Commence
-
నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించండి
సంగారెడ్డి అర్బన్: విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ ఐఐటీలో బీవీఆర్ మోహన్‌రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫౌండేషన్ వీక్ సెలబ్రేషన్లో భాగంగా 3 రోజుల వర్క్‌షాప్‌ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ఇలాంటి ఆసక్తికరమైన కార్యక్రమాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందడమే కాక ఇతరులకు ఉద్యోగాలు కల్పించేస్థాయికి ఎదగాలన్నారు. ప్రస్తుత తరం విద్యార్థులు చాలా ప్రతిభావంతులైన, వినూత్నమైన ఆలోచనలు, సాంకేతికతను కలిగి ఉన్నారని, ఇది గొప్ప శుభపరిణామమన్నారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో బీవీఆర్ మోహన్‌రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ కీలకపాత్ర పోషిస్తోందని అభినందించారు. కార్యక్రమంలో సైంట్ డెవలప్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఐఐటీ–హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్ల, భారతదేశంలోని ప్రముఖ సాంకేతిక సంస్థల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బాలాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వేద పండితులు, అర్చకుల సుప్రభాత సేవతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం బాలా త్రిపుర సుందరీ దేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.40గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆదివారం, దసరా సెలవులు కావడంతో తొలి రోజు నుంచే ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం కల్పించారు. స్నానఘాట్లల్లో ప్రత్యేకంగా షవర్లు, తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల దర్శనానికి ఎటువంటి అంతరాయం కలుగకుండా వీవీఐపీల సమాచారం ముందుగా తెలియజేస్తే ప్రొటోకాల్‌కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు చెప్పారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తులతో నగరోత్సవం నిర్వహించి, పంచహారతులను సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండోరోజైన సోమవారం నాడు శ్రీ కనకదుర్గమ్మవారు భక్తులకు శ్రీ గాయత్రీదేవీగా దర్శనమివ్వనున్నారు. దుర్గమ్మ సేవలో గవర్నర్ దంపతులు ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా తొలి రోజైన ఆదివారం బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. దర్శనానికి విచ్చేసిన గవర్నర్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. గవర్నర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, చైర్మన్ కర్నాటి రాంబాబు అందజేశారు. గవర్నర్ వెంట కలెక్టర్ ఢిల్లీరావు తదితరులున్నారు. అలాగే, మంత్రులు ఆర్కే రోజా, విశ్వరూప్ కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు. -
కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం
విజయనగరం ఫోర్ట్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/నంద్యాల టౌన్/కోనేరుసెంటర్/ఏలూరు టౌన్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఐదు మెడికల్ కళాశాలల్లో శుక్రవారం నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లాలోని గాజులరేగ వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులను ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల ప్రారంభించారు. అమె మాట్లాడుతూ..మొదటి ఏడాది విద్యార్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమెస్ట్రీ విభాగాలకు సంబంధించి పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు. ఈ కళాశాలలో అందుబాటులో ఉన్న 150 సీట్లలో ఇప్పటివరకు 116 మంది విద్యార్థులు చేరారని, మరో 34 సీట్లు భర్తీ కావాల్సి ఉందని చెప్పారు. అలాగే, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిర్మించిన వైద్య కళాశాలలో తొలిరోజు తరగతులకు ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మీ హాజరయ్యారు. మొత్తం 150 మంది విద్యార్థులకు ఫేజ్ 1,2 లలో 120 మందికి కౌన్సిలింగ్ పూర్తి చేసి ప్రవేశాలు కల్పించారు. తొలిరోజు తరగతులకు 70 మంది హాజరయ్యారు. నంద్యాలలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల హాజరు నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాదరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత, వైస్ ప్రిన్సిపాల్ ఆనంద కుమార్ల ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. 2023–24 మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులకు సంబంధించి అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ విభాగాల్లో 222 మంది భోదన, భోదనేతర సిబ్బందితో, 150 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోనూ శుక్రవారం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 150 సీట్లకుగానూ ఇప్పటివరకూ 113 మంది విద్యార్థులు చేరారు. కళాశాలకు 11 మంది ప్రొఫెసర్లు, 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు 17 మంది సీనియర్ రెసిడెంట్లు, ఇతర సిబ్బందిని నియమించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి తెలిపారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు పొందిన 112 మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఏపీ వైద్యవిద్య అదనపు డైరెక్టర్ డాక్టర్ కేవీవీ విజయ్‌కుమార్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
ఖమ్మం: సైన్యంలో నియామకాలకు సంబంధించి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 8వ తేదీ వరకు ర్యాలీ జరగనుండగా, రాష్ట్రవ్యాప్తంగా రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హాజరుకానున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పోటీలు ప్రారంభించారు. తొలి రోజు 1,225 మంది అభ్యర్థులకు 926 మంది హాజరయ్యారు. వీరిలో వైద్య పరీక్షలకు 329 మంది అర్హత సాధించారు. పోటీలను కలెక్టర్ వీపీ గౌతమ్, ఆర్మీ అధికారి దాస్, డీవైఎస్వో టి.సునీల్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షించారు. కాగా, అభ్యర్థులకు వసతి సౌ కర్యం కలి్పంచినట్లు చెబుతున్నా.. అవగాహన క ల్పించకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు రహదారుల వెంటే సేదదీరాల్సి వచ్చింది. -
Agniveers-Hyderabad: ఆర్టిల్లెరీ సెంటర్లో మొదలైన అగ్నివీరుల ట్రైనింగ్
-
రాజోలిబండ ఆనకట్ట కోసం పోరుబాట
-
మారుతీ 'ఇగ్నిస్' బుకింగ్ రేటెంతో తెలుసా?
దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకి ఎంతో ప్రతిష్టాత్మకంగా జనవరి13న తీసుకొస్తున్న ఇగ్నిస్ మోడల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ కారు బుకింగ్‌లను ప్రారంభిస్తున్నట్టు మారుతీ తెలిపింది. కంపెనీ నెక్సా వెబ్సైట్లో రూ.11,000కు ఇగ్నిస్‌ను బుక్ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది భారీ ఎత్తున్న లాంచ్ చేయబోయే మోడళ్లలో ఇగ్నిస్ ఒకటి. దేశీయంగా నెక్సా లైన్-అప్‌లో విక్రయిస్తున్న మోడళ్లలో ఇది మూడోది. 2016 ఢిల్లీ ఆటో ఎక్స్పో మొదటిసారి దీన్ని ప్రదర్శించారు. పూర్తిగా కొత్త డిజైన్‌లో ఈ కారును తీసుకురావడం కంపెనీకి అత్యంత కీలకంగా మారింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఇగ్నిస్ 14 వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. గుజరాత్లో ఏర్పాటుచేసిన కొత్త ప్లాంటులో ఈ కారును కంపెనీ తయారుచేసింది. మహింద్రా కేయూవీ100కి పోటీగా ఇగ్నిస్ మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. ఇగ్నిస్ మోడల్ ప్రత్యేకతలు... 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, దాంతో పాటు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో హెడ్‌ల్యాంప్స్ నావిగేషన్‌తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్ప్లే యూఎస్బీ ఏయూఎక్స్ భద్రతా పరమైన ఫీచర్లు: యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ధర