
కంటోన్మెంట్: సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 31వ తేదీ వరకు సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్మీ పీఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు.
అగ్నివీర్ స్కీమ్‌లో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్, టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ అగ్నివీర్ టెన్త్ పాస్, అగ్నివీర్ ఎయిత్ పాస్ కేటగిరీల్లో నియామకాలుంటాయని వెల్లడించారు.
అగ్నివీర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం నిర్దేశిత ఫార్మాట్‌లో ఉన్న విధంగానే డాక్యుమెంట్‌లు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈనెల 15న సూర్యాపేట శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగే రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. (క్లిక్ చేయండి: ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావుపై వేటు)
Comments
Please login to add a commentAdd a comment