
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు చాల రసవత్తరంగా సాగుతున్నాయి. శాసనసభకు తొలిసారి పోటీచేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ సీఎం పై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఆర్మీలో రిక్రూట్‌మెంట్ ప్రవేశపెట్టి ఖాళీ స్థానాలను భర్తీ చేసి ఉద్యోగావకాశాలను కల్పిస్తానని ఆగ్రా ప్రచార ర్యాలీలో అన్నారు.
అంతేకాదు గతనెల 30న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషలో మీడియాలో... "సమాజ్‌వాద్ పార్టీ(తుపాకీ పార్టీ) నాయకులు కైరానా, ముజఫర్‌నగర్‌లలో తమ వేడి తగ్గలేదంటూ బెదిరిస్తున్నారు. మార్చి పది తర్వాత ఆ వేడి తగ్గిపోతుందిలే అంటూ వ్యగ్యంగా ట్వీట్ చేశారు." దీంతో అఖీలేశ్ యాదవ్ ఆయన వ్యాఖ్యల పై గత వారంరోజులుగా నిప్పులు చెరుగుతున్నారు. అయినా సీఎం తమ పార్టీ వేడిని తగ్గించినా తాము అధికారంలోకి వస్తే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లోని ఖాళీ స్థానాలను తొలగిస్తామంటూ గట్టి కౌంటరిచ్చారు.
ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌సీఎం యోగికి హింసతోనే సాన్నిహిత్యం ఉంది తప్ప శాంతితో కాదు అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఈసారి గోరఖ్‌పూర్ ఓటర్లు అతన్ని ఉత్తరాఖండ్‌కు తిరిగి పంపుతారని అన్నారు. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షమైన లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరి మాట్లాడుతూ.."యోగి ఆదిత్యనాథ్ అసౌకర్య ప్రశ్నలను నివారించడానికి అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగిస్తాడు. అయినా యోగి నిరుద్యోగ యువత వేడిని ఎలా తగ్గిస్తారో పేర్కొనాలి" అని అన్నారు.
(చదవండి: యోగితో యూపీలో అభివృద్ధి!)
Comments
Please login to add a commentAdd a comment