విమాన ప్రయానం అంటే ప్రయాణికులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు క్షుణంగా పరిశీలిస్తారు. అయితే తాజాగా ఓ వ్యక్తి విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఏకంగా మూడు గంటల ప్రయాణం చేశాడు. విమానం మరో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా ఆ వ్యక్తిని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
చదవండి: Thailand Monkey Festival: ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ!
అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ల్యాండింగ్ గేర్‌లో సదరు వ్యక్తి దాక్కున్నాడు. విమానం గాటిమాలా నుంచి మియామి ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. అక్కడ విమానం ల్యాండైన అనంతరం అతన్ని ఎయిర్‌పోర్టు అధికారులు పట్టుకొని ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. మూడు గంటలపాటు విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ప్రయాణించినా.. ఈ వ్యక్తికి ఎటువంటి గాయాలూ కాలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
This man arrived to MIA in the landing gear of plane from a Guatemala flight. The flight was about two hours and thirty minutes and witness says he was unharmed😳✈️| #ONLYinDADE pic.twitter.com/qMPP5jjDvb
— ONLY in DADE (@ONLYinDADE) November 27, 2021
Comments
Please login to add a commentAdd a comment