
మాట్లాడుతున్న కల్నల్ పవన్ పూరి, జేసీ దయానంద్
హన్మకొండ అర్బన్ : మే 20 నుంచి 31వరకు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ పవన్ పూరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జేసీ దయానంద్‌తో కలిసి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం ర్యాలీ ఏర్పాట్లు సమీక్షించారు. ఆర్మీలో ఖాళీగా ఉన్న వెయ్యి పోస్టుల భర్తీ కోసం తెలంగాణలోని 31 జిల్లాల యువతకు ఆరు కేటగిరీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. 11రోజులపాటు జరిగే ర్యాలీలో పాల్గొనే అర్హతలు ఉన్నవారు ఈ నెల 6 నుంచి మే 5 వరకు www. joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణత కనీస విద్యార్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి మే 10 లోగా బార్‌కోడ్, నియమ నిబధనలు తెలియ చేయడం జరగుతుందని వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ రాము, డీఆర్‌ఓ డేవిడ్, ఉపాది అధికారి మల్లయ్య, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి శివలింగయ్య, ఆర్‌డబ్ల్యూస్ ఎస్‌ఈ రాంచందర్, ఆర్డీఓ వెంకారెడ్డి సమాచార శాఖ డీడీ జగన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment