పిడుగులు పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించకూడదని చాలామంది అంటుంటారు. ఆ సమయంలో ఫోన్లను వినియోగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయని కూడా చెబుతారు. ఇదేవిధంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాతావరణంలో ఇంటర్నెట్ వాడకూడదని కూడా అంటుంటారు. దీనివెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొబైల్ ఫోన్లు విద్యుత్తును ఆకర్షిస్తాయని, మెరుపు మెరిసినప్పుడు దానిలోని విద్యుత్ శక్తిని ఫోన్ తన వైపుకు ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. ఫలితంగా ఇంటిపై పిడుగు పడే అవకాశాలుంటాయని చెబుతారు. దీని వెనుక ఉన్న లాజిక్ గురించి కొందరు ఏమంటారంటే.. మెరుపులోని విద్యుత్ ఫోన్‌టవర్ ద్వారా మీ ఫోనును చేరుకుంటుందని అంటుంటారు. తుఫాను సమయంలో మెరుపులు, పిడుగులలోని విద్యుత్ ఫోన్‌కు చేరుకుని అది పేలవచ్చని, లేదా ఇంటిపై పిడుగులు పడవచ్చని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో, నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ కోసం రేడియో తరంగాలను, ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ వేవ్స్ ను స్వీకరిస్తాయి. ఈ తరంగాల గుండా విద్యుత్ ఎప్పుడూ ప్రవహించదు. అంటే ఈ రేడియో తరంగాల ద్వారా విద్యుత్తు మీ ఫోన్‌కు ఎప్పటికీ చేరదు. మొత్తంగా చూస్తే పిడుగుపాటు సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదనేది కేవలం భ్రమ మాత్రమేనని చెప్పవచ్చు. ఎవరైనా తుఫాను సమయంలో కూడా మొబైల్ ఫోన్‌ను నిరభ్యరంతరంగా ఉపయోగించవచ్చు. అయితే వైర్డ్ టెలిఫోన్ విషయంలో కొంతమేరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ‘ఓం’పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం?
Comments
Please login to add a commentAdd a comment