
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్‌లో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. తొలిరోజు పూర్వ ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగం ర్యాలీకి సుమారు 5 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో సుమారు వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ఎత్తు సరిగా లేకపోవటంతో తిప్పి పంపించారు. దీంతో 4,075 మంది అభ్యర్థులు రన్‌కు అర్హత సాధించారు. రన్‌లో కేవలం 419 మంది మాత్రమే అర్హత సాధించారు.
రన్నింగ్, శారీరక సామర్థ్య పరీక్షలతోపాటు ఫిజికల్ పరీక్షలను సీసీ కెమెరాలలో బంధించారు. బుధవారం కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగంలో ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి 5,961 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకొన్నారు. కాగా, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నియామకాలు పకడ్బందీగా జరిగాయి. చైన్నె ఆర్మీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ వి.ఎస్.సాంఖ్సాన్ కనుసన్నల్లో నియామక ప్రక్రియ సాగింది ఆయనతోపాటు ఆర్మీ రిక్రూట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ పవన్ పూరి, కరీంనగర్ పోలీస్ కమీషనర్ వీబీ కమలాసన్‌రెడ్డి హెలిప్యాడ్ ప్రాంగణంలో ఉండి పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment