gear
-
విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని.. 3 గంటల ప్రయాణం
విమాన ప్రయానం అంటే ప్రయాణికులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు క్షుణంగా పరిశీలిస్తారు. అయితే తాజాగా ఓ వ్యక్తి విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఏకంగా మూడు గంటల ప్రయాణం చేశాడు. విమానం మరో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా ఆ వ్యక్తిని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చదవండి: Thailand Monkey Festival: ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ! అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ గేర్‌లో సదరు వ్యక్తి దాక్కున్నాడు. విమానం గాటిమాలా నుంచి మియామి ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. అక్కడ విమానం ల్యాండైన అనంతరం అతన్ని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకొని ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. మూడు గంటలపాటు విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ప్రయాణించినా.. ఈ వ్యక్తికి ఎటువంటి గాయాలూ కాలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. This man arrived to MIA in the landing gear of plane from a Guatemala flight. The flight was about two hours and thirty minutes and witness says he was unharmed😳✈️| #ONLYinDADE pic.twitter.com/qMPP5jjDvb — ONLY in DADE (@ONLYinDADE) November 27, 2021 -
జాగ్వార్ ఎక్స్‌జేలో స్పెషల్ ఎడిషన్
టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) జాగ్వార్ ఎక్స్‌జే మోడల్లో స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. జాగ్వార్ ఎక్స్‌జే మోడల్ మార్కెట్లోకి వచ్చి 50 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్పెషల్ ఎడిషన్, జాగ్వార్ ఎక్స్‌జే50ను అందిస్తున్నట్లు జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి తెలిపారు. ఈ కారు ధర రూ.1.11 కోట్లని పేర్కొన్నారు. 3 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు కోసమే ప్రత్యేకంగా 19– అంగుళాల అలాయ్ వీల్స్‌ను రూపొందించామని చెప్పారాయన. వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవటానికి 6.2 సెకన్లు చాలని... ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. అని పేర్కొన్నారు. ఈ కారులో ఎయిట్– స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, తదితర ప్రత్యేకతలున్నాయి. -
ఆర్టీసీ బస్సుల్లో ఇక గేర్లు ఉండవ్!
సాక్షి, హైదరాబాద్: గుంతల మయమైన రోడ్లు.. పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్.. మెట్రోరైలు నిర్మాణ పనులు.. ఇరుకు రోడ్లు... ఇన్ని ఇబ్బందుల మధ్య బస్సు నడపటం డ్రైవర్లకు కత్తిమీద సామే. చీటికి మాటికి గేర్లు మార్చాల్సి రావటం, క్లచ్ వినియోగం పెద్ద చికాకు వ్యవహారం. ఆర్టీసీ డ్రైవర్ల సహనానికి ఇది పెద్ద పరీక్ష. ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మధ్య ఈ పరీక్షను ఎదుర్కోవడం డ్రైవర్లకు పెద్ద సవాల్‌గా మారింది. ఎడాపెడా గేర్, క్లచ్ వినియోగంతో పరికరాలు పాడై ఎక్కడపడితే అక్కడ నిలిచిపోవటం నిత్యకృత్యంగా మారుతోంది. దీనికి విరుగుడుగా ఇప్పుడు గేర్ లేని (ఆటో ట్రాన్స్మిషన్) బస్సులపై ఆర్టీసీ దృష్టి సారించింది. ఇకపై హైదరాబాద్‌లో కొత్తగా ప్రవేశపెట్టే బస్సుల్లో గేర్ లేని డిజైన్వే కొనాలని నిర్ణయించింది. త్వరలో రోడ్లపైకి ఇలాంటి 160 బస్సులు రాబోతున్నాయి. ఆ బస్సులతో పడలేక... పెరుగుతున్న ట్రాఫిక్, ఇరుకుగా మారుతున్న రోడ్లపై బస్సులు నడిపేందుకు పెద్ద సమస్యగా మారింది. దీంతో డ్రైవర్లు చాలాకాలంగా గగ్గోలు పెడుతున్నారు. చాలామంది డ్రైవర్లు హైదరాబాద్ కన్నా జిల్లాల్లో పనిచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. రోడ్లు గుంతలమయంగా మారటంతో ప్రమాదాలు తీవ్రమయ్యాయి. దీంతో ఆర్టీసీ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కూడా పీడకలగా మారుతోంది. దాదాపు 20 శాతం బస్సులు కాలం చెల్లినవే కావటంతో వాటిని నడిపేవారు మరీ ఆందోళన చెందుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని డ్రైవర్లపై ఒత్తిడి తగ్గించేందుకు గేర్లు లేని బస్సులను అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం నడుస్తున్న ఏసీ బస్సులు, లో ఫ్లోర్ బస్సులు క్లచ్‌తో అవసరం లేనివే. ఇవి ప్రయోజనకరంగా ఉన్నాయని వాటి డ్రైవర్లు చెబుతున్నారు. తొలుత హైదరాబాద్‌లో ప్రవేశపెట్టినా.. త్వరలోనే జిల్లాల్లో నడిపేందుకు కూడా ఈ నమూనావే కొనాలని నిర్ణయించారు. కాగా, గేర్‌బాక్స్ అవసరం లేని నమూనాపై ఆర్టీసీకి ఓ విదేశీ కంపెనీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. మైలేజీ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చింది. ఇప్పుడున్న బస్సులను ఆ పద్ధతిలోకి మార్చే అంశాన్ని కంపెనీ ముందుంచగా అది సులభం కాదని పేర్కొంది. డ్రైవర్‌పై భారం తగ్గుతుంది గేర్ బాక్సులేని ఆటో ట్రాన్స్మిషన్ నమూనా బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ఇది డ్రైవర్లపై ఒత్తిడి తగ్గిస్తుంది. ఫలితంగా మరింత భద్రంగా బస్సును నడిపేందుకు అవకాశం లభిస్తుంది. ప్రమాదాలను తగ్గించటమే కాకుండా కుదుపులేని ప్రయాణంతో ప్రయాణికులకూ ఊరట కలుగుతుంది. – ఆర్టీసీ ఎండీ రమణారావు -
భారీ వర్షాలు.. ట్రాఫిక్ కష్టాలు
-
భారీ వర్షాలు.. ట్రాఫిక్ కష్టాలు
న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు ముంచెత్తాయి. నగరంలో ఉదయం ఎడ తెరపి లేకుండా కురిసన వర్షానికి రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై కిలోమీటర్లమేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రయాణీకులు కష్టాల్లో చిక్కుకున్నారు. ఢిల్లీ నగరాన్ని భారీ వర్షాలు కుదిపేశాయి. ఉధృతంగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. వర్షం దెబ్బకు ఢిల్లీ ప్రజలు ట్రాఫిక్ కష్టాల్లో చిక్కుకున్నారు. ఉదయం ఆఫీసులకు, స్కూళ్ళకు వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్ళలోకి వచ్చేయడంతో నగరవాసులు తీవ్ర కష్టాలు పడ్డారు. అశోక్ విహార్, జసోలా, ఓక్లా, ఐఐటీ గేట్, పహర్‌గంజ్ రోడ్, సరై కలే ఖాన్ నుంచి డీఎన్డీ కి వెళ్ళే రింగ్ రోడ్, సరితా విహార్, డిఫెన్స్ కాలనీ, ఐఎన్ఏ, రాజ్ ఘాట్ నుంచి ఐటీవో వైపు వెళ్ళే మార్గం, అరబిందో మార్గ్, ఆనంద్ విహార్, వజిర్బాద్ ప్రాంతాలు వర్షానికి పూర్తిగా నీటితో నిండిపోయాయి. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు మోటారిస్టులకు ఇబ్బందులు కలగకుండా ఇతర మార్గాల్లోకి తరలించారు. పాలం అబ్జర్వేటరీ రికార్డుల ప్రకారం ఉదయం 8.30 వరకూ సుమారు 43.4 సెంటీమీటర్ల వర్షం పడగా 41.66 సెంటీమీటర్లు రికార్డ్ అయినట్లు మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. ఈ కాలంలో నగరంలో ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రత కన్నా మూడు డిగ్రీలు తక్కువగా ఉండి 24.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. రోజంతా వర్షంకొనసాగితే ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. అలాగే అత్యధిక ఉష్ణోగ్రత 31 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.