మారుతీ 'ఇగ్నిస్' బుకింగ్ రేటెంతో తెలుసా? | Maruti Suzuki Ignis Bookings Commence For Rs 11,000 | Sakshi
Sakshi News home page

మారుతీ 'ఇగ్నిస్' బుకింగ్ రేటెంతో తెలుసా?

Published Tue, Jan 3 2017 4:29 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

Maruti Suzuki Ignis Bookings Commence For Rs 11,000



దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకి ఎంతో ప్రతిష్టాత్మకంగా జనవరి13న తీసుకొస్తున్న ఇగ్నిస్ మోడల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ కారు బుకింగ్లను ప్రారంభిస్తున్నట్టు మారుతీ తెలిపింది. కంపెనీ నెక్సా వెబ్సైట్లో రూ.11,000కు ఇగ్నిస్ను బుక్ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది భారీ ఎత్తున్న లాంచ్ చేయబోయే మోడళ్లలో ఇగ్నిస్ ఒకటి. దేశీయంగా నెక్సా లైన్-అప్లో విక్రయిస్తున్న మోడళ్లలో ఇది మూడోది. 2016 ఢిల్లీ ఆటో ఎక్స్పో మొదటిసారి దీన్ని ప్రదర్శించారు. పూర్తిగా కొత్త డిజైన్లో ఈ కారును తీసుకురావడం కంపెనీకి అత్యంత కీలకంగా మారింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఇగ్నిస్ 14 వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. గుజరాత్లో ఏర్పాటుచేసిన కొత్త ప్లాంటులో ఈ కారును కంపెనీ తయారుచేసింది. మహింద్రా కేయూవీ100కి పోటీగా ఇగ్నిస్ మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. 
ఇగ్నిస్ మోడల్ ప్రత్యేకతలు...
1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్
1.3 లీటర్ డీజిల్ ఇంజిన్
5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, దాంతో పాటు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్
ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో హెడ్ల్యాంప్స్
నావిగేషన్తో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
ఆపిల్ కార్ప్లే
యూఎస్బీ
ఏయూఎక్స్
భద్రతా పరమైన ఫీచర్లు: యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్
రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ధర
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement