
డ్వాక్రా మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు.
సాక్షి, ఖమ్మం జిల్లా: డ్వాక్రా మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. త్వరలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయనున్నట్లు మధిర మండలం రొంపిమల్ల రోడ్డు శంకుస్థాపన సభలో ఆయన వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని పేర్కొన్నారు.