రేంజ్‌ రోవర్‌ వెలార్‌  | Jaguar Land Rover Launches Made-In-India Range Rover Velar; Prices Start At ₹ 72.47 Lakh | Sakshi
Sakshi News home page

రేంజ్‌ రోవర్‌ వెలార్‌ 

Published Wed, May 8 2019 12:52 AM | Last Updated on Wed, May 8 2019 12:52 AM

Jaguar Land Rover Launches Made-In-India Range Rover Velar; Prices Start At ₹ 72.47 Lakh  - Sakshi

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌).. భారత్‌లోనే ఉత్పత్తి అయిన ‘రేంజ్‌ రోవర్‌ వెలార్‌’ అమ్మకాలను మంగళవారం నుంచి ప్రారంభించింది. ఇక్కడే ఉత్పత్తి పూర్తిచేయడం వల్ల ఈ కారు ధర 15–20% మేర తగ్గినట్లు కంపెనీ ప్రకటించింది. భారత లగ్జరీ ఎస్‌యూవీ మార్కెట్లో గట్టి పోటీనివ్వడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. సింగిల్‌ ట్రిమ్, ఆర్‌ డైనమిక్‌– ఎస్‌ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్‌.. పెట్రోల్, డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లలో లభ్యమవుతోంది. ఈ కారు ప్రారంభ ధర రూ.72.47 లక్షలుగా (ఎక్స్‌షోరూం–ఢిల్లీ) కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్‌ సూరి మాట్లాడుతూ.. ‘2018 నుంచి ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విక్రయిస్తున్నాం. దేశవ్యాప్తంగా వినియోగదారులనుంచి ఈ లగ్జరీ ఎస్‌యూవీకి మంచి స్పందన లభిస్తోంది. ఇక్కడే ఉత్పత్తి చేయడం ద్వారా గతంలో కంటే తక్కువ ధరకు కారును అందిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement