ఆ ఎంపీ సీటుపై అయోమయం.. ముగ్గురు మంత్రుల ‘సై’ | Congress High Command Waits On Khammam MP Seatte | Sakshi
Sakshi News home page

ఆ ఎంపీ సీటుపై అయోమయం.. ముగ్గురు మంత్రుల ‘సై’

Published Tue, Mar 12 2024 7:08 PM | Last Updated on Tue, Mar 12 2024 7:31 PM

Congress High Command Waits On Khammam MP Seatte - Sakshi

కాంగ్రెస్ అధిష్టానంకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక సవాల్‌గా మారిందా?.. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు చెందిన సంబంధికులు సీరియస్‌గా టికెట్ ట్రై చేస్తూ ఉండటంతో ఎవరికి ఇవ్వాలో తెలియక అయోమయ స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందా?.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు  ఏ పార్లమెంటు సెగ్మెంట్‌లో లేని పోటి అక్కడే ఉండటానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయా?...కాంగ్రెస్‌కు కొంత తలనొప్పులు తెచ్చిపెడుతున్న ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 17 స్థానాలలో మిగత 13చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే 13 స్థానాలల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ తలనోప్పిగా మారింది మాత్రం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపికననే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయాలు అన్నిఇన్ని కావు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయలంతా ఖమ్మం చుట్టే తిరిగాయని చెప్పాలి.

ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పాలిటిక్స్ ఖమ్మం వైపే టర్న్ అయ్యాయనే చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకే మళ్లీ టికెట్ ప్రకటించింది...అయితే బీఆర్ఎస్ లో పెద్దగా పోటి లేకపోవడంతో మళ్లీ నామా కే టికెట్ ఇచ్చారు.. కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్థితితి లేదు. టికెట్ కోసం తీవ్రమైన పోటి ఉండటంతో కొత్త కొత్త ఈక్వేషన్స్ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ముగ్గురు మంత్రులు సై అంటే సై అంటున్నారు. బయటకు కనిపించకపోయిన టికెట్ ఎపిసోడ్ లో లోలోపల కత్తులు దూసుకుంటున్నారన్న ప్రచారం నడుస్తుంది.

ఖమ్మం పార్లమెంట్ టికెట్‌ను ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు పోటి పడుతున్నారు. ఎవరికి వారు తగ్గేదేలేదన్నట్లు టికెట్ కోసం పట్టుపడుతూ ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లలు పడుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానంను కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కీలకంగా పనిచేసిన కారణంగా పార్లమెంట్ టికెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉన్న సమయంలో పొంగులేటి చేరికతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ లో జోష్ పెరిగిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి...కేసీఆర్ పై తీవ్రస్తాయిలో విమర్శలు చేస్తు దూకుడు గా ముందుకు వెళ్లారు పొంగులేటి...పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క స్థానంలో కూడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలవనియ్యను. అసెంబ్లీ గేటు తాకనివ్వను అని పొంగులేటి చేసిన శపథం పెద్ద సంచనలనానికే దారీతీసింది. ఎవరినా కదిలించిన పొంగులేటి శపథంపైనే చర్చ జరిగింది. దీంతో గత ఈక్వేషన్స్ ను లెక్కలోకి తీసుకోని టికెట్ తన సోదరుడుకి ఇవ్వాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నారు.

మరోవైపు డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్కమార్క సతీమణి మల్లు నందిని సైతం తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు దీంతో భట్టి విక్కమార్క సైతం తన సతీమణికి టికెట్ ఇప్పించేందుకు అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక కీలకంగా తను పనిచేశానని చెప్పుకుంటు భట్టి విక్కమార్క సైతం టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా చర్చ నడుస్తుంది. అటు మల్లు నందిని సైతం పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వారికే అధిష్టానం ప్రయార్టీ ఇస్తుందనే దీమాతో ఉన్నారు. టికెట్ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు.

ఇక జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కొడుకు తుమ్మల యుగేంధర్ సైతం కమ్మ కోటాలో టికెట్ కోసం ట్రై చేస్తున్నారు..తెరవెనుక చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కమ్మ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు టర్న్ అవ్వడంలో తుమ్మల కీలకంగా వ్యవహరించారన్న ఈక్వేషన్స్ తో వారు కూడ రేసులో ముందు వరుసలో ఉన్నామంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ముగ్గురు మంత్రులు పనిచేశారు...గ్రూపు పాలిటిక్స్ ను పక్కనే పెట్టి అంత ఒక్కటిగా ముందుకు వెళ్లడంతో ఫలితాలు సైతం కాంగ్రెస్‌కు అనుకులంగా వచ్చాయి. సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలకొచ్చేసరికి ఈక్వేషన్స్ మారిపోయాయి. ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు టికెట్ కోసం పోటి పడుతుండటంతో లెక్కలు తప్పుతున్నాయి..ప్రస్తుతం పైకి అందరు కలిసి ఉన్నట్లు కనిపిస్తున్న టికెట్ విషయంలో చాలా సీరియస్‌గా ఎవరికి వారు వారి వారి రూట్లలో ప్రయత్నాలు చేస్తున్నారు.

తమకు వస్తదంటే తమకు వస్తుందని ముగ్గురు దీమాతో ఉన్నారు. ముగ్గురు సీనియర్ నేతలు కావడంతో ముగ్గురు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ముగ్గురులో అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందన్న ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎ పార్లమెంట్ స్థానంకు ఇంత తీవ్రస్తాయిలో పోటి లేదనే చెప్పాలి...అయితే ఒక మంత్రికి సంబంధించిన వారికి టికెట్ ఇస్తే మిగత ఇద్దరు మంత్రులు వారికి సపోర్ట్ చేస్తారా లేదా అన్న ఆసక్తికర చర్చ సైతం నడుస్తుంది. వాస్తవానికి ఖమ్మం పార్లమెంట్ స్థానంకు మొదట నలుగురు మద్య పోటి ఉండేది. కానీ ఇందులో రేణుక చౌదరికి రాజ్యసభ ఖారారు చేయడంతో కొంత పోటి తగ్గింది అది మూడుకు చేరింది.

చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానంకే సవాల్‌గా మారిన ఖమ్మం పార్లమెంట్ ఎంపిక విషయంలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement