relesed
-
లొంగని రాక్షసుడు
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్ లీడ్ రోల్స్‌లో నటించారు. కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ‘అడంగాద అసురన్ (లొంగని రాక్షసుడు) పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.ఈ పాటకు లిరిక్స్ రాయడంతో పాటు ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో కలిసి పాడారు ధనుష్. ‘‘అడంగాద అసురన్’ పాటను ఏఆర్ రెహమాన్‌గారు రెడీ చేసినప్పట్నుంచి, మీతో (ప్రేక్షకులు) ఈ పాటను షేర్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ పాటను ఇప్పుడు రిలీజ్ చేశాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. -
రత్నం రెడీ
వేసవిలో థియేటర్స్‌కు వస్తున్నాడు ‘రత్నం’. విశాల్ హీరోగా నటించిన తాజా యాక్షన్ ఫిల్మ్ ‘రత్నం’. ఈ చిత్రంలో ప్రియాభవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. హరి దర్శకత్వంలో కార్తికేయన్ సంతానం ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరగుతున్నాయి. కాగా ఈ సినిమాను వేసవిలో ఏప్రిల్ 26న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘తుప్పరివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’)కి సీక్వెల్‌గా ‘తుప్పరివాలన్ 2’ చేస్తున్నారు విశాల్. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారట విశాల్. ఈ ఏడాదే చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం. -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
దేవరకొండ : సీఎం సహాయనిధి కింద మంజూ రైన చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే స్థానికంగా బాధితులకు అందించారు. చందంపేట మండలం గాగిళ్లాపురానికి చెందిన లక్ష్మికి రూ. 10వేలు, కంబాలపల్లికి చెందిన సతీష్‌కు రూ. 22,500 చెక్కులను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండలు, జాన్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, శిరందాసు కృష్ణయ్య, బుయ్య మహేశ్, వడ్త్య దేవేందర్, చీదెళ్ల గోపి, బొడ్డుపల్లి కృష్ణ, వడ్త్య బాలు, బషీర్, సురేష్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు శుభవార్త ఆర్మీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
హన్మకొండ అర్బన్ : మే 20 నుంచి 31వరకు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ పవన్ పూరి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జేసీ దయానంద్‌తో కలిసి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం ర్యాలీ ఏర్పాట్లు సమీక్షించారు. ఆర్మీలో ఖాళీగా ఉన్న వెయ్యి పోస్టుల భర్తీ కోసం తెలంగాణలోని 31 జిల్లాల యువతకు ఆరు కేటగిరీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. 11రోజులపాటు జరిగే ర్యాలీలో పాల్గొనే అర్హతలు ఉన్నవారు ఈ నెల 6 నుంచి మే 5 వరకు www. joinindianarmy.nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణత కనీస విద్యార్హతగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి మే 10 లోగా బార్కోడ్, నియమ నిబధనలు తెలియ చేయడం జరగుతుందని వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రాము, డీఆర్ఓ డేవిడ్, ఉపాది అధికారి మల్లయ్య, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి శివలింగయ్య, ఆర్‌డబ్ల్యూస్ ఎస్ఈ రాంచందర్, ఆర్డీఓ వెంకారెడ్డి సమాచార శాఖ డీడీ జగన్ పాల్గొన్నారు. -
నితిన్ 'లై' టీజర్
-
నితిన్ 'లై' టీజర్ వచ్చేసింది
నితిన్, మేఘా ఆకాశ్‌లు జంటగా నటిస్తున్న చిత్రం 'లై'- లవ్ ఇంటిలిజెన్స్ ఎనిమిటీ అనేది ఉప శీర్షిక. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. అర్జున్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 'కోట్లమంది సైనికులు సరిపోలేదట. పంచ పాండవులూ సాధించలేదట. చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట. అశ్వత్థామ హతః కుంజరః' అంటూ సాగిన టీజర్‌లోని డైలాగ్‌లు సినిమాపై ఇంట్రెస్ట్‌ను కల్పిస్తున్నాయి. సినిమాలో అర్జున్ పాత్రపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. యాక్షన్ సినిమాలకు అర్జున్ పెట్టింది పేరు. అలాంటిది యాక్షన్ లుక్‌లో కనిపిస్తున్న లై సినిమాలో ఆయన ఉండటం ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది. వచ్చే నెల 11వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
ఎట్టకేలకు టీచర్ గ్రాంట్ విడుదల
-12,395 మందికి రూ.61.97 లక్షలు -322 స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్వహణకు రూ.35.42లక్షలు రాయవరం : పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు బోధనాభ్యసన సామగ్రి(టీఎల్ఎం) తయారీ నిమిత్తం సర్వశిక్షాభియాన్ ఎట్టకేలకు టీచర్ గ్రాంట్ విడుదల చేసింది. జిల్లాలో ఉన్న 12,395 మంది టీచర్లకు రూ.61,97,500 విడుదల చేస్తూ ఎస్ఎస్ఏ పీవో ఎం.శేషగిరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్‌కు రూ.500 వంతున 20016–17 విద్యా సంవత్సరంగానికి విడుదల చేశారు. గత రెండేళ్లుగా టీచర్ గ్రాంట్ విడుదల కాకపోగా ఈ విద్యా సంవత్సరం చివర్లో విడుదల చేయడం గమనార్హం. ప్రాథమిక పాఠశాలల్లోని 7,960 మంది ఉపాధ్యాయులకు రూ.39.80 లక్షలు, 2,013 మంది ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు రూ.10,06,500, ఉన్నత పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు బోధించే 2,422 మందికి రూ.12.11 లక్షలను విడుదల చేశారు. జిల్లాలో ఉన్న 322 స్కూల్ కాంప్లెక్స్‌లకు తొలి విడతగా రూ.11 వేల వంతున రూ.35.42లక్షల విడుదలకు చర్యలు తీసుకుంటున్నారు. టీచర్, స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్ల వినియోగానికి మార్గదర్శకాలను కూడా ఉత్తర్వుల్లో పొందపర్చారు. టీచర్ గ్రాంట్ మార్గదర్శకాలు టీచర్ గ్రాంట్‌కు సంబంధించి ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాలి. ప్లాస్టిక్ క్లే కొనవచ్చు. అదే సందర్భంలో ప్రింటెడ్ మెటీరియల్, రెడీమేడ్ వస్తువులు కొనరాదు. వర్కింగ్ మోడల్స్, లైవ్ లెసన్ సీడీ/డీవీలు, టీఎల్ఎం ప్రిపరేషన్ సీడీలు కొనవచ్చు. లెసన్ వీడీయోలు, పీపీటీలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్ వినియోగం ఇలా.. ప్రతి స్కూల్ కాంప్లెక్స్‌కు రూ.22 వేలను విడుదల చేశారు. ఈ నిధుల్లో రూ.10వేలను కంటింజెన్సీ నిమిత్తం. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం టీఏ నిమిత్తం రూ.5 వేలు, టీఎల్ఎం గ్రాంట్ నిమిత్తం రూ.7వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంటింజెంట్ గ్రాంట్‌ను.. ఆర్వోటీల మెయింటెనెన్స్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రిజిస్టర్స్, రికార్డ్స్, స్టేషనరీ, ఉపాధ్యాయుల బోధనకు సంబంధించిన రిఫరెన్స్ పుస్తకాలు, విద్యా సంబంధమైన సీడీల కొనుగోలుకు వినియోగించాలి. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం తన పరిధిలోని పాఠశాలలను సందర్శించాలి. టీఏ బిల్లుగా నెలకు రూ.500 వంతున ఏడాదికి రూ.5 వేలు కేటాయించారు. పాఠశాల మానిటరింగ్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్ఎంలతో సమావేశానికి ఈ నిధులను వినియోగించాలి. మంచి టీఎల్ఎం కొనుగోలు చేయాలి.. బోధనాభ్యసన సామగ్రి కొనుగోలుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను పాఠశాలలకు పంపించాం. టీచర్ గ్రాంట్‌తో పాఠశాలల్లో ఆకర్షణీయమైన బోధనా సామగ్రిని సమకూర్చుకోవాలి. – మేకా శేషగిరి, పీవో, ఎస్ఎస్ఏ సద్వినియోగం చేసుకోవాలి.. ఉపాధ్యాయులకు టీఎల్ఎం గ్రాంట్‌ను పాఠశాల ఖాతాలకు విడుదల చేశాం. ఈ నిధులతో బోధనాభ్యసన సామగ్రిని కొనుగోలు చేసుకుని సమర్ధవంతమైన బోధన చేపట్టాలి. – చామంతి నాగేశ్వరరావు, ఏఎంవో, ఎస్ఎస్ఏ -
గోదావరి జలాలపై శ్రీరాం పుస్తక ఆవిష్కరణ
-
స్టార్టప్‌లకోసం రూ.10వేల కోట్ల ఫండ్
-
'నేతాజీ ఫైళ్లు బహిర్గతం'
-
'నేతాజీ ఫైళ్లు బహిర్గతం'
న్యూఢిల్లీ: ఏళ్ల తరబడి రహస్యంగా, వివాదాస్పదంగా ఉన్న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదానికి సంబంధించిన ఫైళ్లను చెప్పిన మాట ప్రకారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విడుదల చేసింది. కోల్ కతా పోలీసులు మొత్తం 64 పైళ్లను బహిర్గతం చేశారు. కోల్ కతాలోని పోలీసు మ్యూజియంలో సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం వాటిని పోలీసు ఉన్నత కార్యాలయంలో ఉంచారు.దీంతో ఆయన మరణానికి సంబంధించిన పలు అనుమానాలు వీడనున్నాయి. ఈ ఫైళ్లతోపాటు కొన్ని డీవీడీలు కూడా బయటపెట్టిన హోంశాఖ డీవీడీలను నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది. ఈ ఫైళ్లలో మొత్తం 12,744 పేజీలు ఉన్నాయి. '12,744 పేజీలతో మొత్తం 64 ఫైల్స్ ఉన్నాయి. వాటిని బహిర్గతం చేశాం. అన్ని ఫైల్స్ డిజిటలైజ్ చేశాం' అని కోల్ కతా పోలీసు కమిషనర్ సురజిత్ కర్ పర్కాయస్థ అన్నారు. కీళక ఫైళ్లను విడుదల చేస్తున్న సందర్భంగా పలువురు ఆయన కుటుంబ సభ్యులు పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు వచ్చారు. వీరిలో నేతాజీ మేనళ్లుడు కృష్ణ బోస్ భార్య కూడా ఉన్నారు. అయితే, ఈ ఫైళ్లు విడుదలకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు ప్రభుత్వ ప్రతినిధులు ఎవ్వరూ కూడా ఈ కార్యక్రమంలో లేకపోవడం గమనార్హం. 1937 నుంచి 1947 మధ్య జరిగిన అంశాలు ఈ పైళ్లలో ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఫైళ్లు పెద్దగా ప్రాముఖ్యం లేనివని, వీటి ద్వారా అంత కీలకమైన సమాచారం పెద్దగా తెలియకపోవచ్చని పలువురు అంటున్నారు. కీలకమైన దస్త్రాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదీనంలోనే ఉన్నట్లు తెలిసింది. విదేశాలతో జాతీయ అంతర్జాతీయ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున నేతాజీ అదృశ్యానికి సంబంధించిన దస్త్రాలను విడుదల చేయలేమని గత ఆగస్టులో ప్రధాని కార్యాలయం కేంద్ర సమాచార కమిషన్‌కు చెప్పడం కూడా అసలైన ఫైల్స్ కేంద్రం వద్దే ఉన్నాయనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. వచ్చే ఏడాది బెంగాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే మమత ఇప్పుడు ఆ ఫైల్స్‌తో హడావిడికి తెరతీశారని పలువురు భావిస్తున్నారు.