గిరిజన యువతకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ | artmy recruitement for tribals | Sakshi
Sakshi News home page

గిరిజన యువతకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ

Published Tue, Jul 26 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

artmy recruitement for tribals

 
పాడేరు: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ట్రైకార్, ఐటీడీఏల ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువకులకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కోసం శిక్షణకు ఈనెల 27న పాడేరు (కుమ్మరిపుట్టు వైటీసీ)లో, 28న చింతపల్లి వైటీసీలో ఎంపిక నిర్వహిస్తున్నట్టు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం.హరినారాయణన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్‌ ఉత్తీర్ణులై 19 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు కలిగి ఎత్తు 180 సెంటీమీటర్లు, ఛాతి 85 సెంటీమీటర్లు, బరువు 55 కిలోలు పైబడి ఉన్నవారు అర్హులని తెలిపారు. ఈ శిక్షణ పొందగోరే అర్హులైన గిరిజన అభ్యర్థులు తమ విద్యార్హత, ఆధార్, రేషన్‌ ధ్రువపత్రాలు, కలర్‌ ఫొటోలు 2 తీసుకొని ఎంపికకు హాజరుకావాలన్నారు.  ఎంపికైన అభ్యర్థులకు శంషాబాద్‌ రక్ష అకాడమీలో 60 రోజులు ఉచిత శిక్షణ, భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పూర్తి సమాచారానికి 9491070295 నంబరులో సంప్రదించాలని సూచించారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement