నితిన్‌ 'లై' టీజర్‌ వచ్చేసింది | Lie movie teaser released | Sakshi
Sakshi News home page

నితిన్‌ 'లై' టీజర్‌ వచ్చేసింది

Published Tue, Jul 11 2017 9:26 PM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

నితిన్‌ 'లై' టీజర్‌ వచ్చేసింది

నితిన్‌ 'లై' టీజర్‌ వచ్చేసింది

నితిన్‌, మేఘా ఆకాశ్‌లు జంటగా నటిస్తున్న చిత్రం 'లై'- లవ్‌ ఇంటిలిజెన్స్‌ ఎనిమిటీ అనేది ఉప శీర్షిక. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. అర్జున్‌ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 'కోట్లమంది సైనికులు సరిపోలేదట. పంచ పాండవులూ సాధించలేదట. చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట. అశ్వ‌త్థామ‌ హతః కుంజరః' అంటూ సాగిన టీజర్‌లోని డైలాగ్‌లు సినిమాపై ఇంట్రెస్ట్‌ను కల్పిస్తున్నాయి.

సినిమాలో అర్జున్‌ పాత్రపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. యాక్షన్‌ సినిమాలకు అర్జున్‌ పెట్టింది పేరు. అలాంటిది యాక్షన్‌ లుక్‌లో కనిపిస్తున్న లై సినిమాలో ఆయన ఉండటం ప్లస్‌ పాయింట్‌ అయ్యేలా ఉంది. వచ్చే నెల 11వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement