సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లరకు సంబంధించి ఇప్పటివరకు 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉండి పారిపోయిన మరికొందరి కోసం టాస్క్‌ఫోర్స్, నార్త్‌జోన్, రైల్వే, పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో 200 మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
కుట్రకోణంలో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. అరెస్టయిన నిందితులను మరికాసేపట్లో రిమాండ్‌కు తరలించనున్నారు. ఈ మేరకు నిందితులను రైల్వే కోర్టులో పోలీసులు హాజరు పరచనున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా యువత తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ నిర్వహించిన ఆందోళనలు విధ్వంసాన్ని సృష్టించాయి. నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భీతావహంగా మారింది. ఈ హింసాత్మక నిరసనల్లో రూ. ఏడు కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్రం దిద్దుబాటు చర్య
Comments
Please login to add a commentAdd a comment