
సాక్షి, పల్నాడు: నీటి పంపకాల విషయంలో రాజీపడేది లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎల్లోమీడియా ఇష్టానుసారంగా కథనాలు ప్రచురిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు రైతులపాలిట ద్రోహిగా నిలిచిపోయారు. కృష్ణా జలాల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. పచ్చ పత్రికలు రాతలు రోతలుగా రాస్తున్నాయి. కొన్ని పత్రికలు మాత్రం విషం చిమ్ముతున్నాయి. మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. ఇలాంటి తప్పుడు కథనాలు వద్దు. మన నీటిని సద్వినియోగం చేసుకోలేకపోవడానికి చంద్రబాబే కారణం. ఏపీకి రావాల్సిన నీటి వాటా గురించి సీఎం జగన్ పోరాడారు. తెలంగాణ ఎక్కువ నీళ్లు వాడుకుంటోంది. నీటి పంపకాల విషయంలో రాజీపడేది లేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కృష్ణా జలాలపై తప్ప మిగిలిన విషయాలు మాట్లాడారు. నీకు బ్యానర్ కట్టిన వ్యక్తిని కూడా నువ్వు పార్టీలో నిలుపుకోలేకపోయావు. ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న వారు కూడా తర్వాత ఉండరు. చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారు అని ఘాటు విమర్శలు’ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment