పలు జిల్లాల నుంచి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌కు హాజరైన అభ్యర్థులు
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా నరసరావుపేటలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతీ అభ్యర్థి ఉద్యోగ అర్హత సాధించాలని ఆకాంక్షించారు.
జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియ కోసం జిల్లా అధికార యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం రాత్రికే పలు జిల్లాల నుంచి నిరుద్యోగ యువత పెద్దఎత్తున స్టేడియానికి చేరుకున్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, కల్నల్ పునీత్, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం కె.వినాయకం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment