ప్రజాపాలన సభలో దరఖాస్తుదారులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం: ఆత్మగౌరవంతో సాధించుకున్న తెలంగాణను ధనిక రాష్ట్రంగా సోనియా గాంధీ అప్పగిస్తే గత పాలకులు రూ.లక్షల కోట్ల అప్పులు మిగి ల్చారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. అయినప్పటికీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రజల కోసం పార్టీలకతీతంగా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపా డులో శనివారం జరిగిన ప్రజాపాలన సభలో ఆయ న మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన రోజునే మహిళలకు ఉచిత బస్సుప్ర యాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడం ద్వారా రెండు గ్యారంటీలను అమలు చేసిందని తెలిపారు. అయితే, కొందరు ఆరు గ్యారంటీలు అమలు కాకుంటే బాగుండాలని కోరుకుంటున్నా.. వారి కోరిక నెరవేరదని బీఆర్‌ఎస్ నాయకులను ఉద్దేశించి భట్టి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ ఉండదని చెబుతూ, కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా అని బీఆర్‌ఎస్ అడిగితే ప్రజలు మాత్రం కరెంట్‌తో పాటు కాంగ్రెస్ కూడా కావాలని తీర్పునిచ్చారని అన్నారు.
ఎన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తామని తెలిపారు. పదేళ్లు పాలించిన వారు నెల కాక ముందే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలకులు ఎన్ని అప్పులు చేశారు, రాష్ట్రాన్ని ఎలా తాకట్టు పెట్టారో చెప్పేందుకే శ్వేత పత్రాలను విడుదల చేశామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వం ఉద్యోగులకు 20వ తేదీ వరకు జీతా లు ఇవ్వలేదని, తాము 5వ తేదీలోపు ఇచ్చామని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని భట్టి వెల్లడించారు.
విద్యుత్ రంగంపై రూ.లక్ష కోట్లు అప్పుల భారం ఉన్నా 24 గంటల కరెంట్ ఇస్తామని, ప్రతీ మండలంలో అత్యున్నతస్థాయి పాఠశాలలు ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు. అనంతరం మామునూరులోని తాగునీటి ప్రాజెక్టు వద్ద మిషన్ భగీరథ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాల్లో కలెక్టర్ గౌతమ్, సీపీ సునీల్‌దత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment