ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు ఉచిత శిక్షణ | army recruitment training | Sakshi
Sakshi News home page

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు ఉచిత శిక్షణ

Published Fri, Aug 19 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

మాట్లాడుతున్న మూర్తి

మాట్లాడుతున్న మూర్తి

  • సెట్‌శ్రీ సీఈఓ మూర్తి
  • శ్రీకాకుళం న్యూకాలనీ: సెట్‌శ్రీ ద్వారా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు ఉచిత శిక్షణ అందించనున్నట్టు సెట్‌శ్రీ సీఈఓ వీవీఆర్‌ఎస్‌ మూర్తి తెలిపారు. గురువారం సెట్‌శ్రీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబరు 5 నుంచి 15వ తేదీ వరకు కాకినాడలో నిర్వహించే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొనే  జిల్లా యువతకు శిక్షణ అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్‌ పి.లక్ష్మీనరసింహం ఆదేశాల మేరకు ముందస్తుగా ఉచిత ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణను నిర్వహించేందుకుగాను ఎంపిక కార్యక్రమం చేపడుతున్నట్టు వెల్లడించారు. ఎంపికలకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హతలు, ఆదాయ, కుల ధ్రువపత్రాల ఒరిజినల్స్‌తోపాటు ఒక జత జిరాక్స్‌లు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకురావాలని సూచించారు.
     
    ఎంపికైన యువకులకు శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌లో 30 రోజులపాటు ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. ఈనెల 22, 23, 24వ తేదీల్లో వరుసగా టెక్కలి, శ్రీకాకుళం, పాలకొండ రెవెన్యూ పరిధిల్లో ఉదయం 9 గంటలకు ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 08942–240601 ఫోన్‌నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, సెట్‌శ్రీ కార్యాలయ మేనేజర్‌ ప్రసాదరావు, డివిజనల్‌ పీఆర్‌ఓ లక్ష్మీకాంతం పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement