Kunchacko Boban Land Rover Defender: ప్రముఖ మలయాళీ నటుడు 'కుంచకో బోబన్' (Kunchacko Boban) ఇటీవల కొత్త 'ల్యాండ్ రోవర్ డిఫెండర్' (Land Rover Defender) కొనుగోలు చేశారు. ఖరీదైన కారు కొనుగోలు చేసిన ఇతడు దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కొనుగోలు చేసిన ఈ SUV ఇప్పుడు కుంచకో బోబన్ గ్యారేజిలో కూడా చేరింది. ఇది డిఫెండర్ 110 వెర్షన్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కారు ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 89.63 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. నటుడు కొనుగోలు చేసిన ఈ కారు కస్టమైజ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు.
సోషల్ మీడియాలో వెల్లడైన ఫోటోలలో కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ పూర్తిగా బ్లాక్ కలర్ పొందింది. అయితే రూప్ మాత్రం విభిన్నమైన కలర్ పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈయన గ్యారేజిలో టయోటా వెల్‌ఫైర్, పోర్షే కయెన్, మినీ కూపర్ ఎస్ వంటి మరిన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. కాగా ఖరీదైన కార్ల జాబితాలోకి ఇప్పుడు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కూడా చేరింది.
(ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో అత్యంత ధనవంతురాలైన హిందూ మహిళ.. సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?)
ల్యాండ్ రోవర్ డిఫెండర్
భారతదేశంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ రెండు బాడీ స్టైల్స్‌లో లభిస్తుంది. అవి 110 వెర్షన్, 90 వెర్షన్. 110 వెర్షన్ అనేది 5-డోర్ మోడల్ కాగా, 90 వెర్షన్ అనేది 3-డోర్ వెర్షన్. కుంచకో బోబన్ కొనుగోలు చేసిన 110 వెర్షన్ 5 డోర్ మోడల్. పరిమాణం పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది ఆధునిక టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ కూడా పొందుతుంది.
(ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం)
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 2.0-లీటర్, 3.0-లీటర్ పెట్రోల్, 3.0-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో లభిస్తుంది. డిఫెండర్ 110 అండ్ 90 వెర్షన్ల కోసం కంపెనీ 5.0-లీటర్ V8 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందిస్తుంది. ఇంజిన్లు స్టాండర్డ్‌గా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి. కావున మంచి పనితీరుని అందిస్తాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, 360 డిగ్రీ కెమరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment