
టాటా మోటార్స్ అంతర్జాతీయ వాహన విక్రయాలు 11% అప్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అంతర్జాతీయ వాహన విక్రయాలు మార్చి నెలలో వృద్ధి చెందాయి. జాగ్వార్ లాండ్ రోవర్(జేఎల్‌ఆర్)తో సహా గ్లోబల్ వాహన విక్రయాలు 11% వృద్ధితో 1,18,750 యూనిట్లకు పెరిగాయని కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే నెలలో కంపెనీ వాహన విక్రయాలు 1,06,595 యూనిట్లుగా ఉన్నాయని టాటా మోటార్స్ బీఎస్‌ఈకి నివేదించింది. ఇక ప్యాసెంజర్ వాహన విక్రయాలు 8% వృద్ధితో 68,109 యూనిట్ల నుంచి 73,515 యూనిట్లకు పెరిగాయని తెలిపింది. లగ్జరీ బ్రాండ్ జేఎల్‌ఆర్ వాహన విక్రయాలు 22 శాతం వృద్ధితో 52,736 యూనిట్ల నుంచి 64,579 యూనిట్లకు ఎగశాయని పేర్కొంది.