
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆర్సీ16 వర్కింగ్ టైటిల్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో ఆయన నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే అమెరికా వెళ్లి క్యాన్సర్ చికిత్స తీసుకుని ఇండియాకు తిరిగొచ్చారు. ప్రస్తుత చెర్రీ-బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మూవీ షూట్ కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. అయితే క్యాన్సర్ చికిత్స తర్వాత ఆయన పూర్తిగా మారిపోయినట్లు కనిపించారు.
భాగ్యనగరంలో అడుగుపెట్టిన శాండల్‌వుడ్ స్టార్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ఆయన సతీమణితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శివరాజ్‌కుమార్‌ను చూసిన భక్తులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. గతేడాది శివరాజ్‌కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరాతి రణగల్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. 2024లో శివరాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
#TFNExclusive: Actor @NimmaShivanna visits Shri Peddamma Talli Temple to seek divine blessings while in Hyderabad for #RC16 shoot🙏🏻✨#ShivaRajKumar #TeluguFilmNagar pic.twitter.com/SnkF2ZQQFo
— Telugu FilmNagar (@telugufilmnagar) March 23, 2025
Comments
Please login to add a commentAdd a comment