మెగాఫోన్ పట్టనున్న మళయాల బ్యూటీ | Talented beauty Nitya menon to turn director | Sakshi
Sakshi News home page

మెగాఫోన్ పట్టనున్న మళయాల బ్యూటీ

Published Thu, Feb 25 2016 8:24 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

మెగాఫోన్ పట్టనున్న మళయాల బ్యూటీ

మెగాఫోన్ పట్టనున్న మళయాల బ్యూటీ

మళయాల భామ నిత్యామీనన్ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ ఇండస్ట్రీలో అవార్డ్ విన్నింగ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, విభిన్న పాత్రలతో అలరిస్తోంది. అంతేకాదు తెలుగు, తమిళ భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవటంతో పాటు అప్పుడప్పుడు గాయనిగా కూడా ఆకట్టుకుంటోంది.

ఇలా మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇప్పుడు ప్రయోగానికి రెడీ అవుతోంది. త్వరలోనే దర్శకురాలిగా కూడా తన ప్రతిభ చూపించడానికి ప్లాన్ చేసుకుంటుంది. చాలా కాలంగా కథలు రాసే అలవాటు ఉన్న ఈ బ్యూటీ, ప్రస్తుతం తను డైరెక్ట్ చేయబోయే సినిమాకు కథను రెడీ చేసే పనిలో బిజీగా ఉందట.

నటిగా కొనసాగుతూనే దర్శకత్వ శాఖలోని మెళకువలు తెలుసుకునే పనిలో ఉంది నిత్యామీనన్. అయితే  నటిగా మంచి ఫాంలో ఉన్న సమయంలో డైరెక్టర్ గా మారితే యాక్టింగ్ కెరీర్ కష్టాల్లో పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మరి నిత్యా దర్శకురాలిగా మారటానికి మరికొంత సమయం తీసుకుంటుందా..? లేక రిస్క్ తీసుకుంటుందా..? చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement