use
-
నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్‌ఫుల్
ప్రకృతిలో ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆసీజన్లో తినడం ఆరోగ్యానికి చాలామంచింది. ప్రస్తుతం అల్లనేరేడు పండ్ల సీజన్ వచ్చేసింది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పండ్లు తియ్యగా, పుల్లగా రుచికరంగా ఉంటాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు , కేన్సర్ , కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారించే ఎన్నో ఔషధగుణాలున్నాయి. అల్లనేరేడు పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.. ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలామంచిదని చెబుతారు.అల్ల నేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి డయాబెటిస్ లక్షణాలను అల్ల నేరేడు పండ్లు తగ్గిస్తాయి. దీన్ని శాస్త్రీయంగా సిజిజియం క్యుమిని అని పిలుస్తారు, ఇది భారత ఉపఖండానికి చెందిన ఫలాలను ఇచ్చే చెట్టు. జంబోలన్ లేదా జామున్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా మే , జూలై నెలల మధ్య వేసవి నెలలలో పండ్లు ఎక్కువగా వస్తాయి. నేనేడు పండు మాత్రమే కాదు, విత్తనాలు, ఆకుల్లో కూడా ఔషధ గుణాలున్నాయి. పండు: పండ్ల రూపంలో తాజాగా లేదా జామ్‌లు, జ్యూస్‌లా ప్రాసెస్ చేసిన రూపాల్లో విస్తృతంగా వినియోగిస్తారు.విత్తనాలు: గింజలు నూనెను తీయడానికి ఉపయోగిస్తారు.ఆకులు, విత్తనాలు ఆయుర్వేద ఔషధాలు, మూలికల తయారీలలో ఉపయోగిస్తారు.నేరేడు పండులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి సహా అనేక పోషకాలున్నాయి. నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.అల్ల నేరేడు ప్రయోజనాలునేరేడు పండ్లు శరీరానికి చలువ చేస్తాయి. నీరసంగా ఉన్నప్పుడు నేరెడు పండ్లను తింటే తక్షణం శక్తి వస్తుంది. డయాబెటిక్ రోగులు రోజూ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచిదినేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువ.నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. నేరెడు పండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నేరేడు పండ్లు చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. అపోహనేరేడు పండ్లు గర్భిణీ స్త్రీలు తినకూడదని అపోహ ప్రచారంలో ఉంది. వాస్తవానికి దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. నేరేడు పండ్లు తింటే పుట్టబోయే పిల్లలు నల్లగా పుడతారని, వారి చర్మంపై నల్లటి చారలు ఏర్పడుతాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. నిజానికి ఈ పండ్లలో కాల్షియం, విటమిన్-సి, పొటాషియం, మినరల్స్ పుట్టబోయే శిశువు ఎముకలు పటిష్టపరచడానికి సహాయపడతాయి.ఎవరు తినకూడదంటే...నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు, తర్వాత తినకపోవడం ఉత్తమం.అతిగా తినడం వల్ల లోబీపీ వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలు, పచ్చళ్లు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే వికారం, వాంతులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే ఇవి తిన్న వెంటనే పాలు మాత్రం తాగకూడదని అంటున్నారు. చర్మ సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అలర్జీలు ఎక్కువవుతాయని చెబుతారు. -
ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వల్ల ఆ సమస్యలు ! పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఇటీవల కాలంలో ఎన్నో రకాల ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. అందుకు తగ్గట్టు ఉండే అడ్వర్టైస్మెంట్లు మహిళలను అట్రెక్ట్ చేసి మరీ కొనేలా చేస్తాయి ఈ ఫెయిర్‌నెస్ ప్రొడక్ట్‌లు. అయితే తాజా అధ్యయనంలో ఈ ఫెయిర్‌నెస్ వాడకం వల్ల ఆ సమస్యలు వస్తున్నాయంటూ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ప్రజల ఆరోగ్యానికి హానికరమైన వాటితో ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు తయారు చేస్తారా? అని తయారీదారులపై ఫైర్ అవుతున్నారు. చర్మ సంరక్షణ ఎలా ఉన్నా.. ఆరోగ్యమే చెడి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు ఆరోగ్యానికి నిజంగానే హానికరమా? ఎందుకని? సవివరంగా తెలుసుకుందామా..! ఫెయిర్‌నెస్ క్రీమ్‌లంటే మహిళలకు, ముఖ్యంగా యువతకు ఎంత మక్కువ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్లో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్‌కి ఉన్నంత డిమాండ్ మరే వ్యాపారానికి ఉండదంటే అతిశయోక్తి కాదేమో..!. అలాంటి ఈ ఫెయిర్‌నెస్ క్రీముల్లో మెర్క్యురీ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. దీని వల్ల మూత్రపిండాలకు సంబంధించిన మెంబ్రానస్ నెఫ్రోపతీ (ఎంఎన్) కేసులు భారత్‌లో ఎక్కువగా పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అందుకు సంబంధించిన విషయం కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. ఈ పరిస్థితి కారణంగా మూత్రపిండాల్లో ఫిల్టరింగ్ వ్యవస్థ దెబ్బతిని ప్రోటీన్ లీకేజ్ కారణమవుతుందని చెబుతున్నారు. మూత్ర పిండాల వ్యాధి అనేది ముఖ్యంగా శరీరంలోని అంతర్గత రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడి మూత్రపిండాల రుగ్మతకు కారణమవుతుంది. దీని కారణంగా మూత్రంలో పోటీన్లు వెళ్లిపోవడం జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే.. మనం ముఖానికి రాసుకునే ఫెయిర్‌నెస్ క్రీమ్ మూత్ర పిండాలపై ఎలా ఎఫెక్ట్ చూపుతుందంటే..?. ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్‌లో వాడే పాదరసం చర్మం ద్వారా లోపలికి వెళ్తుంది. అది నేరుగా మూత్రపిండాల ఫిల్టర్ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసులు పెరుగుదలకు దారితీస్తుందని పరిశోధకులు డాక్టర్ సజీష్ శివదాస్ అన్నారు. అందులోనూ మార్కెట్లో వచ్చే ప్రతి ఫెయిర్‌నెస్ క్రీమ్ తక్షణమై ముఖం ఫెయిర్‌గా ఉండేలా చేసే ఫలితాల కారణంగానే ఈ పరిస్థితి ఎదురయ్యిందని అన్నారు. అంతేగాదు జులై 2021 నుంచి 2023 మధ్య కాలంలో ఇలాంటి మూత్ర పిండాల రుగ్మతకు సంబంధించిన 22 కేసులపై అధ్యయనం నిర్వహించారు. ఆయా వ్యక్తులు తేలికపాటి ఎడెమా(వాపు), నురుగతో కూడిన మూత్రం తదితర లక్షణాలు కనిపించాయని అన్నారు. అంతేగాదు వారిలో చాలామందికి మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు పెరిగాయన్నారు. అలాగే ఒక రోగి మాత్ర మెదడులో రక్తం గడ్డకట్టే సెరిబ్రల్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా వచ్చినట్లు తెలిపారు. అలాగే వైద్యపరీక్షల్లో 22 కేసుల్లో 68% మంది అంటే 15 మందికి న్యూరల్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 ప్రోటీన్(NELL-1) పాజిటివ్‌గా తేలింది. అంటే వారంతా మాత్రపిండాలకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారని పరిశోధనలో తేలిందన్నారు. అంతేగాదు ఆ 15 మందిలో దాదాపు 13 మంది ఈ లక్షణాలు కనిపించక మునుపే తాము ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు వాడినట్లు అంగీకరించారు. మిగతా ఇద్దిరిలో ఒకరు సాంప్రదాయ స్వదేశీ క్రీములను వాడినట్లు తెలిపారు. మరోకరికి ఆ చరిత్ర కూడా లేదు. అయితే ఆయా రోగులు ఈ ఫెయిర్నస్ క్రీమ్‌లు వాడటం మానేసిన తర్వాత మూత్రిపిండాల వ్యాధి అదుపులో ఉన్నట్లు తేలింది. అంతేగాదు ఆయా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని ఎలా ప్రమాదంలో పడేస్తున్నాయి అనేందుకు ఈ తాజా పరిశోధనే ఉదహరణ అని తెలిపారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ ఉత్పత్తులను సమర్థించడం, పైగా ఇది బహుళ బిలియన్ డాలర్ల పరిశ్రమ కావడం వల్ల అధికారులెవరూ ఈ ఉత్పత్తులకు అడ్డకట్టవేసే సాహసం చేయడం లేదని ఆరోపించారు. ఇక్కడ కేవలం చర్మ సంరక్షణ, మూత్ర పిండాల సమస్య కాదు. ఇందులో ఉపయోగించే పాదరసం ప్రజల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమైనదనేది గుర్తించడం తోపాటు ఈ హానికరమైన ఉత్పత్తులకు అడ్డుకట్టవేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: సెలబ్రిటీ శారీ డ్రేపర్: ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా..!) -
మెదడును 10 శాతమే ఉపయోగించుకుంటున్నామా?
మన మెదడులో ఎంత శాతం మనం ఉపయోగించుకుంటున్నాం? అంటే మీ సమాధానమేంటి? ఐదు లేదా పది శాతం అనేగా! ఇదే ప్రశ్నను మీ మిత్రులను అడిగి చూడండి. ‘ఐదు లేదా పది శాతం, కచ్చితంగా పదిశాతంకన్నా తక్కువే..’ అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. మీరే కాదు, కొందరు సైకాలజీ విద్యార్థులు, న్యూరోసైంటిస్టులు కూడా ఒక సర్వేలో అదే సమాధానం చెప్పారు. కొందరు అంతర్జాతీయస్థాయిలో పేరున్న ప్రముఖులు కూడా తమ పుస్తకాల్లో కూడా పది శాతమనే రాశారు. కానీ అది అవాస్తవం, అపోహ మాత్రమే. అపోహ ఎలా మొదలైంది? 1890వ దశకంలో హార్వర్డ్ సైకాలజిస్ట్ విలియం జేమ్స్, బోరిస్ సిడిస్ ఇద్దరూ కలసి పిల్లల పెంపకంపై ప్రయోగాలు చేశారు. విలియం సిడిస్ అనే బాల మేధావిని తయారుచేశారు. ఆ సందర్భంగా విలియం జేమ్స్ మాట్లాడుతూ ‘మనిషి తన మేధాసామర్థ్యం (mind potentiality)లో కొద్ది శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు’ అని చెప్పారు. ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడు డేల్ కార్నీ 1936లో రాసిన "How to win friends, influence people"కు అమెరికన్ రచయిత Lowell Thomas ముందుమాట రాశాడు. అందులో ‘మనిషి తన మేధాశక్తి (mind power)లో 10శాతాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకోగలడు’ అని చెప్పాడు. అంటే సామర్థ్యం కాస్తా శక్తిగా మారింది. ఆ తర్వాత 1970లో సైకాలజిస్ట్, విద్యావేత్త Georgi Lozanov తన suggestopedia ని ప్రతిపాదిస్తూ ‘మనం మన మేధాశక్తిలో ఐదు నుంచి పది శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం’ అని చెప్పారు. ఆ తర్వాత అనేకమంది తమ పుస్తకాల్లో ఉపన్యాసాల్లో ‘మెదడులో పదిశాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం’ అని రాశారు, చెప్పారు. తేడా గమనించండి.. మేధాసామర్థ్యంలో పదిశాతం ఉపయోగించుకోవడానికి, మెదడులో పదిశాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అనడానికి.. చాలా తేడా ఉంది. మేధో సామర్థ్యంలో పదిశాతాన్ని ఉపయోగించుకుంటున్నారంటే.. మనిషి తన మేధస్సుతో తాను సాధించగలిగిన దానిలో పదిశాతాన్ని మాత్రమే సాధించగలుగుతున్నాడని అర్థం. అంటే తన మేధస్సును మరింతగా ఉపయోగించుకుంటే మరింత ప్రగతిని సాధించగలడనే కదా. మన మెదడు అన్ని సందర్భాల్లోనూ నూటికి నూరుశాతం పనిచేస్తుంది. ఏ భాగమైనా పనిచేయకపోతే, దానికి సంబంధించిన శరీరభాగం చచ్చుబడి పోతుంది. దాన్నే పక్షవాతం అంటారు. అపోహల నుంచి బయటపడండి.. మీరు చదివింది లేదా మీకు తెలిసింది మాత్రమే నిజమనే నమ్మకం నుంచి బయటపడాలి. గొప్పవారు చెప్పారు కాబట్టి నమ్మాలి, దాన్ని ప్రశ్నించకూడదనే వైఖరి నుంచి బయటకు రావాలి. ఎవరో చెప్పినదాన్ని గుడ్డిగా అంగీకరించవద్దు, అనుసరించవద్దు. ఇలాంటి భ్రమలు, అపోహలు, అసత్యాలు మన చుట్టూ చాలా.. చాలా.. ఉన్నాయి. అవే అపర సత్యాలుగా చలామణీ అవుతున్నాయి. చలామణీ చేస్తున్నారు. అధిక సంఖ్యాకులు అంగీకరించినంత మాత్రాన, అనుసరించినంత మాత్రాన అసత్యం సత్యం కాబోదు. ఎవరో చెప్పారనో, ఎక్కడో రాశారనో దేన్నీ గుడ్డిగా నమ్మవద్దు. కాస్త సమయం వెచ్చించి పరిశీలించాలి, పరీక్షించాలి, ప్రశ్నించాలి. నిజానిజాలేమిటో తెలుసుకోవాలి. మీ మేధా సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. తప్పు అభిప్రాయానికి ఎందుకొస్తారు? తాము చదివిన పుస్తకాల్లో అలా రాసి ఉండి ఉంటుంది.. ప్రఖ్యాత వ్యక్తులు తమ ఉపన్యాసాల్లో అలా చెప్పి ఉంటారు.. ప్రశ్నలకు సులువుగా సమాధానాలు తెలుసుకోవాలనే కోరిక.. తమకు నచ్చిన సమాధానాలనే ఎంచుకోవడం, గుర్తుంచుకోవడం.. తప్పు సమాచారం మాత్రమే అందుబాటులో ఉండటం.. మీడియా, సినిమాల ద్వారా అందిన సమాచారం.. ఇలా రకరకాల మార్గాల ద్వారా అందిన సమాచారాన్ని, వివిధ కారణాలతో ఏ మాత్రం ప్రశ్నించకుండా, పరీక్షించకుండా అంగీకరించడంతో వివిధ అంశాలపై అపోహలు, తప్పు అభిప్రాయాలు ఏర్పడతాయి. జ్ఞానమెలా వస్తుందంటే.. మనమందరం మనకు అందుబాటులో ఉన్న, లేదా మనం చదివిన పుస్తకాల ఆధారంగా అభిప్రాయాలను ఏర్పరచుకుంటాం. ఒకసారి ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాక దాన్ని ఏ మాత్రం పరీక్షించం, అదే సత్యమని విశ్వసిస్తాం. ఆ తర్వాత మనం ఎవరితో మాట్లాడినా అదే విషయాన్ని చెప్తాం. మన విలువలు, విశ్వాసాలు, వైఖరులు, ప్రవర్తనలన్నీ ఇలా ఏర్పడినవే. మన జ్ఞానమంతా ఇలా వచ్చిందే. మనం జ్ఞానం అనుకుంటున్న జ్ఞానం మనకు ఎలా వచ్చిందనే విషయాన్ని వివరించే శాస్త్రాన్నే Epistemology (జ్ఞానమీమాంస) అంటారు. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com ఇవి చదవండి: 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!? -
ప్రజాస్వామ్యంలో ఓటే బలమైన ఆయుధం
సాక్షి, అమరావతి: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ఓటర్ల అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైన ఆయుధమన్నారు. సమావేశానికి హాజరైన వారితో ఓటు హక్కును తెలియజేసే విధంగా గవర్నర్ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ..రాష్ట్రంలో పురుష ఓటర్లు కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. గతేడాదిగా ఓటు నమోదు, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు చేసిన విశేష కృషి ఫలితంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 4.08 కోట్లుగా ఉందని చెప్పారు. తుది జాబితా ప్రచురణకు ముందు 2 నెలల పాటు ప్రధానంగా 18–19 ఏళ్ల వయసున్న వారు ఓటరుగా నమోదు చేయించుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేయడంతో 5.3 లక్షల ఓటర్లు అదనంగా నమోదయ్యారని చెప్పారు. యువ ఓటర్ల నమోదు కార్యక్రమం ఎన్నికల ముందు వరకు నిరంతరం కొనసాగుతుందని, యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఓటర్లుగా నమోదైన యువతకు ఎపిక్ కార్డులను గవర్నర్ అందజేశారు. ఎన్నికల జాబితా నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలలక్ష్మి, ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావులకు పురస్కారాలను అందజేశారు. ఈఆర్వోలైన నెల్లూరు మునిసిపల్ కమిషనర్ వికాస్ మర్మత్, సింహాచలం దేవస్థానం ఎస్డీసీ రామలలక్ష్మి, భీమునిపట్నం ఆర్డీవో భాస్కర్ రెడ్డి, ఏఈఆర్వోలైన కోడుమూరు మండలం తహశీల్దార్ జయన్న, మైదుకూరు తహశీల్దార్ అనురాధ, గిద్దలూరు తహశీల్దార్ సీతారామయ్య, మరో 23 మంది బీఎల్వోలను, సీఈవో కార్యాలయానికి చెందిన ఎస్వో శ్రీనివాసరావు, ఏఎస్వో సుధాకర్ తో పాటు మరో ఐదుగురు సిబ్బందిని గవర్నర్ సత్కరించారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలి గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో అందరం దేశ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం కావాలని గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, అహింస, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు పాటుపడాలని గవర్నర్ ఆకాంక్షించినట్లు రాజ్‌భవన్‌వర్గాలు గురువారం తెలిపాయి. -
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ‘నోటా’కు ఎన్ని ఓట్లు?
భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఓటర్లు ఏ అభ్యర్థినీ ఇష్టపడని పక్షంలో ఏమి చేయాలనే దానిపై గతంలో చర్చ జరిగింది. ఈ నేపధ్యంలోనే 2013 ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. 2013 తర్వాత రెండు సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఆ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ప్రవేశపెట్టారు. అయితే నోటాపై ఓటర్ల స్పందన ఎలా ఉందనే ప్రశ్న ప్రతీ ఎన్నికల సందర్భంలోనూ అందరి మదిలో తలెత్తుతుంది. దీనిని తెలుసుకునేందుకు ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో నోటా వినియోగం గురిచం పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు పూర్తియిన నాలుగు రాష్ట్రాల డేటాను అనుసరించి చూస్తే.. మూడు రాష్ట్రాల్లో, ఒక శాతం కంటే తక్కువ మంది ఓటర్లు మాత్రమే నోటాను ఎంచుకున్నారని స్పష్టమైంది. మధ్యప్రదేశ్‌లో నమోదైన 77.15 శాతం ఓటింగ్‌లో 0.98 శాతం మంది ఓటర్లు మాత్రమే నోటాను ఎంచుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 1.26 శాతం మంది ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లో నోటా బటన్‌ను నొక్కారు. తెలంగాణలో 0.73 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. తెలంగాణలో 71.14 శాతం ఓటింగ్ నమోదైంది. రాజస్థాన్‌లో 0.96 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. ఆ రాష్ట్రంలో 74.62 శాతం ఓటింగ్ జరిగింది. ‘నోటా’ ఆప్షన్ వినియోగం గురించి కన్స్యూమర్ డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘యాక్సిస్ మై ఇండియా’కు చెందిన ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ నోటా అనేది ఎన్నికల్లో .01 శాతం నుంచి గరిష్టంగా రెండు శాతం వరకు ఉపయోగితమవుతోంది. భారతదేశంలో అమలవుతున్న ‘ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్’ సూత్రం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఈ విధానంలో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అటువంటి పరిస్థితిలో ఓటర్లు.. ఎన్నికల్లో అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని భావించినప్పుడు వారు నోటాకు ఓటు వేయవచ్చు. అయితే నోటా ఆప్షన్‌ను ప్రజలు సక్రమంగా వినియోగించుకుంటేనే జనం నాడి తెలుస్తుందని, ప్రయోజనం ఉంటుందని, లేనిపక్షంలో అది లాంఛనప్రాయం అవుతుందని ప్రదీప్ గుప్తా అన్నారు. ఇది కూడా చదవండి: సీఎం రేసులో బాబా బాలక్‌నాథ్?.. అధిష్టానం నుంచి పిలుపు! -
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని సీఎస్ శాంతి కుమారి పిలుపునిచ్చారు. సచివాలయంలో వీటి వాడకాన్ని నిషేధించి, ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా కార్యదర్శులు మొదలు ప్రతీ అధికారి, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో వీటి నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. శనివారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై జరిగిన వర్క్ షాప్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రాజీవ్ శర్మ తోపాటు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా..సామాజిక భాద్యతతోనే సాధ్యం శాంతి కుమారి మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్ లో కేవలం 9 శాతం మాత్రమే రీ–సైక్లింగ్ జరుగుతోందని, మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి భూమిని కాపాడుకొందాం’అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా శాంతి కుమారి, రాజీవ్ శర్మ ఆవిష్కరించారు. -
తుపాను సమయంలో ఫోన్ వాడకూడదా? దీనిలో నిజమెంత?
పిడుగులు పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని చాలామంది అంటుంటారు. ఆ సమయంలో ఫోన్లను వినియోగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయని కూడా చెబుతారు. ఇదేవిధంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాతావరణంలో ఇంటర్నెట్ వాడకూడదని కూడా అంటుంటారు. దీనివెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్లు విద్యుత్తును ఆకర్షిస్తాయని, మెరుపు మెరిసినప్పుడు దానిలోని విద్యుత్ శక్తిని ఫోన్ తన వైపుకు ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. ఫలితంగా ఇంటిపై పిడుగు పడే అవకాశాలుంటాయని చెబుతారు. దీని వెనుక ఉన్న లాజిక్ గురించి కొందరు ఏమంటారంటే.. మెరుపులోని విద్యుత్ ఫోన్టవర్ ద్వారా మీ ఫోనును చేరుకుంటుందని అంటుంటారు. తుఫాను సమయంలో మెరుపులు, పిడుగులలోని విద్యుత్ ఫోన్‌కు చేరుకుని అది పేలవచ్చని, లేదా ఇంటిపై పిడుగులు పడవచ్చని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో, నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ కోసం రేడియో తరంగాలను, ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ వేవ్స్ ను స్వీకరిస్తాయి. ఈ తరంగాల గుండా విద్యుత్ ఎప్పుడూ ప్రవహించదు. అంటే ఈ రేడియో తరంగాల ద్వారా విద్యుత్తు మీ ఫోన్‌కు ఎప్పటికీ చేరదు. మొత్తంగా చూస్తే పిడుగుపాటు సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదనేది కేవలం భ్రమ మాత్రమేనని చెప్పవచ్చు. ఎవరైనా తుఫాను సమయంలో కూడా మొబైల్ ఫోన్‌ను నిరభ్యరంతరంగా ఉపయోగించవచ్చు. అయితే వైర్డ్ టెలిఫోన్ విషయంలో కొంతమేరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఓం’పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం? -
జ్వరం వస్తే చాలు!.. పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నారా?
జ్వరం వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందరూ మొదట వేసుకునే టాబ్లెట్ ఇదే. పైగా మొన్నటివరకు కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఏం ఉన్నా లేకపోయినా పారాసెటమాల్ టాబ్లెట్ షీట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాయి. జ్వరానికే కాకుండా దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలకు సైతం పారాసెటమాల్ టాబ్లెట్లను విరి విరిగా వాడేస్తున్నారు. అయితే పారాసెటమాల్ టాబ్లెట్లను అలా విచ్చలవిడిగా వేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నవీన్ నడిమింటి. ఆ టాబ్లెట్లను అధికంగా వాడటం వల్లే కలిగే దుష్పరిణామాలు గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో చూద్దాం.! పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకున్న వెంటనే జ్వరం తగ్గకుంటే మళ్లీ మరో టాబ్లెట్ వేసుకోవడం చేయరాదు. అలాగే జ్వరం వచ్చిన నాలుగు నుంచి ఆరు గంటల మధ్య వ్యవధిలో పెద్దలకైతే 650 మిల్లీ గ్రాములు, పన్నెండు సంవత్సరాలు వయస్సు అంత కన్నా లోపు ఉన్న పిల్లలకైతే 15 మిల్లీ గ్రాముల పారాసెటమాల్ మోతాదును ఇవ్వాలి. ఇవేమి పాటించకుండా వీటిని ఎలా పడితే అలా వాడితే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పారాసెటమాల్ టాబ్లెట్లను పరిమితికి మించి తీసుకోవడం వల్ల అధిక చెమటలు, మోషన్స్, కళ్లు తిరగడం, వాంతులు, చర్మ సంబంధిత సమస్యలు, ఆకలి తగ్గిపోవడం, కడుపు నొప్పి, అలర్జీలు వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. అలాగే పారాసెటమాల్ లాంటి టాబ్లెట్లలో స్టెరాయిడ్స్ ఉంటాయి.అందువల్ల వీటిని అధికంగా తీసుకుంటే మూత్ర పిండాలు, కాలేయం వంటి అవయవాలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మూత్ర పిండాలు, కాలేయం సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న వారైతే వైద్యులను సంప్రదించకుండా పారాసెటమాల్, డోలో, క్రోసిన్ వంటి టాబ్లెట్లను పొరపాటున కూడా వేసుకోరాదు. కాబట్టి ఇకపై పారాసెటమాల్ టాబ్లెట్ల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించకండి అని గట్టిగా హెచ్చరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నవీన్ నడిమింటి. ఆయుర్వేద నిపుణులు డాక్టర్ నవీన్ నడిమింటి (చదవండి: తెర వెనుక వైద్యుడు! వ్యాధులను నివారించడంలో వారిదే కీలక పాత్ర!) -
మొలకెత్తే పెన్ను.. పర్యావరణానికి దన్ను
గుంటూరు (ఎడ్యుకేషన్): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వినియోగంపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే పెన్నులను సైతం పర్యావరణ అనుకూల విధానంలో ఉపయోగిస్తోంది. యూజ్ అండ్ త్రో (వాడిపారేసే) ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల సంఖ్యలో పెన్నులను వాడి పారేస్తుండటంతో పర్యావరణానికి హాని కలిగించని పెన్నుల తయారీ, వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా పర్యావరణ అనుకూల పెన్నుల వినియోగాన్ని అమల్లోకి తెచ్చింది. కాగితం పొరలతో.. కాగితం పొరలతో తయారు చేసిన పెన్నులకు మందపాటి అట్టతో రూపొందించిన క్యాప్ ఉంచిన పెన్నులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఉచితంగా అందజేస్తున్నారు. ప్యాడ్‌తో పాటు పేపర్ పెన్నులను ఇస్తూ.. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. ప్రత్యేకంగా పేపర్ పెన్నుల ఉత్పత్తిదారులకు ఆర్డర్ ఇచ్చి పెన్నులు తయారు చేయిస్తున్నారు. వీటిని వాడిన తరువాత పడేస్తే అవి మట్టిలో కలిసిపోతాయి. మరో విశేషం ఏమిటంటే.. ఆ పెన్నుల వెనుక భాగంలో అమర్చిన చిన్న గొట్టంలో నవ ధాన్యాలు, వివిధ దినుసులు, పూల మొక్కల విత్తనాలను అమర్చారు. బీన్స్, సన్‌ఫ్లవర్, మెంతులు తదితర విత్తనాలను కూడా అమర్చుతున్నారు. పెన్నును వాడి పారేసిన తరువాత ఇంటి పెరట్లోనో, రోడ్డు పక్కన మట్టిలోనో పారవేస్తే పెన్ను భూమిలో కరిగిపోయి.. అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ప్రస్తుతం బల్క్ ఆర్డర్లపై తయారు చేస్తున్న ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నును కేవలం రూ.20కే కొనుగోలు చేయవచ్చు. గురువారం గుంటూరు నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు ఎకో ఫ్రెండ్లీ పెన్నులను విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు. -
అంబులెన్స్ సైరన్ ఎమర్జెన్సీలోనే.. మీ ఇష్టమున్నట్టు కాదు..
హైదరాబాద్: రోగులను ఆస్పత్రికి వేగంగా తరలించడానికి అంబులెన్స్ సర్వీస్‌ను ఉపయోగిస్తారు. ఆ సైరన్ వినపడగానే రోడ్డుపై ఆ వాహనానికి దారి ఇస్తాం. ట్రాఫిక్ పోలీసులు సైతం తక్షణ అవసరాన్ని గుర్తించి అంబులెన్స్‌లకు దారి ఇచ్చేలా సిగ్నల్స్‌ను సైతం అందుకు తగ్గట్టుగా మారుస్తుంటారు. కానీ కొందరు ఈ అంబులెన్స్ సేవలను దుర్వినియోగం చేస్తుంటారు. అవసరం లేకున్నా సైరన్ మోగిస్తారు. ఇటీవల ఇలాంటి ఘటనే తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. దీనిపై రాష్ట్ర పోలీసు శాఖ సీరియస్ అయ్యింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంబులెన్స్ సైరన్‌ను ఉపయోగించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. #TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised. Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN — Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023 ఓ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ ట్రాఫిక్‌లో సైరన్ మోగిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీని గుర్తించిన ట్రాఫిక్ పోలీసు.. సిగ్నల్స్‌ను మార్చి ఆ వాహనానికి తక్షణం దారి ఇచ్చారు. కానీ సిగ్నల్ దాటిన తర్వాత డ్రైవర్ ఆ అంబులెన్స్‌ను ఆపి టిఫిన్ తిన్నట్లు ట్రాఫిక్ పోలీసు గుర్తించారు. రోడ్డు పక్కనే అగి ఉన్న అంబులెన్స్ వద్దకు వచ్చి డ్రైవర్‌ను ప్రశ్నించగా.. నీరసం వస్తుందంటూ పొంతన లేని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర పోలీసు యంత్రాంగం.. ఆ అంబులెన్స్ డ్రైవర్ తీరుపై సీరియస్ అయ్యింది. అంబులెన్స్ సైరన్ ఎమర్జెన్సీలోనే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఆస్పత్రికి వెళ్లడానికి సైరన్‌ను ఉపయోగించాలని సూచించింది. సమాజ శ్రేయస్సుకు మనమంతా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరింది. ఇదీ చదవండి: చేతులెత్తేసిన పోలీసులు.. పీఎస్‌లో హిజ్రాల రణరంగం -
2000 రూపాయల నోట్లను బ్యాంకు లో తీసుకోకపోతే ఇలా చేయండి
-
గుడ్డ సంచీకి వెల్కం
మార్కెట్‌కెళ్తే సామాన్లు క్యారీ బ్యాగుల్లో ఇస్తారు లెమ్మనుకునే రోజులు రేపటితో పోయినట్టే. ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను కేంద్రం జూలై 1 నుంచి నిషేధించింది? ఇకపై మార్కెట్‌కెళ్తే గుడ్డ సంచీ వెంట ఉండాల్సిందే... ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (ఎస్యూపీ)వాడకం, తయారీ, అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతి తదితరాలన్నింటినీ నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది శుక్రవారం నుంచే అమల్లోకి రానుంది. రీ సైక్లింగ్ కష్టమైన అన్ని రకాల ప్లాస్టిక్‌నూ నిషేధిత జాబితాలో చేర్చింది. 75 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్‌ను 2021లోనే నిషేధించగా దాన్నిప్పుడు 100 మైక్రోన్లకూ వర్తింపజేసింది. ఇకపై వీటిని ఎవరు తయారు చేసినా, అమ్మినా సంస్థ లైసెన్లు రద్దు చేస్తారు. 120 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ బ్యాగులు, తదితరాలనూ వచ్చే డిసెంబర్ 31 నుంచి నిషేధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎందుకీ నిషేధం? ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనది 98వ స్థానం. దేశంలో ఏటా 1.18 కోట్ల టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. ఇందులో 29 లక్షల టన్నులు ఎగుమతవుతోంది. ఏటా సగటున 56 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుంటున్నాయి. అంటే ఒక్కొక్కరు ఏకంగా 4 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నట్టు లెక్క! ప్రపంచవ్యాప్తంత్తేటా 38 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. ఇందులో 91% రీ సైక్లింగ్‌కు అవకాశం లేనిదే. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు వెయ్యేళ్లకు పైగా పడుతుంది. అందుకే దేశౠలన్నీ ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించాయి. హానికారక ప్లాస్టిక్ ఉత్పత్తిని దశలవారీగా ఆపేయాలని భారత్ సహా 124 దేశాలతో కూడిన ఐరాస ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ తీర్మానించింది. ఎస్యూపీతో యమ డేంజర్ ఎస్యూపీ అంటే ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్. షాంపూ పాకెట్ల నుంచి కరీ పాయింట్లలో కూరలు కట్టిచ్చే కవర్ల దాకా అన్నీ ఈ బాపతే. ఇవి ఆరోగ్యానికి , పర్యావరణానికి అత్యంత హానికరం. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్లాస్టిక్‌లో మూడో వంతు ఎస్యూపీనే. ఇది భూమిలో కలవకపోగా పర్యావరణాన్ని నేరుగా విషతుల్యం చేస్తుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పారేయడం, కాల్చేయడం, కొండ ప్రాంతాల్లో పడేయడం జరిగిందని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఎస్యూపీ ఉత్పత్తి ఇలాగే కొనసాగితే 2050 నాటికి పర్యావరణంలో కలిసిపోయే కర్బన ఉద్గారాల్లో 10 శాతం ఇదే ఉంటుందని ఐరాస అంచనా. ఎస్యూపీ బ్యాగుల్లోని ఆహార పదార్థాలను ఏళ్ల తరబడి తింటే రక్తంలోనూ ప్లాస్టిక్ కణాలు కలిసిపోతాయట. ఇది కేన్సర్ సహా పలు ప్రాణాంతక రోగాలకు దారి తీస్తుంది. భూమ్మీద సకల జీవజాలానికీ ప్లాస్టిక్ ముప్పుగానే మారింది. ఇతర దేశాల్లో.. బంగ్లాదేశ్ ప్రపంచంలో తొలిసారి 2002లోనే ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించింది. 2019 జులైలో న్యూజిలాండ్ ఇదే బాట పట్టింది. 68 దేశాలు రకరకాల మందమున్న ప్లాస్టిక్‌ను నిషేధించాయి. 2020లో చైనా దశలవారీగా నిషేధం విధించింది. అమెరికాలో రాష్ట్రాన్ని బట్టి నిషేధముంది. నిషేధిత వస్తువులివే... ► ప్లాస్టిక్ పుల్లలతో కూడిన ఇయర్ బడ్స్ ► బెలూన్లలో వాడే ప్లాస్టిక్ పుల్లలు ► ప్లాస్టిక్ జెండాలు ► చాక్లెట్లు, ఐస్‌క్రీముల్లో వాడే ప్లాస్టిక్ పుల్లలు ► డెకరేషన్‌కు వాడే థర్మోకోల్ ► ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రా, ట్రేలు ► స్వీటు బాక్సులు, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ పేకెట్లపై ప్లాస్టిక్ ర్యాపింగ్ ► ద్రవ పదార్థాలను కలపడానికి వాడే ప్లాస్టిక్ స్టిక్స్ ► 100 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ వస్తువులు (వీసీ బ్యానర్లు) – సాక్షి, నేషనల్ డెస్క్ -
వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే!
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): మనం రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వివిధ వస్తువులను వినియోగిస్తుంటాం. వాటిని ఎంత కాలం ఉపయోగించాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఎక్కువ కాలం వినియోగిస్తూనే ఉంటాం. కాలపరిమితి ముగిసిన వాటిని వాడితే ప్రమాదం పొంచి ఉంది. వీటితో పాటు వాడుకలో లేని వస్తువులను ఇంట్లోనే కుప్పలుగా వదిలేస్తుంటారు. వాటిల్లోనూ క్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెంది.. మనకు అనారోగ్య సమస్యలు తెచ్చి పెడతాయి. అలాంటి వాటిని సరైన సమయంలో మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే పళ్లను శుభ్రం చేసుకునే బ్రష్ నుంచి రాత్రి పడుకునేందుకు వినియోగించే తలదిండు వరకు ఎలా ఉపయోగించాలి.. ఎప్పుడు మార్చాలి అనే విషయాలు తెలుసుకుందాం. చదవండి: నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి? మంచినీటి సీసా ఇంట్లో వినియోగించే మంచి నీళ్ల సీసాలు, వాటర్ క్యాన్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తరచూ వాటిని శుభ్రం చేసుకోవాలి. లేకపోతే అడుగు భాగంలో నాచు పట్టే వీలుంటుంది. మంచినీటి సీసాలను మాత్రం మూడు, నాలుగు నెలలకోసారి మార్చాలి. వీటితో పాటు మార్కెట్లో అప్పటికప్పుడు తాగేందుకు కొనుగోలు చేసే నీటి సీసాలను తిరిగి ఇంట్లో వాడడం హానికరం. పొపుల పెట్టె వంటింట్లో పప్పు దినుసులు వేసే డబ్బాలను తరచూ శుభ్రం చేసుకోవాలి. ఓ సారి వేసిన సరకు అయిపోగానే..డబ్బాలను మళ్లీ శుభ్రం చేసుకుని కొత్త సరకు వేసుకోవాలి. అంతేగాని నీటితో శుభ్రం చేయకుండా అలా ఏడాది పొడవునా సరకులు వేస్తూ ఉండకూడదు. అలా వేస్తే అందులో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు సరకుల్లో చేరే వీలుంటుంది. వీలైతే ఏడాదికోసారి డబ్బాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంట్లో పెంచుకునే మొక్కలు ఇంట్లోని కుండీల్లో పెంచుకునే మొక్కల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుండీల్లో చెత్త వేయకూడదు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. లేకపోతే దోమలు వృద్ధి చెందే వీలుంటుంది. సాక్స్‌లు, దువ్వెన కాళ్లకు ధరించే సాక్స్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కాలపరిమితి ముగిసిన వెంటనే పాతవాటిని మార్చి..కొత్తవి ఉపయోగించాలి. ఇంట్లో పాడైన చెప్పులు, బూట్లను బయట పారేయాలి. లేకపోతే క్రిములు వృద్ధి చెందే వీలుంటుంది. నిత్యం తల దువ్వేందుకు వినియోగించే దువ్వెన విషయంలోనూ శుభ్రత పాటించాలి. పాడైన, పళ్లు సరిగా లేని దువ్వెనను వినియోగించకూడదు. టూత్‌బ్రష్ ప్రతి ఒక్కరూ ఉదయాన్నే వినియోగించే టూత్ బ్రష్‌ను తప్పనిసరిగా ప్రతి మూడు నుంచి నాలుగు నెలల్లోపు మార్చాలి. బ్రష్ పాడవకపోయినా.. దానిని ఎక్కువ కాలం వినియోగిస్తే..పళ్లకు ఇబ్బంది కలగొచ్చు. చిన్న పిల్లల బ్రష్‌ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. బ్రష్‌పై ఉండే కుచ్చు పాడైన వెంటనే కాలంతో సంబంధం లేకుండా మార్చేయాలి. పాడైన బ్రష్‌లతో కొందరు ఇంట్లోని వస్తువులను శుభ్రం చేస్తుంటారు. అలాంటి వాటిల్లోనూ క్రిములు చేరే వీలుంటుంది. అందుకే వినియోగంలో లేని వాటిని బయట పాడేయాలి. తలదిండులు చాలా మంది ఇంట్లో మంచాలపై ఉండే దుప్పట్లు, దిండుకవర్లను మాత్రమే సకాలంలో శుభ్రం చేస్తూ.. అప్పుడప్పుడు కొత్తవి మార్చుతుంటారు. కానీ దిండ్లను మార్చరు. నిత్యం వినియోగించే దిండ్లపై సూక్ష్మక్రిములు వేగంగా వృద్ధి చెందుతాయి. అవి మన తలలోకి చేరడంతో దురద, ఇతర సమస్యలు వస్తాయి. అందుకే కొంతకాలం వాడిన తర్వాత వాటిని మార్చుకోవాలి. లోదుస్తులు మనం ధరించే లోదుస్తులను క్రమం తప్పకుండా ఉతికి ఆరేసిన తర్వాతే ధరించాలి. వీలైతే వేడి నీటితో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. అలా చేయని పక్షంలో కనీసం ఇస్త్రీ అయినా చేసి ధరించాలి. అప్పుడే వాటిల్లో ఉండే క్రిములు చనిపోతాయి. లోదుస్తుల్లో క్రిములు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాటితో మనకు తామర, గజ్జి వంటి చర్మ వ్యాధులు సోకే వీలుంటుంది. పాడవకపోయినా.. లోదుస్తులను కూడా ఏడాదికోసారి మార్చేయడం మంచిది. -
నో మోర్ ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ ఈనెల 12న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నియమాలు–2021ను ప్రకటించింది. ఇందులో భాగంగా అధిక చెత్తకు కారణమయ్యే ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులను వచ్చే ఏడాది జూలై నుంచి నిషేధించింది. ‘ప్లాస్టిక్ ఇయర్‌బడ్స్’పై నిషేధం: వచ్చే ఏడాది జూలై 1వ తేదీ నుంచి దేశంలో గుర్తించిన కొన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ప్లాస్టిక్ స్టిక్స్‌తో చేసిన ఇయర్ బడ్స్, బెలూన్లకు ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీస్‌కు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, డెకరేషన్‌కు వాడే థర్మోకోల్ వస్తువులపై నిషేధం అమలులోకి రానుంది. వీటితోపాటు ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, స్వీట్ బాక్సులకు వాడే ప్యాకింగ్ పేపర్, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్లకు తక్కువగా ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లను నిషేధిత జాబితాలో చేర్చింది. 120 మైక్రాన్లకు పెంపు ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నుంచి దేశంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల మందాన్ని 50 నుంచి 75 మైక్రాన్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022 డిసెంబర్ 31 నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల కనీస మందం 120 మైక్రాన్లకు పెంచింది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల మందం పెరిగిన కారణంగా వాటిని తిరిగి ఉపయోగించేందుకు అనుమతించనుంది. రాష్ట్రాలు చీఫ్ సెక్రటరీ స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని కోరింది. -
కరోనా వ్యాక్సిన్: ఫైజర్ కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: ఫార్మా మేజర్ ఫైజర్ సంచలన విషయాన్ని ప్రకటించింది. భారతదేశంలో తన కరోనా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఈయూఏ) దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఫిబ్రవరి 3న జరిగిన భారత డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశంలో ఫైజర్ ఈ విషయాన్ని ప్రకటించింది. (షాకింగ్: కరోనాలో 4 వేల రకాలు) భారత్‌లో అనుమతి కోసం అధికారులను సంప్రదించిన దాదాపు రెండు నెలల తర్వాత అత్యవసర పరిస్థితుల్లో తన కోవిడ్ -19 వ్యాక్సిన్ రెగ్యులేటరీ ఆమోద దరఖాస్తును ఉపసంహరించుకోవాలని ఫైజర్ నిర్ణయించినట్లు అమెరికన్ డ్రగ్ దిగ్గజం శుక్రవారం తెలిపింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశంలో రెగ్యులేటరీ వ్యాక్సిన్ అదనపు సమాచారాన్ని కోరడంతో ఫైజర్ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాక్సిన్ అతితక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మరింత అదనపు సమాచారంతో ఇండియాలో అత్యవసర వినియోగ ఆమోదం కోసం మరోసారి దరఖాస్తు చేస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. -
క్రిస్మస్కు ముందే ఇండియాలో వ్యాక్సిన్!
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే విషయంపై భారీ ఆసక్తి నెలకొంది. ఎపుడెపుడా అని ప్రజలంతా ఎదురు చూస్తున్న సమయంలో సీరంకు యూకే డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం కీలకంగా మారనుంది. యూకే, బ్రెజిల్ దేశాల్లోని కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్, ఆమోదం లాంటి అంశాలను భారత ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న సీరంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఇండియాలో కూడా అత్యవసర వినియోగానికి అనుమతి పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్కు ముందే దేశీయంగా కూడా అనుమతి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. (కోవిడ్-19 వ్యాక్సిన్ల రవాణాకు స్పైస్‌జెట్) తాజా నివేదికల ప్రకారం మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఎ)ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫలితాలను, సామర్ధ్యాన్ని, మోతాదులను అంచనా వేస్తోంది. దీంతో క్రిస్మస్కు ముందే ఎంహెచ్‌ఆర్‌ఎ ఆమోదం వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత వెంటనే దేశీయంగా కూడా అనుమతి లభించనుందని రెగ్యులేటరీ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. భారతదేశంలో అత్యవసర వినియోగ అధికారానికి సంబంధించిన సీరం అభ్యర్థనను ఆమోదించేందుకు యూఏ రెగ్యులేటరీ ఆమోదం చాలా కీలకమని ఒక అధికారి తెలిపారు. యూకే బ్రెజిల్లో జరుగుతున్న ట్రయల్స్ ఆధారంగా ప్రతిపాదన ఉంటుందనీ, అంతేకాకుండా, టీకా ఇంకా ఏ దేశంలోనూ ఆమోదించబడలేదు. ఇది సున్నితమైన విషయమన్నారు. టీకా భద్రత, సమర్థత ,రోగనిరోధక శక్తిపై తమకు ఖచ్చితంగా తెలిస్తేనే, అనుమతి ఇవ్వగలమని అధికారి పేర్కొన్నారు. మరోవైపు కరోనావైరస్ వ్యాక్సిన్లను పరిశీలించే ప్రభుత్వ ప్యానెల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఇసి) దేశంలో 2, 3 దశల మానవ క్లినికల్ ట్రయల్స్ అప్డేటెడ్ సేఫ్టీ డేటాతో పాటు యుకెలో ట్రయల్ ఇమ్యూనోజెనిసిటీ డేటాను కూడా సమర్పించాలని సీరంను కోరింది. భారతదేశంలో అత్యవసర వినియోగ ప్రామాణీకరణ ఆమోదం పొందాలంటే ఎంహెచ్‌ఆర్‌ఎ ఆమోదానికి సంబంధించిన వివరాలను సీరం సంస్థ తప్పనిసరిగా అందించాలని ప్యానెల్ స్పష్టం చేసింది. -
కరోనా వ్యాక్సిన్ ‘రెడీ టూ యూజ్’ : రష్యా మంత్రి
మాస్కో: కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వేగంగా కదులుతున్న రష్యా మరో కీలక విషయాన్ని ప్రకటించింది. తమ దేశానికి చెందిన కోవిడ్-19 తొలి వ్యాక్సిన్ వాడకానికి వచ్చే నెలలోనే సిద్ధంగా ఉంటుందని ఉప రక్షణ మంత్రి రుస్లాన్ సాలికోవ్ ప్రకటించారు. మాస్కోకు చెందిన వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాలికోవ్ ఈ విషయం చెప్పారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. తమ వ్యాక్సిన్‌కు సంబంధించిన మొదటి, రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేశామని సాలికోవ్ తెలిపారు. ముఖ్యంగా రెండవ దశ పరీక్షలు విచారణ సోమవారం ముగిసాయనీ, వీరందరూ కరోనావైరస్ నుండి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటున్నారని, త్వరితంగా కోలుకుంటున్నారని వెల్లడించారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను వేలాదిమందిపై త్వరలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఎపుడు మొదలుపెట్టేదీ, టీకా ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ ఆయన స్పష్టంగా ప్రస్తావించలేదు. మరోవైపు సాలికోవ్ చేసిన వాదనను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించలేదు. వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు మరో నివేదిక ద్వారా తెలుస్తోంది. కాగా మాస్కోలోని ప్రభుత్వ సంస్థ గమలేయ ఇన్స్‌స్టిట్యూట్ అండ్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సహకారంతో కరోనావైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు రష్యన్ ఆర్మీ ఇటీవల ప్రకటించింది. రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వేలాది మంది వాలంటీర్లతో దశ-3 మానవ క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు 3న ప్రారంభం కానున్నాయనీ, టీకా పంపిణీ సెప్టెంబరు నాటికి ప్రారంభమవుతుందని (ఆర్డీఐఎఫ్) అధినేత కిరిల్ దిమిత్రోవ్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దిమిత్రోవ్ ప్రకారం, దేశీయంగా 30 మిలియన్ మోతాదులను, అంతర్జాతీయంగా170 మిలియన్లను తయారు చేయనుంది. వ్యాక్సిన్ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపాయి. -
ఉరుకులు.. పరుగులు
* మార్చి 31తో మురిగిపోనున్న సబ్‌ప్లాన్ నిధులు * ఆఘమేఘాలపై పనులకు ప్రతిపాదనలు * గుంటూరులోని ప్రధాన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు బాపట్ల: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మార్చి 31వ తేదీతో మురిగిపోనున్న నేపథ్యంలో ఆ నిధులతో పనులు చేపట్టేందుకు అధికారులు ఉరుకులు, పరుగులు మొదలెట్టారు. మున్సిపాల్టీల్లో పాలకపగ్గాలు చేపట్టిన తరువాత ఒక పని కూడా చేయలేకపోయామనే అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లను ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాను పనులతోనైనా సంతృప్తి పరిచేందుకు మున్సిపల్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 12 మున్సిపాల్టీలో మార్చి 31లోపు చేపట్టబోయే పనులకు సంబంధించి ప్రతిపాదనల చిట్టా తీసుకుని అధికారయంత్రాంగం గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఒక్కొక్క కౌన్సిలర్ కనీసం వార్డులో రెండు, మూడు పనులు చేపట్టుకునేందుకు అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలు వార్డులో లేకపోతే ఆ వార్డులకు ఈ నిధులు వచ్చే అవకాశం లేకపోవటంతో ఆయా వార్డుల్లో కనీసం తాగునీటి పైపులైన్లు అయినా ప్రతిపాదించాలనే తలంపులో అధికారగణం ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. నామినేషన్ పద్ధతిపైనే పనులు.. మార్చి 31లోపు సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటంతో వాటిని చేజిక్కించుకునేందుకు జిల్లాలోని మున్సిపాల్టీలో ఆఘమేఘాలపై ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మిగిలిన నాలుగు జిల్లాలో మాత్రమే ఈ నిధులు ఉపయోగించుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మున్సిపాల్టీలు ఈ నిధులను దక్కించుకునేందుకు చూస్తున్నాయి. గతంలో మున్సిపాల్టీకి రూ.50లక్షలు మాత్రమే ఇచ్చే ఈ నిధులు మార్చినెలాఖరుతో మురిగిపోనుండటంతో ఎన్ని పనులకైనా అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. టెండర్లు పిలిస్తే ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఒక్కొక్క మున్సిపాల్టీలో రూ.5 లక్షల వరకు నామినేషన్ పద్ధతిపై పనులు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. రోడ్లు, పైపులైన్లు, డ్రైనేజీలతోపాటు దళితవాడలు, వాటికి అనుసంధానంగా ఉండే వార్డుల్లో పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాపట్ల మున్సిపాల్టీలో రూ.10 కోట్లతో 200 పనులకు పైగా ప్రతిపాదనలు సిద్ధంగా చేయగా మిగిలిన మున్సిపాల్టీల్లో వారి స్థాయిని అనుసరించి రూ.2 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ప్రతిపాదనలు తయారు చేశారు. మొత్తంగా జిల్లాలో వెయ్యి పనులకుపైగా చేపట్టాలనే ఉద్దేశంతో ఫైల్స్ తీసుకుని అనుమతులు కోసం గుంటూరు ప్రధాన కార్యాలయాల చుట్టూ మున్సిపల్ యంత్రాంగం తిరుగుతోంది. మున్సిపాల్టీల్లో ప్రత్యేక సమావేశాలు.. గుంటూరులోని ప్రధాన కార్యాలయాల నుంచి ప్రతిపాదనలకు అనుమతులు రావటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 మున్సిపాల్టీల్లో ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు ఆఘమేఘాలపై ప్రయత్నాలు మొదలు పెట్టారు. గడిచిన పదిరోజులుగా చేపట్టాల్సిన పనులపై సర్వేలు నిర్వహించి ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పటికప్పుడు తయారుచేసిన ఫైల్స్‌ను తీసుకొని గుంటూరులోని కార్యాలయాలకు పయనమవుతున్నారు. -
సేంద్రియ ఎరువులు వాడాలి
కలెక్టర్ అరుణ్‌కుమార్ బోట్‌క్లబ్ (కాకినాడ) : రైతులు రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులు వినియోగం పెంచాలని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా సోమవారం కృషిభవన్‌లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమిలో సారం తగ్గడంతోపాటు రైతులు ఎక్కువ పెట్టుపెడి పెట్టాల్సి వస్తోందన్నారు. ఈ విషయం భూసార పరీక్షల్లో వెల్లడైందన్నారు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల రైతులకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూమి సారవంతగా తయారవుతుందన్నారు. రసాయనిక ఎరువుల వాడకంలో మనరాష్ట్రం ప్రపంచంలోనే ముందంజలో ఉందన్నారు. జిల్లాలోని పలు పంట పొలాల్లో సూక్ష్మధాతు లోపాలు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు రైతులు జింక్, బోరాన్ వంటి వాటిని వేసుకోవాలన్నారు. వీటిని సబ్సిడీపై అందిస్తున్నట్టు చెప్పారు. పెద్దనోట్ల రద్దు కారణంగా రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకొంటున్నామన్నారు. రైతులు కూడా రూపేకార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపాలని కోరారు. ప్రస్తుతం రైతులు ధాన్యం అమ్మిన నగదు బ్యాంకుల్లో జమవుతుందని , రైతుల ఖాతాల్లో ఎంత నగదు పడినా దానికి పన్ను కట్టనవసరం లేదన్నారు. వ్యవసాయశాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. పురుగు మందులు కొనుగోలు చేస్తుంటే పలు దుకాణాల్లో బిల్లులు ఇవ్వడం లేదని, సేంద్రియ ఎరువుల వాడడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ డీడీలు వీటీ రామారావు, లక్ష్మణరావు, కాకినాడ ఏడీ భవానీ, వైవీ సుబ్బారావు రైతులు పాల్గొన్నారు. -
అసలేమీ గుర్తులేదా..?
-
థర్డ్ పార్టీ ఏటీఎం వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!
ముంబై: ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేటపుడు ఏ బ్యాంక్ ఏటీఎం అనేది పెద్దగా పట్టించుకోం.. కదా.. అవసరం రీత్యా అందుబాటులో ఏదో ఒక ఏటీఎంను వాడేస్తూ ఉంటాం. కానీ అదే హ్యాకర్లకు సువర్ణ అవకాశాన్ని అందిస్తోందని, ఈ థర్డ్ పార్టీ ఏటీఎం లావాదేవీలే కొంపముంచుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. థర్డ్ పార్టీ ఏటీఎంల వినియోగంతో ఖాతాదారుల డబ్బులకు రెక్కలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలనీ, ఏటీఏం సెంటర్లలో మనీ డ్రా చేసేపుడు కూడా అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఎస్బీఐ 6 లక్షల డెబిట్ కార్డుల బ్లాక్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా బ్యాంకు కార్డు వినియోగదారుల్లో ఆందళన రేగింది.. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సమాచార కుంభకోణంగా విశ్లేషకులు పేర్కొంటున్న అక్రమాలకు చైనాలోనే బీజం పడినట్టు తెలుస్తోంది. చైనాలోని ఏటీఎం, ఇతర విక్రయ కేంద్రాల్లో నమోదవుతున్న అనధికారిక లావాదేవీలు,బాధితుల ఫిర్యాదులు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. మరోవైపు ఈ కుంభకోణంలో ప్రధాన బాధితులుగా ఉన్న ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు ఇదే వాదనను తెరపైకి తెస్తున్నాయి. తమ ఏటీఎంలలో ఎలాంటి అవకతవకలూ జరగలేదనీ బ్యాంకు అధికారులు ప్రకటించారు. ఇతర బ్యాంకుల కార్డుల నుంచి డబ్బు విత్ డ్రా అవుతున్న లావాదేవీల కార్డులే హ్యాకింగ్ గురైనట్టు వాదిస్తున్నాయి. ముఖ్యంగా యస్ బ్యాంకుకు తక్కువ సంఖ్యలో ఏటీఎంలు ఉండడం, ఈ నేపథ్యంలోనే ఈ బ్యాంకుకు చెందిన ఖాతాదారుల్లో అత్యధికుల వివరాలు లీక్ అయ్యాయని పేర్కొంటున్నారు దీంతోపాటుగా పిన్ లు మార్చుకోమని సలహా ఇవ్వడంతోపాటు, ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడొద్దని హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. -
స్ట్రెచర్ ఇలా కూడా వాడొచ్చా..?
ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోగులను తరలించడానికి వినియోగించాల్సిన స్ట్రెచర్లను చెత్త ఎత్తివేయడానికి వినియోగిస్తున్నారు. స్థానిక సీహెచ్‌సీలో చెత్త డబ్బాలను సోమవారం ఉదయం ఇదిగో ఇలా స్ట్రెచర్‌పై తరలించారు. దాతలు ఎంతో సదుద్దేశంతో ఆస్పత్రికి అందజేసిన స్ట్రెచర్లను ఇలా చెత్త ఎత్తివేయడానికి వినియోగిస్తుండడంపై ప్రజలు, రోగుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆస్పత్రి సిబ్బంది తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. – ప్రత్తిపాడు -
‘అతి’ కారుల వినియోగం
రంపచోడవరం ఐటీడీఏలో నిబంధనలకు పాతర నిబంధనల మేరకు నడుచుకోవాల్సిన అధికారులే వాటికి తూట్లు పొడుస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టానుసారంగా వాహనాలను వినియోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అధికారులు అద్దెవాహనాలను వినియోగించాల్సి వస్తే క్యాబ్ రిజిస్ట్రేషన్ (పసుపురంగు నంబరు ప్లేటు) ఉన్న వాహనాలను మాత్రమే వినియోగించాలి. కానీ వారు సొంత రిజిస్ట్రేషన్ వాహనాల్లో ప్రభుత్వ డ్రైవర్లు వాడుకుంటున్నారు. నిబంధనల ప్రకారం అద్దె వాహనంలో ప్రభుత్వ డ్రైవర్లను వినియోగించరాదు. – రంపచోడవరం రంపచోడవరం ఐటీడీఏ ఏపీఓ జనరల్ పీవీఎస్ నాయుడు రంపచోడవరానికి చెందిన ఒకరి వాహనాన్ని అద్దె వాహనంగా వినియోగిస్తున్నారు. దానికి ఐటీడీఏలో పనిచేసే డ్రైవరును వినియోగించుకుంటున్నారు. వాస్తవానికి వాహనాన్ని అద్దెకు తీసుకుంటే ఆ యజమానే డ్రైవర్‌ను ఏర్పాటు చేయాలి. అయితే ఇక్కడ అలా జరగలేదు. వాహన యాజమాని ఏపీఓ సౌలభ్యం కోసం రెండు వాహనాలపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అంటూ పెద్దపెద్ద బోర్డులు పెట్టి అందుబాటులో ఉంచారు. అధికారులకు వాహనాలు ఏజెన్సీలో క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు ఏర్పాటు చేస్తారు. కానీ అధికారులు తమ సొంత పనులకు వాటిని వాడుకుంటున్నారు. దీని కోసం రెండు లాగ్ బుక్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సెలవుపై వెళ్లారు. అయితే డీడీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఏపీఓ జనరల్ డీడీ వాహనానికి సంబంధించి నెల రోజులు డిజీల్ను వినియోగించారు. అంతే కాదు తను వినియోగిస్తున్న అద్దె వాహనాన్ని కూడా వాడుకున్నారు. ఒక అధికారి నెలలో రెండు వాహనాల్లో ఎలా తిరుగుతారో ఐటీడీఏ ఉన్నతాధికారులకే తెలియాలి. అలాగే ఐకేపీ ఏపీఓ శ్రీనువాసుదొర కూడా తన సొంత కారును వాడుకుంటూ ఆ కారుకు మరొకని పేరుతో అద్దె తీసుకుంటున్నారు. సొంత వాహనాన్ని అద్దె కోసం వినియోగించాలంటే ఆర్టీఓ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ అలా అనుమతులేవీ తీసుకో లేదు. వాహనాలను వినియోగించే అధికారులు నెలలో ముందుగానే తమ టూర్డైరీని సంబంధిత ఉన్నతాధికారికి సమర్పించాలి. వాహనంలో తిరిగిన తరువాత కూడా టూర్‌డైరీ ఇవ్వాలి. ఇలాంటివి ఏవీ ఇక్కడ అమలు జరగడం లేదు. రంపచోడవరం కేంద్రంగా ఉన్న అనేక శాఖల ఉన్నతాధికారులు సొంత వాహనాలను వినియోగిస్తూ క్షేత్ర స్థాయిలో పరిశీలన లేకుండా తమ ఇంటి నుంచి కార్యాలయానికి రావడానికి వాడుకుంటున్నారు. వాటికి బిల్లులు చేసుకుంటున్నారు. నిర్వహణ లోపంతో షెడ్‌కు ఐటీడీఏ కార్యాలయానికి చెందిన అనేక వాహనాలు చిన్నపాటి మరమ్మతులతో షెడ్‌కు చేరుకుంటున్నాయి. వాటిని పట్టించుకోకపోవడంతో సుమారు 20 వరకు వాహనాలు తుప్పుపట్టి భూమిలో కలిసిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గిరిజన యువతకు ఏదీ ప్రోత్సాహం? ఐటీడీఏ గిరిజన యువతకు ›ట్రైకార్ ద్వారా వాహనాలను ఇస్తున్నారు. కానీ వాటిని ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె కోసం పెట్టుకోవడం లేదు. పర్సంటేజీలు ఇచ్చే వారికే ప్రాధాన్యత ఇవ్వడం దారుణం. వాహనాల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి. –పండా రామకృష్ణదొర, డివిజన్ సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు -
ఆన్లైన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ఖిలా వరంగల్ : రవాణ శాఖలో నూ తనంగా ప్రవేశపెట్టిన నగదు రహిత. ఆన్లైన్ సేవలను వాహనదారులు స ద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్(డీటీసీ) శివలింగయ్య పిలుపునిచ్చారు. వరంగల్ ఉప రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం నగదు రహిత సేవలను డీటీసీ శివలింగయ్య లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రవాణాశాఖలో ఇటీవల ప్రవేశపెట్టిన 57 రకాల ఆన్లైన్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. మీసేవ, ఈసేవా సెంటర్లలో బుకింగ్ చేసుకున్న వాహనదారులకు మాత్ర మే ఆర్టీఏ సేవలో అందించామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మీసేవ, ఈసేవా, వివిధ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ల నిర్వాహకులకు ఆన్లైన్ విధానాలపై ఇటీవల శిక్షణ శిబిరాలను ఏర్పా టు చేసి అవగాహన కల్పించామన్నారు. ఆర్టీఏ సేవలు పొందాలంటే ఆన్లైన్లో స్టాట్ బుకిం గ్ తప్పని సరిగా చేసుకోవాలన్నారు. స్టాట్ బుకింగ్ చేసి ప్రతి వాహనదారులు నిరే్ధశించిన తేదీన కార్యాలయానికి రావాలన్నారు. ప్రారంభం రోజు ఆన్లైన్లో కొన్ని ఇబ్బందులు తలెత్తగా వాటిని అధిగమించి వాహనదారులకు మేరుగైన సేవలు అందించామన్నారు. అదేవిధంగా జీరో కౌంట ర్ల వద్ద ఏలాంటి ఆర్ధిక లావాదేవీలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆన్లైన్లో తలెత్తే చిన్న చిన్న సమస్యలను వారం రోజుల్లో అధిగమిస్తామన్నారు. దూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చిన వాహనదారులకు ఆన్‌లైన్‌పై అవగాహన కల్పించామన్నారు. త్వరలోనే మండలాల వారిగా ప్రత్యేక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి ఆన్లైన్ సేవలు, రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఎంవీఐ లు సత్యనారాయణ, ఎల్.రాంచందర్, ఏఎంవీ ఐలు కవిత, రవికుమార్ పాల్గొన్నారు. -
పథకాలను అందిపుచ్చుకోవాలి
ఎస్సీ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ గుంటూరు వెస్ట్: ప్రభుత్వం దళితుల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధిని సాధించాలని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ వైస్‌ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ కోరారు. జిల్లా ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో గుంటూరులోని సన్నిధి కళ్యాణ మండపంలో యువస్ఫూర్తి సమ్మేళనం శనివారం జరిగింది. ఈసందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత చదువుకున్న దళిత యువతపై ఉందన్నారు. నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా అర్హులైన వారికి పథకాలను అందించేందుకు కృషి చేయాలని కోరారు. దళితులు మేథోబలం ద్వారా అభివృద్ధిని సాధించి జాతి ఉద్దరణకు పాటుపడాలని ఆయన కోరారు. అంబేద్కర్ జీవితంలోని పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. లక్ష్యం కోసం పనిచేస్తే ఉన్నతస్థానాలు.. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ దిశా కలిగి ఉండి ఒక లక్ష్యం కోసం కృషి చేస్తే యువత ఉన్నతస్థానాలకు ఎదగవచ్చన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగించుకోవాలని కోరారు. తొలుత బీఆర్ అంబేద్కర్, బాబూజగ్జీవన్‌రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ ఎం.కాలేబ్, డీఈఓ కేవీ శ్రీనివాసులరెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే.బాలాజీనాయక్, దళిత యువతీ, యువకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం దళిత సంఘాల నాయకులు, ఎన్జీఓ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నిరాశగా వెనుదిరిగిన యువకులు.. సమ్మేళనానికి వచ్చినవారికి ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రుణాలు అందిస్తారని ప్రచారం జోరుగా సాగింది. ఈవిధంగా చెప్పి తమను సమావేశానికి పంపించారని పలువురు యువకులు చర్చించుకోవడం కనిపించింది. ఇదే విషయాన్ని ఒకరిద్దరు యువకులు ఎం.డీ.విజయ్‌కుమార్ దృష్టికి తీసుకు వచ్చారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రుణాలు ఇస్తారని చెబితే ఇక్కడకు వచ్చామని చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు. తీరా ఇక్కడ అలాంటి ప్రతిపాదనలు కానీ, రుణాల ఊసే లేకపోయేసరికి యువకులు ఉస్సూరుమంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు. -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని వినియోగించుకోండి
కాకినాడ సిటీ : అక్టోబరు 5 నుంచి 15 వరకూ కాకినాడలో నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హెచ్‌అరుణ్‌కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సైనిక నియామక ర్యాలీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కాకినాడలో జరుగుతున్న రిక్రూట్మెంట్ ర్యాలీకి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 40 వేల మంది హాజరు అయ్యే అవకాశం ఉందని, ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపడుతుందని చెప్పారు. జిల్లాకు చెందిన గిరిజన యువత ఆర్మీకి ఎంపికయ్యేలా ఐటీడీఏ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. యువజన సంక్షేమశాఖ ద్వారా మైదాన యువతకు కూడా శిక్షణనిచ్చే యోచన ఉందన్నారు. అర్హతల ప్రకారం మాత్రమే ఎంపిక జరుగుతుందని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. చెన్నై ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రిక్రూట్మెంట్ జోన్ అధికారి బ్రిగేడియర్ ఎస్ఎన్ దాల్వి మాట్లాడుతూ ర్యాలీలో ఎంపికైన అభ్యర్థికి రూ.35 వేల వరకూ వేతనం ఉం టుందని చెప్పారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 19 లోపు గిగిగి.్జౌజీn జీnఛీజ్చీn్చటఝy.nజీఛి.జీn వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రిక్రూట్మెంట్ వివరాలు, అభ్యర్థుల శారీరక విద్యార్హతలు, ఎం పిక విధానం కూడా వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చన్నారు. -
ఎక్కువ కరెంటు వాడితే డబ్బులిస్తారు!
జర్మనీ: సాధారణంగా విద్యుత్ వినియోగించినందుకు గాను ప్రజలు ప్రభుత్వానికి కరెంటు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఒక్కోసారి కరెంటు ఎక్కువగా వాడకపోయినా లక్షలకొద్దీ తప్పుడు బిల్లులు రావడం చూశాం. కానీ అక్కడ మాత్రం విద్యుత్ అధికంగా వినియోగించండి... డబ్బులు సంపాదించండి అంటూ ప్రభుత్వమే ప్రజలను ప్రాధేయపడిందట. వింతగా ఉంది కదూ! సహజ విద్యుత్ ఉత్సత్తి సామర్థ్యంలో (35,900 మెగావాట్లతో) ప్రపంచంలోనే అగ్రభాగాన ఉన్న జర్మనీ... ప్రజలకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. విద్యుత్ ఎక్కువగా వినియోగించినవారికి మేమే డబ్బు చెల్లిస్తామంటూ ప్రకటనలు చేసింది. గతనెల్లో వాతావరణంలో వచ్చిన మార్పులు, ఎండ, గాలులతో జర్మనీలో విద్యుత్ పునరుత్సాదకత భారీగా పెరిగి, కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోని సౌర, పవన, జల, బయోమాస్ ప్లాంట్లలో విద్యుత్ 55GW నుంచి 63GW వరకూ... అంటే సుమారు 87 శాతం వరకూ ఉత్పత్తి పెరిగిపోయింది. దీంతో కొన్ని గంటలపాటు విద్యుత్ ధరలు ప్రతికూల పరిస్థితుల్లోకి చేరడంతో అత్యధిక విద్యుత్ వినియోగించినవారికి, వాణిజ్య వినియోగదారులకు ప్రభుత్వమే ఎదరు డబ్బు చెల్లించే పరిస్థితులు నెలకొన్నాయి. జర్మనీలో గత ఏడాది సగటున సునరుత్సాదకత 33 శాతం ఉన్నట్లు జర్మన్ క్లీన్ ఎనర్జీ థింక్ ట్యాంక్ 'అగోరా ఎనర్జీ వెండే' నివేదికలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం పవన విద్యుత్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. 2050 నాటికి వందశాతం ఉత్పాదకతను చేరుకునేందుకు జర్మనీ యోచిస్తుండగా... డెన్మార్క్ గాలి టర్బైన్లు ఇప్పటికే అత్యధిక విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ, మిగులు విద్యుత్ ను జర్మనీ నార్వే, స్వీడన్ లకు ఎగుమతి చేస్తోంది. కాగా.. జర్మనీలో ఏర్పడ్డ మిగులు విద్యుత్ అన్నది మంచి పరిణామం కాదని, ఈ విషయంలో సమయానికి ఇటు సరఫరాదారులు, అటు వినియోగదారులు ధరల సూచికపై స్పందించాల్సి వస్తుందని, లేదంటే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని నిపుణులు అంటున్నారు. పైగా గ్యాస్ పవర్ ప్లాంట్లు ఆఫ్ లైన్లో ఉన్నపుడు, న్యూక్లియర్, లోకల్ ప్లాంట్లు మూసే వీలుండకపోవడంతో వాటిని గంటల తరబడి కొనసాగించాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో వారు విద్యుత్తుకు డబ్బు చెల్లించాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రిఫైనరీలు, కర్మాగారాలు వంటి పారిశ్రామిక వినియోగదారులు మాత్రం విద్యుత్ ను వాడుకొని డబ్బు సంపాదించగల్గుతున్నారని చెప్తున్నారు. -
అవి.. ఎప్పుడూ, ఎక్కడా వాడకూడదు!
న్యూఢిల్లీః కంప్యూటర్ల కాలంలో పాస్ వర్డ్స్ కు ప్రాధాన్యత భారీ పెరిగిపోయింది. ఎటువంటి వ్యక్తిగత వివరాలను భద్రపరుచుకోవాలన్నా అందుకు పాస్ వర్డ్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి. అందుకే పెట్టుకున్న పాస్ వర్డ్ ఎవ్వరికీ తెలియకుండా కూడ చూసుకోవాలి. బ్యాంకులు, ఇతర వ్యాపార సంస్థలు పాస్ వర్డ్ వివరాలు ఎవ్వరికీ షేర్ చేయొద్దంటూ ఒక్కోసారి హెచ్చరికలు కూడ జారీ చేస్తుంటాయి. అంతటి ప్రాధాన్యత ఉన్న పాస్ వర్డ్స్ కు కూడ ఒక 'డే' ఉందని మీకు తెలుసా? 'పాస్ వర్డ్స్ డే' సందర్భంగా సైబర్ భద్రతా నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలోనూ, డిజిటల్ జీవితంలోనూ కూడ ముఖ్యమైన విషయాలు కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. భద్రతా, గోప్యతా వంటి విషయాలు పాటించడాన్ని అశ్రద్ధ చేస్తే ఒక్కోసారి ఎన్నో నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా పాస్ వర్డ్స్ విషయంలో అటువంటి భద్రత, గోప్యత ఎంతో అవసరం. కానీ ఈ విషయంలో చాలా మంది విఫలం అవుతుంటారు. సులభంగా గుర్తుండేదో, వరుస నెంబర్లో, స్వంత పేర్లనో వాడేస్తుంటారు. కానీ పాస్ వర్డ్ క్రియేట్ చేసుకునేవారు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. పాస్ వర్డ్ కొత్తగా పెట్టుకునేవారు పదాలు, అక్షరాల్లో తప్పనిసరిగా కొన్ని సంఖ్యలను కలసి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సొంత పేర్లు, పుట్టిన తేదీలు, ఇంతకు ముందు వాడిన పేర్లు, కారు నెంబర్లు వంటివి ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్ వర్డ్స్ గా వాడొద్దని సలహా ఇస్తున్నారు. అంతేకాదు ఇతరులు ఊహించగలిగే పదాలు, సంఖ్యలను కూడ వాడకూడదు. 123456 వంటి పాస్ వర్డ్స్ సైబర్ నేరగాళ్ళు ఈజీగా ఊహించగల్గుతారని, సామాజిక మాధ్యమాల ఆధారంగా వాటిని చోరాసురులు టార్గెట్ చేస్తారని చెప్తున్నారు. పాస్ వర్డ్స్ లో కొన్నిసార్లు వారిచ్చే ప్రశ్నలకు సులభమైన సమాధానాలు ఇవ్వడంతో కూడ వ్యక్తిగత డేటాను చోరీ చేయగల్గుతారని భద్రతా సంస్థలు చెప్తున్నాయి. అంతేకాక వెబ్ ప్రపంచంలో ఏదో ఒక ఆధారంతో ఆయా వివరాలను తెలుసుకోగల్గుతారని, తరచుగా పాస్ వర్డ్స్ మార్చుకుంటుండటం వల్ల హ్యాక్ చేసే అవకాశం ఉండదని చెప్తున్నారు. ముఖ్యంగా ఒకే పాస్ వర్డ్ ను అన్ని వెబ్ సైట్లలో వాడటం మానుకోవాలని చెప్తున్నారు. హ్యాకర్స్ , సైబర్ క్రమినల్స్ ఆట కట్టించాలంటే ఎవరికి వారు పాస్ వర్డ్స్ విషయంలో శ్రద్ధతోపాటు, జాగ్రత్తలు వహించాలని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడంవల్ల సైబర్ నేరాలను అరికట్టేందుకు అధికారులకు సహకరించినవారవుతారని అంటున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో వాడేందుకు పనికిరాని, వాడ కూడని 25 చెత్త పాస్ వర్డ్స్ జాబితాను కూడ.. పాస్ వర్డ్స్ డే సందర్భంగా సైబర్ భద్రతా నిపుణులు వెల్లడించారు. అవేమిటో చూద్దాం... -
ఓటు హక్కు వినియోగంతోనే లక్ష్య సిద్ధి
‘ఓటు కోసం నడక’లో డీఆర్వో నాగబాబు గుంటూరు ఈస్ట్: ప్రతి ఒక్కరూ నిర్భయంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందని డీఆర్వో నాగబాబు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం ఁఓటు కోసం నడక* నిర్వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, అదనపు ఎస్పీలు రామాంజనేయులు, భాస్కరరావు, ఆర్డీవో భాస్కర్ నాయుడు, ఎస్బీ డీఎస్పీ రామాంజనేయులు, పలు శాఖల జిల్లా అధికారులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆర్డీవో నాగబాబు జెండా ఊపి ప్రారంభించిన నడక పోలీసు పరేడ్ గ్రౌండ్ నుంచి పాత బస్టాండ్ సెంటర్లోని ఉర్దూ పాఠశాల వరకు సాగింది. పలు నినాదాలతో కూడిన ప్లకార్డులను దారిపొడవునా ప్రదర్శించారు. ఓటు హక్కు విలువను తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో నాగబాబు మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. 18 ఏళ్లు నిండినవారందరూ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ప్రపంచంలోనే పెద్దదైన మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పెద్ద పండుగని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వేసి దేశ భవిష్యత్తును గొప్పగా మార్చాలని కోరారు. ఆర్డీవో భాస్కర్ నాయకుడు మాట్లాడుతూ దేశంలోని ఎన్నికల ప్రక్రియ భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తుందని చెప్పారు. -
ఆపదలో ఆదుకునే వాచీ!
ఈ వాచీ టైం చూసుకోవడానికే కాదు. అదృష్టం బాలేక కిడ్నాపర్ల చేతిలో పడితే, ఈ వాచీ ఉంటే సులభంగా బయటపడవచ్చు. అందుకు వీలుగా దృఢమైన ప్లాస్టిక్ తాడు, చిన్నపాటి బ్లేడు ఇతర వస్తువులు వాచీ పట్టీ లోపలివైపు ఎవరికీ తెలియకుండా దాచుకోవచ్చు. దాంతో దుండగుల బారి నుంచి రక్షించుకోవచ్చునని ఈ వాచీని డిజైన్ చేసిన గేర్వార్డ్ అనే కంపెనీ చెబుతోంది. ఏకే బ్యాండ్ పేరుతో మార్కెట్ చేస్తున్న ఈ వాచీ ఖరీదు 20 డాలర్లు మాత్రమే. మన కరెన్సీలో అయితే సుమారు 1,200 రూపాయలు.