
సైనికోద్యోగం కోసం సమరం..!
రిక్రూట్‌మెంటులో భోజన విక్రయదారులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- దేహ దారుఢ్య పరీక్షల్లో చాలామంది అనర్హత
- ‘పరుగు’లో 1948 మందికి 501 మందే క్వాలిఫై
ప్రసాదంలా భోజనమా..?
రిక్రూట్‌మెంటులో భోజన విక్రయదారులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 20 తీసుకొని ప్రసాదంలా భోజనం పెడితే యువకులకు ఏం సరిపోతుందన్నారు. ముందుగా మాకు చూపినదానికంటే ఇప్పుడు తక్కువగా పెడుతున్నారని, వెంటనే పరిమాణాన్ని పెంచి అర టి పండుతోపాటు పచ్చడి కూడా అందజేయాలన్నారు..
రెండోరోజూ కొనసాగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్
శామీర్‌పేట్ రూరల్: వుండల పరిధిలోని హకీంపేట్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. సోల్జర్ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం శనివారం 1948 వుంది యుువకులకు శారీరక దారుఢ్య పరీక్షలు రన్నింగ్, లాంగ్‌జంప్, హైజంప్, ఛాతి కొలత తదితర పరీక్షలు నిర్వహించారు. అయితే రన్నింగ్‌కు సంబంధించి 1948 మంది విద్యార్థులు అర్హత పరీక్షలో పాల్గొనగా కేవలం 501 మంది మాత్రమే క్వాలిఫై కావడం గమనార్హం. రన్నింగ్‌లో ఒకరు సృహతప్పిపడిపోగా, వురో యువకుడికి ఫిట్స్ వచ్చాయి. వారివురికి అక్కడే ఉన్న వైద్య సిబ్బంది చికిత్స అందించారు. రిక్రూట్‌మెంట్‌ను ఆర్మీ అధికారులు సజ్జన్, రోహిల్లా, రఘు, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి, ఎంపీడీఓ శోభారాణి, ఎంఈఓ వరలక్ష్మి, వూదాపూర్ డీసీపీ క్రాంతిరాణ టాటా, బాలానగర్ ఏసీపీ ఎన్.నర్సింహారెడ్డిలతోపాటు 6 వుంది సీఐలు, 27 వుంది ఎస్‌ఐలు తదితరులు పర్యవేక్షించారు.
నేడు సోల్జర్ జనరల్ డ్యూటీ ఎంపిక
సోల్జర్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు ఆదివారం ఎంపిక లుంటాయని ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు డైరక్టర్ యోగేశ్‌వుుదాలియుర్ తెలిపారు.ఖమ్మం,నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, వుహబూబ్‌నగర్ జిల్లాల యుువకులు హాజరుకావాలన్నారు. సోవువారం ఆదిలాబాద్, వరంగల్, మెదక్, హైదారాబాద్, నిజావూబాద్ జిల్లాలు యువకులకుంటుందన్నారు.
భారీగా యువకుల రాక అభినందనీయం: జేసీ
ఆర్మీలో చేరేందుకు ధైర్యంగా ముందుకువచ్చిన యువకులు, వారిని ఇక్కడకు పంపించిన తల్లిదండ్రులు అభినం దనీ యులని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి అన్నారు. రన్నిం గ్‌లో అర్హత సాధించని వారు నిరాశకు గురికావద్దని, మరో ఆరు నెలల్లో మళ్లీ రిక్రూట్‌మెంటులో పాల్గొనవచ్చన్నారు. 3, 4 తేదిలలో సోల్జర్ ఎంపిక జరుగుతుందన్నారు.