ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని వినియోగించుకోండి
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని వినియోగించుకోండి
Published Wed, Jul 27 2016 10:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
కాకినాడ సిటీ : అక్టోబరు 5 నుంచి 15 వరకూ కాకినాడలో నిర్వహించే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హెచ్‌అరుణ్‌కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సైనిక నియామక ర్యాలీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కాకినాడలో జరుగుతున్న రిక్రూట్‌మెంట్ ర్యాలీకి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 40 వేల మంది హాజరు అయ్యే అవకాశం ఉందని, ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపడుతుందని చెప్పారు. జిల్లాకు చెందిన గిరిజన యువత ఆర్మీకి ఎంపికయ్యేలా ఐటీడీఏ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. యువజన సంక్షేమశాఖ ద్వారా మైదాన యువతకు కూడా శిక్షణనిచ్చే యోచన ఉందన్నారు. అర్హతల ప్రకారం మాత్రమే ఎంపిక జరుగుతుందని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. చెన్నై ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రిక్రూట్‌మెంట్ జోన్ అధికారి బ్రిగేడియర్ ఎస్‌ఎన్ దాల్వి మాట్లాడుతూ ర్యాలీలో ఎంపికైన అభ్యర్థికి రూ.35 వేల వరకూ వేతనం ఉం టుందని చెప్పారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 19 లోపు గిగిగి.్జౌజీn జీnఛీజ్చీn్చటఝy.nజీఛి.జీn వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రిక్రూట్‌మెంట్ వివరాలు, అభ్యర్థుల శారీరక విద్యార్హతలు, ఎం పిక విధానం కూడా వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చన్నారు.
Advertisement