Malayali star
-
సెలబ్రిటీల మనసుదోచే ఆ కారు మలయాళీ స్టార్ గ్యారేజిలో
Kunchacko Boban Land Rover Defender: ప్రముఖ మలయాళీ నటుడు 'కుంచకో బోబన్' (Kunchacko Boban) ఇటీవల కొత్త 'ల్యాండ్ రోవర్ డిఫెండర్' (Land Rover Defender) కొనుగోలు చేశారు. ఖరీదైన కారు కొనుగోలు చేసిన ఇతడు దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కొనుగోలు చేసిన ఈ SUV ఇప్పుడు కుంచకో బోబన్ గ్యారేజిలో కూడా చేరింది. ఇది డిఫెండర్ 110 వెర్షన్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కారు ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 89.63 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. నటుడు కొనుగోలు చేసిన ఈ కారు కస్టమైజ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సోషల్ మీడియాలో వెల్లడైన ఫోటోలలో కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ పూర్తిగా బ్లాక్ కలర్ పొందింది. అయితే రూప్ మాత్రం విభిన్నమైన కలర్ పొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈయన గ్యారేజిలో టయోటా వెల్ఫైర్, పోర్షే కయెన్, మినీ కూపర్ ఎస్ వంటి మరిన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. కాగా ఖరీదైన కార్ల జాబితాలోకి ఇప్పుడు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కూడా చేరింది. (ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో అత్యంత ధనవంతురాలైన హిందూ మహిళ.. సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?) ల్యాండ్ రోవర్ డిఫెండర్ భారతదేశంలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ రెండు బాడీ స్టైల్స్‌లో లభిస్తుంది. అవి 110 వెర్షన్, 90 వెర్షన్. 110 వెర్షన్ అనేది 5-డోర్ మోడల్ కాగా, 90 వెర్షన్ అనేది 3-డోర్ వెర్షన్. కుంచకో బోబన్ కొనుగోలు చేసిన 110 వెర్షన్ 5 డోర్ మోడల్. పరిమాణం పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది ఆధునిక టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ కూడా పొందుతుంది. (ఇదీ చదవండి: మెట్లెక్కిన మహీంద్రా స్కార్పియో ఎన్.. వైరల్ అవుతున్న వీడియో & ఫిదా అవుతున్న జనం) ల్యాండ్ రోవర్ డిఫెండర్ 2.0-లీటర్, 3.0-లీటర్ పెట్రోల్, 3.0-లీటర్ డీజిల్ ఇంజన్లతో లభిస్తుంది. డిఫెండర్ 110 అండ్ 90 వెర్షన్ల కోసం కంపెనీ 5.0-లీటర్ V8 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందిస్తుంది. ఇంజిన్లు స్టాండర్డ్‌గా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి. కావున మంచి పనితీరుని అందిస్తాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్, 360 డిగ్రీ కెమరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ట్రాక్షన్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. -
కింది మెట్టు
కింది మెట్టు లేకుంటే.. పై మెట్టు ఎక్కలేం. కింద.. మెట్టు లేకుంటే పై నుంచి దిగలేం. ఎగువ ఎక్కువ కాదు. దిగువ తక్కువ కాదు. ‘భార్య ఒక మెట్టు కింద ఉండాలి’ అనే మాటపై ఇప్పుడు నెట్లో మెట్లను కూలగొట్టేస్తున్నారు! ‘యానీస్ కిచెన్’లో ఎప్పటి మాటో అది. ఇప్పుడెవరో పైకి తీసి మంటను రాజేశారు. రెండేళ్ల క్రితం ఒక శనివారం. సాయంత్రం 7 గంటలు. అమృత టీవీలో ‘యానీస్ కిచెన్’ కార్యక్రమం మొదలైంది. అప్పటికి మూడేళ్లుగా ప్రసారం అవుతున్న ఆ కిచెన్‌ని హోస్ట్ చేస్తున్నది ప్రముఖ మలయాళీ నటి చిత్రా షాజీ కైలాస్. ఆ రోజు గెస్ట్‌గా వచ్చినవారు మరో నటి సరయు మోహన్. ఇద్దరి మధ్య సంభాషణ మొదలైంది. మధ్య మధ్య ఫలానా వంటను ఎలా చేయాలో ‘యానీ’ చెబుతున్నారు. చిత్ర అసలు పేరు అదే. యానీ! పెళ్లయ్యాక చిత్ర అని మార్చేశాడు భర్త. ‘‘ఈ భర్తలు ఎందుకు ఇలా చేస్తారు?’’.. యానీ. ‘‘ఎలా?’’.. సరయు. ‘‘వంట చెయ్యలేరు. చేసిన వంటకు పేర్లు పెడతారు’’. నవ్వారు సరయు. ‘‘ఏం మాట్లాడకుండా తినడం కన్నా, తింటూ ఏదో ఒక మాట అనడం నయం కదా’’ అన్నారు. ‘‘అసలు వీళ్లెందుకు భార్యాభర్త ఇద్దరూ సమానం అనుకోరు. హెల్ప్ చెయ్యరు. కష్టాన్ని గుర్తించరు’’. ‘‘గుర్తింపు అవసరం లేదు. వాళ్లను అలా వదిలేయడమే బెటర్. భార్య భర్త కన్నా ఒక మెట్ట కింద ఉంటే గొడవలే ఉండవు’’ అన్నారు సరయు. ‘‘ఎస్, కరెక్ట్’’ అన్నారు యానీ. ఇదిగో ఈ ముక్కే ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ‘‘ఒక మెట్టు కిందేమిటి! సరయు అంటే అనొచ్చు. హోస్ట్గారు సమర్థించడం ఏమిటి?’’. ట్రోలింగ్ మొదలైంది. యానీ మీద, యానీస్ కిచెన్ మీదా. ఈ లాక్డౌన్లో రెండు నెలలుగా ఆ ప్రోగ్రామ్ రావడం లేదు. లాక్డౌన్ తర్వాత కూడా రావడానికి లేదని డిమాండ్లు ట్వీట్ అవుతున్నాయి. మరి ఆరోజే ఎందుకు ఎవరూ ఏమీ అనలేదు.. రెండేళ్ల క్రితం! ఎవరూ సీరియస్‌గా తీసుకుని ఉండకపోవచ్చు. ఇప్పుడెవరో దానిని బయటికి తీసి రాజేశారు. గత వారం రోజులుగా తమపై వస్తున్న విమర్శలకు సరయు మాత్రం స్పందించారు. అప్పటికీ ఇప్పటికీ తన ఆలోచనా తీరు మారింది అన్నారు. భార్యాభర్త సమానం అన్నారు. యానీ మాత్రం ఈ విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు లేరు. ‘యానీస్ కిచెన్’కి గృహిణుల్లో మంచి ఆదరణ ఉంది. ఆ ఆదరణే తన సమాధానం అనుకున్నట్లున్నారు యానీ. యానీ కేరళ అమ్మాయి. క్రైస్తవ కుటుంబం. తల్లి మరియమ్మ. తండ్రి జాబీ. ముగ్గురు అక్కలు.. లిస్సీ, మేరీ, టెస్సీ. యానీ ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు తల్లి చనిపోయింది. యానీ తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కాలేజీలో చదువుకుంది. కాలేజీలో ఉండగానే సినిమా ఆఫర్ వచ్చింది. ఆమె తొలి చిత్రం ‘అమ్మాయనే సత్యం’ (అమ్మ మీద ఒట్టు) పెద్ద హిట్ అయింది. అందులో డబుల్ రోల్ యానీది. స్త్రీగా, పురుషుడిగా. రెండు మనస్తత్వాల మధ్య గీతను కాకుండా.. దంపతులను మధ్య కలతల్ని మాత్రం ఆమె చెరపదలచుకున్నట్లున్నారు. ‘యానీస్ కిచెన్’లో ఆమె ప్రబోధించే సర్దుబాటుకు అదొక్కటే కారణంగా కనిపిస్తోంది. నేను మారాను అవి రెండేళ్ల క్రితం నాటి అభిప్రాయాలు. ఇప్పుడు నా ఆలోచనలు మారాయి. కొత్తకొత్త స్నేహితులు, కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు అందుకు కారణం కావచ్చు. భార్య భర్తకంటే ఒక మెట్టు కిందే ఉండాలి అనే మాటను వెనక్కు తీసుకుంటున్నాను. స్త్రీ అయినా, పురుషుడైనా ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదు. – సరయు మోహన్ -
మెగాఫోన్ పట్టనున్న మళయాల బ్యూటీ
మళయాల భామ నిత్యామీనన్ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ ఇండస్ట్రీలో అవార్డ్ విన్నింగ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, విభిన్న పాత్రలతో అలరిస్తోంది. అంతేకాదు తెలుగు, తమిళ భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవటంతో పాటు అప్పుడప్పుడు గాయనిగా కూడా ఆకట్టుకుంటోంది. ఇలా మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇప్పుడు ప్రయోగానికి రెడీ అవుతోంది. త్వరలోనే దర్శకురాలిగా కూడా తన ప్రతిభ చూపించడానికి ప్లాన్ చేసుకుంటుంది. చాలా కాలంగా కథలు రాసే అలవాటు ఉన్న ఈ బ్యూటీ, ప్రస్తుతం తను డైరెక్ట్ చేయబోయే సినిమాకు కథను రెడీ చేసే పనిలో బిజీగా ఉందట. నటిగా కొనసాగుతూనే దర్శకత్వ శాఖలోని మెళకువలు తెలుసుకునే పనిలో ఉంది నిత్యామీనన్. అయితే నటిగా మంచి ఫాంలో ఉన్న సమయంలో డైరెక్టర్ గా మారితే యాక్టింగ్ కెరీర్ కష్టాల్లో పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మరి నిత్యా దర్శకురాలిగా మారటానికి మరికొంత సమయం తీసుకుంటుందా..? లేక రిస్క్ తీసుకుంటుందా..? చూడాలి.