ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి | Stampede At Congo Stadium During Army Recruitment Drive | Sakshi
Sakshi News home page

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి

Published Wed, Nov 22 2023 8:56 AM | Last Updated on Wed, Nov 22 2023 9:18 AM

Stampede At Congo Stadium During Army Recruitment Drive - Sakshi

బ్రజ్జావిల్లే: కాంగో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో అపశ్రుతి చొటుచేసుకుంది. ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.  

కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలోని ఓర్నానో స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను అధికారులు నిర్వహించారు. నవంబర్ 14 నుంచి ర్యాలీ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం వేలాది మంది యువత ర్యాలీకి హాజరయ్యారు. యువత గుంపులుగా రావడంతో పరిస్థితిని సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో ఒకరిపై మరొకరు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది.

ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement