టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) జాగ్వార్ ఎక్స్‌జే మోడల్‌లో స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. జాగ్వార్ ఎక్స్‌జే మోడల్ మార్కెట్లోకి వచ్చి 50 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్పెషల్ ఎడిషన్, జాగ్వార్ ఎక్స్‌జే50ను అందిస్తున్నట్లు జేఎల్‌ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి తెలిపారు.
ఈ కారు ధర రూ.1.11 కోట్లని పేర్కొన్నారు. 3 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు కోసమే ప్రత్యేకంగా 19– అంగుళాల అలాయ్ వీల్స్‌ను రూపొందించామని చెప్పారాయన. వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవటానికి 6.2 సెకన్లు చాలని... ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. అని పేర్కొన్నారు. ఈ కారులో ఎయిట్– స్పీడ్ జెడ్‌ఎఫ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, తదితర ప్రత్యేకతలున్నాయి.
జాగ్వార్ ఎక్స్‌జేలో స్పెషల్ ఎడిషన్
Published Tue, Dec 4 2018 1:45 AM | Last Updated on Tue, Dec 4 2018 1:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment