తనాలను సీఎం దృష్టికి తీసుకవెళ్లేంతవరకు వ్యవసాయ అధికారులు, ఆదర్శ రైతులు, ఏడీఏ, ఏఈఓలు గుర్తించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలో మూడు దఫాలుగా కోటి మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. మండలానికి లక్ష చొప్పున మొక్కలు నాటుతున్నామని కాల్వలు, చెరువు గట్లు, రహదార్లకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నామన్నారు. ఇం దిరమ్మ పచ్చతోరణంలోను ఎన్ఆర్ఈజీఎస్లో మెక్కలు నాటనున్నట్లు వివరించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఖాళీ స్థలాల్లో మొదటిదశ లోనే మొక్క లు నాటడానికి ప్రణాళికలు రూపొందిం చాలని అధికారులను ఆదేశించా రు.కార్యక్రమంలో ఏజేసీ మూర్తి, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి , డ్వామా పీడీ రవీందర్, అధికారులు పాల్గొన్నారు. జిల్లా అధికారులు హాజరు కావాలి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులంతా తప్పని సరిగా హాజరు కావాలని ఇన్చార్జి కలెక్టర్ శరత్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి కొందరు గైర్హాజర్ కావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆగస్టులో ఆర్మీ రిక్రూట్మెంట్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని ఆగస్టు మొదటి వారంలో సంగారెడ్డిలో నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ శరత్ తెలిపారు. సోమవారం ఆయన తన చాంబర్లో సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి కన్నల్ యోగెన్ మొదలియార్, రిక్రూట్మెంట్ మెడికల్ ఆఫీసర్ మేజర్ ఎం.ఎన్.రాథోడ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాతో పాటు తెలంగాణలోని మిగతా జిల్లాలకు కూడా సంగారెడ్డిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రతి రోజు రెండు జిల్లాలకు సంబంధించి రిక్రూట్మెంట్ చేపడతామన్నారు. -
వంట వండి.. ఇస్త్రీ చేసి..!
కల్లూరు రూరల్ (కర్నూలు), న్యూస్‌లైన్ : ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా కర్నూలు నగరం ఏపీఎస్పీ క్యాంప్‌లో ట్రేడ్మన్ అభ్యర్థుల ఎంపికకు సోమవారం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల వృత్తి నైపుణ్యాన్ని పరిశీలించారు. వంట మాస్టారు, హౌస్ కీపింగ్, కుకింగ్ హెల్పర్ పనులతో పాటు వడ్రంగి, కమ్మరి, రజక, క్షౌర వృత్తుల నిర్వహణలో వీరికి ప్రవేశం ఉందా.. లేదా..? అని పరీక్షించారు. మొత్తం 428 మంది అభ్యర్థులు హాజరుకాగా జూలై 27వ తేదీ వీరికి రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు కల్నల్ జాఫ్రి తెలిపారు. సోల్జర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్మన్, టెక్నికల్,నర్సింగ్, క్లర్క్, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాల కోసం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించామని, కొందరి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిందని చెప్పారు. అయితే, ఈ నెల 1న సర్టిఫికెట్ల పరిశీలన జరిగిన క్లర్క్, స్టోర్‌కీపర్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరగలేదని, వాటిని మంగళవారం నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు. రోజుకు 240 మంది అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొన్నారని, మంగళవారంతో ముగుస్తుందని జాఫ్రి పేర్కొన్నారు. -
వంట వండి.. ఇస్త్రీ చేసి..!
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా సోమవారం కర్నూలు నగరం ఏపీఎస్పీ క్యాంప్‌లో ట్రేడ్‌మెన్ అభ్యర్థుల ఎంపికకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థుల వృత్తి నిపుణతను పరిశీలించారు. వంట మాస్టారు, హౌస్ కీపింగ్, కుకింగ్ హెల్పర్ పనులతో పాటు వడ్రంగి, కమ్మరి, రజక, క్షౌర వృత్తుల నిర్వహణలో వీరికి ప్రవేశం ఉందా లేదా అనేది పరీక్షించారు. మొత్తం 428 మంది అభ్యర్థులు హాజరవగా వీరికి జులై 27వ తేదీన రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కల్నల్ జాఫ్రి తెలియజేశారు. సోల్జర్ జనరల్ డ్యూటీ, ట్రేడ్‌మెన్, టెక్నికల్,నర్సింగ్, క్లర్క్, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాల కోసం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించామని, కొందరి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని చెప్పారు. అయితే ఈనెల 1న సర్టిఫికెట్ల పరిశీలన జరిగిన క్లర్క్, స్టోర్‌కీపర్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరగలేదని, మంగళవారం నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రోజుకు 240 మంది అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొన్నారని, మంగళవారంతో ఇది ముగుస్తుందన్నారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్లో తొక్కిసలాట...30 మందికి గాయాలు
-
ముగిసిన ఉద్యోగపర్వం
కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొలువుల కోలాహలం శుక్రవారం ముగిసింది. తెలంగాణ పదిజిల్లాలకు కొత్తగూడెంలో నిర్వహించిన ఆర్మీ ర్యాలీకి 27వేల మంది అభ్యర్థులు తరలివచ్చారు. వీరికి వేయి మంది సిబ్బంది సహకరించారు. ర్యాలీ నిర్వహించిన ప్రకాశం స్టేడియం, స్థానిక జూనియర్ కళాశాల పరిసర ప్రాంతాలు వారంరోజులపాటు అభ్యర్థులతో కళకళలాడాయి. గురువారం పరుగు పరీక్షలను పూర్తి చేసి..దానిలో అర్హత సాధించిన అభ్యర్థులు 200మందికి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. సోల్జర్ ట్రేడ్స్‌మన్ విభాగం పరుగు పందెంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను స్వీపర్స్, స్కావెంజర్స్, వెయిటర్స్, బార్బర్స్ తదితర విభాగాలకు కేటాయించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. సిబ్బంది సహకారం.. తెలంగాణలోని పది జిల్లాలకు ఏర్పాటు చేసిన ఆర్మీ ర్యాలీలో అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు చెందిన 900 మంది సిబ్బందికి అధికారులు విధులు కేటాయించారు. పోలీస్‌శాఖ నుంచి 600 మంది, రెవెన్యూ నుంచి 100 మంది, మున్సిపల్, సింగరేణి శానిటేషన్ విభాగాల నుంచి 200 మంది సిబ్బంది ఆర్మీ ర్యాలీలో విధులు నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభ్యర్థుల అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అధికారుల అప్రమత్తతతో సాధారణ ధరలకే సేవలందించారు. భోజనం, అల్పాహారం, జిరాక్స్, ఫొటో ప్రింటింగ్ తదితర సేవల కోసం ప్రత్యేక స్టాల్స్ వెలిశాయి. బస్టాండ్ సెంటర్ నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు ప్రత్యేకంగా భోజన కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎనిమిది రోజులపాటు సుమారు రూ.10 లక్షల మేరకు భోజన వ్యాపారం సాగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ‘గూడెం’ వాసుల ఔదార్యం.. అభ్యర్థులకు వివిధ సేవా సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు ఉచిత భోజన సౌకర్యం కల్పించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆర్మీ ఏర్పాట్లను సింగరేణి సంస్థ నిర్వహించగా, పోలీస్‌శాఖ నుంచి విధులకు హాజరైన పోలీసులకు నవభారత్ సంస్థ భోజన వసతి కల్పించింది. పట్టణ మెడికల్ అసోసియేషన్ వారు అభ్యర్థులకు గ్లూకోజ్ అందించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అభ్యర్థులకు ప్రతిరోజు మజ్జిగ అందించారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ కొత్తగూడెం, ఆర్యవైశ్య యువజన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రెండు రోజులపాటు హాజరైన అభ్యర్థులకు ఉచిత భోజనం అందించారు. రక్ష స్వచ్ఛంద సంస్థతోపాటు మరికొంత మంది స్వచ్ఛందంగా అభ్యర్థులకు భోజన వసతి కల్పించారు. -
యువసంద్రం..
సాక్షి, కొత్తగూడెం: ఆర్మీ రిక్రూట్మెంట్కు తరలివచ్చిన యువతతో మంగళవారం ప్రకాశం స్టేడియం కిక్కిరిసింది. సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులకు ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా యువత తరలి వచ్చారు. ఇప్పటివరకు జరిగిన నాలుగురోజుల ఎంపికల్లో అత్యధికం గా మంగళవారం 5,804 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ అభ్యర్థులతో మంగళవారం తెల్లవారుజాము నుంచే ప్రకాశం స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున రెండు గంటల నుంచే అభ్యర్థులు టోకెన్ల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్యూలో నిల్చునేందుకు బారికేడ్ల లో బస చేశారు. పోస్టాఫీస్ సెంటర్, బస్టాండ్, కోర్టు ఏరియా, కొత్తగూడెం క్లబ్ ప్రాంతాలన్నీ యువత బసకేంద్రాలుగా మారాయి. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఆర్మీ ర్యాలీకి హాజరుకావడం గమనార్హం. అనూహ ్య రీతిలో అభ్యర్థులు తరలిరావడంతో తెల్లవారుజామున మూడు గంటల నుంచే టోకెన్లు ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఉదయం 8.30 గంటల వరకు కొనసాగినప్పటికీ ఇంకా చాలామంది అభ్యర్థులకు టోకెన్లు అందకపోవడంతో నిరాశకు గురై వెనుతిరిగారు. భారీగా అభ్యర్థులు హాజరుకావడంతో ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగి సాయంత్రం ముగిసింది. ఉదయం 10 గంటల తర్వాత నిర్వహించిన పరుగుపందెంలో చాలామంది అభ్యర్థులు నీరసించి అర్హత సాధించలేకపోయారు. 5,804 మంది హాజరుకాగా వీరిలో 2,053 మంది ఎత్తుకొలతలో తిరస్కరణకు గురయ్యారు. కాగా 3,751 మంది పరుగుపందేనికి ఎంపికైతే ఇందులో 930 మంది అర్హత సాధించారు. ఎండతీవ్రత, నాలుగు రౌండ్లు పరుగుపందెంతో అభ్యర్థులు నీరసించిపోయారు. దీంతో పరుగుపందెంలోనే 2,821 మంది అనర్హులయ్యారు. ఏర్పాట్లను పరిశీలించిన బ్రిగేడియర్ సజ్జన్.. సోల్జర్ జనరల్ డ్యూటీ ఎంపిక తీరును ఆర్మీ బ్రిగేడియర్ సజ్జన్ స్వయంగా పరిశీలించారు. ప్రకాశం మైదానంలో ఎత్తు, బరువు, పుల్అప్స్, ఎంపికైన అభ్యర్థుల వివరాలను కంప్యూటర్లో చేర్చే శిబిరాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. స్పృహతప్పి పడిపోతున్న అభ్యర్థులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తగూడెంలో ర్యాలీ విజయవంతం కావడంలో సింగరేణి, జిల్లా అధికారుల కృషి ప్రశంసనీయమని అభినందించారు. అలాగే స్థానిక సూర్యోదయ పాఠశాల విద్యార్థులు ఆర్మీ ర్యాలీని తిలకించేందుకు రాగా వారితో బ్రిగేడియర్ సజ్జన్ మాట్లాడుతూ ఆర్మీ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకునేందుకు వచ్చిన విద్యార్థులను అభినందించారు. బుధవారం సోల్జర్ జనరల్‌డ్యూటీ పోస్టులకు నిజామాబాద్, కరీంనగ ర్, మహబూబ్‌నగర్ జిల్లాల అభ్యర్థులకు ఎంపికలు జరగనున్నాయి. ఈ ర్యాలీని ఆర్మీ రిక్రూట్మెంట్ సెల్ డెరైక్టర్ యోగేష్ ముదిలియార్, కొత్తగూడెం డీఎస్పీ రంగరాజు భాస్కర్, సింగరే ణి జీఎం (పర్సనల్) కె.బాబు సత్యసాగర్, వన్‌టౌన్ సీఐ ఎ.నరేష్ కుమార్‌లు పర్యవేక్షించారు. -
కదిలిన యువసేన
కొత్తగూడెం, న్యూస్‌లైన్: తెలంగాణ జిల్లాలకు ఏర్పాటు చేసిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ శుక్రవారం ప్రారంభమైంది. ర్యాలీ ప్రారంభ సూచికగా ఆర్మీ, పోలీస్, సింగరేణి ఎస్అండ్పీసీ సిబ్బంది పట్టణంలో కవాతు నిర్వహించారు. ర్యాలీ కో-ఆర్డినేటర్, కొత్తగూడెం ఆర్డీఓ దుగ్యాల అమయ్‌కుమార్, ఆర్మీ రిక్రూట్మెంట్ సెల్ డెరైక్టర్ యోగేష్ ముదిలియార్, కొత్తగూడెం డీఎస్పీ రంగరాజుభాస్కర్, సింగరేణి జీఎం (పర్సనల్) కె.బాబుసత్యసాగర్ ఆర్మీ ర్యాలీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక డీఎస్పీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ కవాతు పోస్టాపీస్ సెంటర్, బస్టాండ్ సెంటర్, సింగరేణి ఎస్అండ్పీసీ కార్యాలయం మీదుగా సాగింది. ఆర్మీ ర్యాలీలో పాల్గొనే పోలీస్ సిబ్బందికి కొత్తగూడెం డీఎస్పీ రంగరాజు విధులను కేటాయించారు. ఆర్మీ ర్యాలీకి వచ్చే అభ్యర్థులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా వన్‌టౌన్ సీఐ ఎ.నరేష్కుమార్ ఆధ్వర్యంలో ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. మైక్ ద్వారా ఆర్మీ ర్యాలీకి వచ్చిన అభ్యర్థులకు సలహాలు సూచనలు అందించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన, అభ్యర్థులకు సూచనలు ఇచ్చేందుకు 100 మంది ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బందికి ఆర్డీవో డి.అమయ్‌కుమార్ విధులను కేటాయించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో వీరికి ఆర్మీ ర్యాలీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అభ్యర్థుల కోలాహలం... అతి చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగంలో చేరేందుకు, దేశ రక్షణలో పాలుపంచుకునేందుకు ఆర్మీ చక్కని అవకాశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారీ సంఖ్యలో అభ్యర్థులు తర లివస్తున్నారు. తొలిరోజు ఎంపికల కోసం సుమారు ఆరువేల మంది వస్తారని అంచనా. శుక్రవారం సాయంత్రానికే పట్టణానికి నాలుగువేలమంది దాకా అభ్యర్థులు వచ్చారు. ర్యాలీకి అవసరమైన జిరాక్స్ ప్రతులను ఏర్పాటు చేసుకోవడం, పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను తీయించుకోవడంలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. అభ్యర్థులు భారీ సంఖ్యలో పట్టణానికి చేరుకోవడంతో టిఫిన్ సెంటర్లు, భోజన హోటల్స్లు అభ్యర్థులతో కళకళలాడాయి. నియామక పరీక్షల్లో భాగంగా తొలిరోజు సోల్జర్ టెక్నికల్ పోస్టుల భర్తీకి శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పరుగుపోటీ నిర్వహిస్తారు. ఉద్యోగంపై ఆశలు..రోడ్లపై పడిగాపులు... ఆర్మీ ర్యాలీని 17న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా 18వ తేదీ తెల్లవారుజామునుంచే నియామక పరీక్షలను ఏర్పాటు చేశారు. అయితే సమాచార లోపంతో ఎక్కువ మంది అభ్యర్థులు ఒకరోజు ముందుగానే పట్టణానికి చేరుకుని ఇబ్బందులు పడ్డారు. తలదాచుకునేందుకు సరైన సౌకర్యాలు లేక అభ్యర్థులు రోడ్లపైనే పడిగాపులు కాశారు. కొంతమంది మూసి ఉన్న దుకాణాలను అడ్డాగా చేసుకొని సేద తీరారు. మరికొందరు ఉన్న జాగాలోనే వ్యాయామం చేసుకుంటూ ఆర్మీ ర్యాలీకి సిద్ధమయ్యారు. ఎక్కువ మంది అభ్యర్థులు రావడంతో పోలీసులు వన్‌టౌన్ సీఐ నరేష్కుమార్ ఆధ్వర్యంలో వీరిని స్థానికంగా ఉన్న కల్యాణ మండపాలకు తరలించారు. అధిక ధరలపై ప్రత్యేక నిఘా ఆర్మీర్యాలీ కోసం భారీస్థాయిలో అభ్యర్థులు తరలిరావడంతో స్థానికంగా ఉన్న జిరాక్స్, హోటల్స్, ఫొటో స్టూడియోల నిర్వాహకులు కొందరు ధరలు అమాంతం పెంచారు. అభ్యర్థుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని ముందుగానే పసిగట్టిన కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్ జిరాక్స్, ఫొటోస్టూడియోలు, హోటల్స్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో తీసుకునే చార్జీలు మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అధిక ధరలను తీసుకునే అవకాశం ఉండటంతో ఈ విషయంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆర్డీవో అమయ్‌కుమార్ తెలిపారు. ఎవరైనా అధిక ధరలు తీసుకున్నట్లు తమ దృష్టి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆర్మీ ర్యాలీకి అంతా రెడీ
కొత్తగూడెం, న్యూస్‌లైన్: తెలంగాణ జిల్లాల ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం స్థానిక ప్రకాశం స్టేడియం, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాలను సిద్ధం చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన మెడికల్ కిట్లను సీఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేశారు. ర్యాలీకి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ ర్యాలీలో 100 మంది ఆర్మీ సిబ్బంది, 20 మంది ఆర్మీ అధికారులు, 600 మంది పోలీసులు, సింగరేణి, మున్సిపల్ శానిటరీ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఈ ఏర్పాట్లను కొత్తగూడెం ఆర్డీవో, ర్యాలీ కో-ఆర్డినేటర్ డి.అమయ్‌కుమార్, ఆర్మీ రిక్రూట్మెంట్ సెల్ డెరైక్టర్ యోగేష్ ముదిలియార్, కొత్తగూడెం డీఎస్పీ రంగరాజు భాస్కర్ పర్యవేక్షిస్తున్నారు. మొదట ఎంపీసీ అభ్యర్థులకు ఎంపికలు.. మొత్తం ఐదు అంశాలలో నిర్వహిస్తున్న ఈ రిక్రూట్మెంట్ తొలిరోజు శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే ఉంటుంది. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదటి దఫా ఎంపికలు ప్రారంభించనున్నారు. సోల్జర్ టెక్నికల్ విభాగంలో ఎంపీసీ చేసిన వారు ఈ ఎంపికలకు అర్హులు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వేస్టేషన్, బస్టాండ్ సెంటర్లలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. రిక్రూట్మెంట్ చేసే అధికారులకు తెలుగు రానందున అనువాదం చేసేందుకు ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచనున్నారు. తరలివస్తున్న అభ్యర్థులు.. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు కొత్తగూడెం తరలివస్తున్నారు. వారు ముందుగా ప్రకాశం స్టేడియం వద్దకు చేరుకుని నోటిఫికేషన్, పరీక్షల తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల గిరిజన అభ్యర్థుల కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకం గా కొత్తగూడెం క్లబ్లో ఏర్పాట్లు చేశారు. శనివా రం జరిగే మొదటి దఫా ర్యాలీకి సుమారు 5 వేల మంది హాజరవుతారని అంచనా. ఎంపిక జరిగే తీరు ఇలా.. ఈ ర్యాలీలో వివిధ పరీక్షల నిర్వహణకు ప్రకాశం స్టేడియం, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, సీఈఆర్ క్లబ్‌లలో ఏర్పాట్లు చేశారు. తొలుత అభ్యర్థులు ప్రభుత్వ జూనియ ర్ కళాశాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థి ఎత్తు పరిశీలించిన తర్వాత సెక్యూరిటీ బ్యాండ్, టోకెన్ ఇస్తారు. ఇక్కడి నుంచి 300 మందిని ఒక బ్యాచ్‌గా ఏర్పాటు చేసి ప్రకాశం స్టేడియానికి తరలిస్తారు. అక్కడ దేహ దారుఢ్య పరీక్షలతోపాటు రన్నింగ్, లాంగ్‌జంప్, బార్ బ్యాలన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఇదే స్టేడియంలో ఏర్పా టు చేసిన టెంట్ వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత సాధారణ వైద్య పరీక్షలు పూర్తి చేసి, పూర్తిస్థాయి వైద్య పరీక్షలు సీఈఆర్ క్లబ్లో నిర్వహిస్తారు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే రన్నింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. -
వచ్చే నెల 17 నుంచి 25 వరకూ ఆర్మీ రిక్రూట్మెంట్
-
17 నుంచి కర్నూలులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
కల్లూరు రూరల్(కర్నూలు), న్యూస్‌లైన్: ఏడు జిల్లాలకు సంబంధించి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని అక్టోబర్ 17 నుంచి 25 వరకు కర్నూలులో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల(ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్) ఆర్మీ రిక్రూట్మెంట్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఎస్.బి.సజ్జన్ సోమవారం కర్నూలు ఔట్‌డోర్ స్టేడియాన్ని పరిశీలించారు. అంతకు ముందే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీపై అభ్యర్థులకు అవగాహన సదస్సు ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా రిక్రూట్మెంట్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు (ఏడు) జిల్లాల ఆర్మీ రిక్రూట్మెంట్ డెరైక్టర్ జాఫ్రితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆర్మీకి సంబంధించిన వివిధ ట్రేడ్ల ఎంపిక ప్రక్రియ ఇక్కడి ఔట్‌డోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థి అర్హతలు, సామర్థ్యం బట్టి ఎంపిక ఉంటుందని, డబ్బులిచ్చి ఉద్యోగాలిప్పిస్తామంటూ దళారులు చెప్పే మాటలు నమ్మవద్దని సూచించారు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సెట్కూరు సీఈఓ పి.వి.రమణ సమన్వయకర్తగా వ్యవహరిస్తారన్నా రు. ఉద్యోగార్హతలు, ఎంపిక విధానం, ఇతర వివరాలకు ఠీఠీఠీ.జీఛి.జీ వెబ్సైట్లో చూడవచ్చన్నారు.