ఆన్‌లైన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
Published Wed, Aug 3 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
ఖిలా వరంగల్ : రవాణ శాఖలో నూ తనంగా ప్రవేశపెట్టిన నగదు రహిత. ఆన్‌లైన్ సేవలను వాహనదారులు స ద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్(డీటీసీ) శివలింగయ్య పిలుపునిచ్చారు. వరంగల్ ఉప రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం నగదు రహిత సేవలను డీటీసీ శివలింగయ్య లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రవాణాశాఖలో ఇటీవల ప్రవేశపెట్టిన 57 రకాల ఆన్‌లైన్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. మీసేవ, ఈసేవా సెంటర్లలో బుకింగ్ చేసుకున్న వాహనదారులకు మాత్ర మే ఆర్టీఏ సేవలో అందించామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మీసేవ, ఈసేవా, వివిధ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ల నిర్వాహకులకు ఆన్‌లైన్ విధానాలపై ఇటీవల శిక్షణ శిబిరాలను ఏర్పా టు చేసి అవగాహన కల్పించామన్నారు. ఆర్టీఏ సేవలు పొందాలంటే ఆన్‌లైన్‌లో స్టాట్ బుకిం గ్ తప్పని సరిగా చేసుకోవాలన్నారు. స్టాట్ బుకింగ్ చేసి ప్రతి వాహనదారులు నిరే్ధశించిన తేదీన కార్యాలయానికి రావాలన్నారు. ప్రారంభం రోజు ఆన్‌లైన్‌లో కొన్ని ఇబ్బందులు తలెత్తగా వాటిని అధిగమించి వాహనదారులకు మేరుగైన సేవలు అందించామన్నారు. అదేవిధంగా జీరో కౌంట ర్ల వద్ద ఏలాంటి ఆర్ధిక లావాదేవీలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో తలెత్తే చిన్న చిన్న సమస్యలను వారం రోజుల్లో అధిగమిస్తామన్నారు. దూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చిన వాహనదారులకు ఆన్‌లైన్‌పై అవగాహన కల్పించామన్నారు. త్వరలోనే మండలాల వారిగా ప్రత్యేక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి ఆన్‌లైన్ సేవలు, రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఎంవీఐ లు సత్యనారాయణ, ఎల్.రాంచందర్, ఏఎంవీ ఐలు కవిత, రవికుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement